Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

జాతకాల్లో యోగాలు - ఫలితాలు

  • April 28, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)

  • జాతకాల్లో యోగాలు - ఫలితాలు
    జాతక చక్రంలో కొన్ని యోగాలు కలుగుతుంటాయి. వాటిలో కొన్నింటిని ఇస్తున్నాం.

    1. పంచానన యోగం
    జాతక చక్రంలో గ్రహాలన్నీ ఐదు స్థానాల్లో ఉన్నప్పుడు ఈ యోగం కలుగుతుంది. ఇటువంటి జాతకునికి అన్నవస్ర్తాదులు పుష్కలంగా ఉంటాయి.

    2. నీచభంగ రాజయోగం
    జాతక చక్రంలో లగ్నమందు నీచగ్రహం ఉన్నప్పుడు లగ్నాధిపతి గానీ, ఏ గ్రహమునకు ఆ లగ్నం ఉచ్ఛయగునో ఆ గ్రహము గానీ చంద్రుని లగాయతు కేంద్ర స్థానంలో ఉంటే లగ్నమందు ఉన్న గ్రహానికి నీచస్థితి తొలగి ఆ గ్రహ దశలో రాజయోగం కలుగుతుంది.

    3. ఉచ్ఛగ్రహ యోగం
    జాతక చక్రంలో రెండు గ్రహాలు ఉచ్ఛయందు ఉంటే ఆ జాతకుడు జీవితాంతం భాగ్యవంతుడు కాగలడు.

    4. విపరీత రాజయోగం
    6, 8, 12 స్థానాధిపతులు ముగ్గురూ గానీ లేదా ఇద్దరు గానీ 6, 8, 12 స్థానాలలో కలియుట లేక ఒకరి స్థానంలో మరొకరు గానీ ఉంటే ఆయా గ్రహాల దశలలో జాతకునికి విపరీత రాజయోగం కలుగుతుంది.

    5. అధియోగం
    జాతక చక్రంలో చంద్రుడు ఉన్న రాశి లగాయతు 6, 7, 8 స్థానాలలో ఏ స్థానమందైనా శుభగ్రహములు ఉంటే ఈ యోగం కలుగుతుంది. ఆయా స్థానాలలో ఒక్క గ్రహముంటే కీర్తిగల వ్యక్తి కాగలరు. రెండు గ్రహాలు ఉంటే రాజయోగం అనుభవిస్తారు. మూడు గ్రహాలు ఉంటే మహారాజయోగం అనుభవిస్తారు. అయితే ఈ స్థానాలకు ఎటువంటి దోషములు లేకుండా శుభగ్రహాలు బలంగా ఉండాలి.

    6. బుధాదిత్యయోగం
    జాతక చక్రంలో రవి, బుధులు మేషం, మిథునం, సింహం, కన్యారాశుల్లో కలిసి ఉంటే ఈ యోగం కలుగుతుంది. ఈ రాశుల్లో ఒకటి లగ్నమై అక్కడ రవి, బుధులు కలిసి ఉంటే రాజయోగం అనుభవిస్తారు. మిగిలిన చోట ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నా బుధాదిత్యయోగం కాదు.

    7. గజకేసరీ యోగం
    గురు, చంద్రులు కర్కాటక రాశియందు ఉన్నప్పుడు ఈ యోగం కలుగుతుంది. చంద్రునికి కేంద్ర స్థానంలో గురుడు ఉన్నా, లేక ఇతర స్థానాల్లో ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నా మిక్కిలి భోగభాగ్యాలు అనుభవిస్తారు.

    8. చంద్రమంగళ యోగం
    జాతక చక్రంలో చంద్రునికి కేంద్రమందు కుజుడు ఉన్నా, లేక ఈ రెండు గ్రహాలు కలిసి ఉన్నా ఈ యోగం కలుగుతుంది. ఈ యోగం కలిగిన వారు భాగ్యవంతులు కాగలరు.

    సుబ్రహ్మణ్య కవచం

  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • లేబుళ్లు:


  • సుబ్రహ్మణ్య కవచం



    సింధూరారుణ ఇందు కాంతి వదనం కేయూరహారాదిభిః 
    దివ్యైర్ ఆభరణై విభూషిత తనుం స్వర్గాది సౌఖ్య ప్రదం,

    ఆంభోజాభయ శక్తి కుక్కట ధరం,రక్తాంగ రాగోజ్వలం, 
    సుబ్రహ్మణ్యం ఉపాస్మహే,ప్రణమతాం భీతి ప్రణసోధ్యతం 


    సుబ్రహ్మణ్యో అగ్రత పాతు సేనాని పాతు పృస్థుతః 
    గుహోమాం దక్షిణే పాతు వహ్నిజ పాతుమామతః 


    శిరఃపాతు మహా సేన స్కంధో రక్షే లలాటకం, 
    నేత్రే మే ద్వాదశాక్షం చ శ్రోత్రే రక్షతు విశ్వభృత్ 


    ముఖం మే షణ్ముఖ పాతు నాసికం శంకరాత్మజ, 
    ఓష్ఠౌ వల్లీ పతి పాతు జిహ్వాంపాతు షడక్షకం 

    దేవసేనాధిపతి దంతన్ చుబకం బహుళాసుతః, 
    కంఠం తారక జిత పాతు బాహు ద్వాదశ బాహు మాన్ 


    హస్తౌ శక్తి దరః పాతు వక్ష పాతు శరోద్ భవ, 
    హృదయం వహ్ని భూ పాతు కుక్షిం పాత్వంబికాసుత 


    నాభిం శంభు సుత పాతు కటింపాతు హరాత్మజ,
    ఓష్టో పాతు గజారూఢో జహ్ను మే జాహ్నవీ సుత 


    జంఘో విశాకో మే పాతు పాదౌ మే శిఖి వాహన,
    సర్వాంగణి భూతేశ సప్త ధాతుంశ్చ పావకి


    సంధ్యా కాలే నిశీదిన్యాం దివ ప్రాతర్ జలే అగ్నేషు, 
    దుర్గమే చ మహారణ్యే రాజ ద్వారే మహా భయే 


    తుమలే అరణ్య మధ్యే చ సర్పదుష్టమృగాధిషు,
    చోరాదిసాధ్యసంభేధే జ్వరాది వ్యాధి పీడనే


    దుష్ట గ్రహాది భీతౌ చ దుర్నిమిత్తాది భీషణే,
    అస్త్ర శస్త్ర నిపాతే చ పాతుమాంక్రౌంచరంధ్ర కృత్ 


    య: సుబ్రహ్మణ్య కవచం ఇష్ట సిద్ధి ప్రద: పఠేత్, 
    తస్య తాపత్రయం నాస్తి సత్యం సత్యం వదామ్యహం 


    ధర్మర్ధీ లభతే ధర్మం ఆర్తార్థీ చ ఆర్త మాప్నుయాత్,
    కామార్తీ లభతే కామం మోక్షర్థీ మోక్షమాప్నుయాత్ 


    యత్ర యత్ర జపేత్ తత్ర తత్ర సన్నిహితో గుహ,
    పూజా ప్రతిష్ఠ కాలేచ జపేకాలే పఠేత్ సదా


    సర్వాభీష్టప్రదాం తస్య మహా పాతక నాశనం,
    య:పఠేత్ శృణుయాత్ భక్త్యా నిత్యం దేవస్య సన్నిధౌ 


    సుబ్రహ్మణ్య ప్రసాదేన హ్యపమృత్యు సో అంతే
    ఆయురారోగ్యం ఐశ్వర్యం పుత్రపౌత్రభి వర్ధనం, 
    సర్వకామాన్ ఇహ ప్రాప్య సొంధే స్కంధ పురం వృజేత్


    Monday, August 2


    సుబ్రహ్మణ్యస్వామి


    గౌరీ శంకరుల మంగళకర ప్రేమకు,అనుగ్రహానికి ఐక్య రూపంసుబ్రహ్మణ్యస్వామిషణ్ముఖుడు,కార్తీకేయుడువేలాయుధుడు,కుమారస్వామి గా పేరు గడించినస్వామి కారణజన్ముడు.తారకాసురుడుసురావణుడుమరికొందరు రాక్షసులు ప్రజలను,దేవతలను హింసిస్తూ ఉండేవారు. అసురల బారి నుండి కాపాడమనిబ్రహ్మను కోరగాశివ పార్వతులకుజన్మించిన పుత్రుడు వారినివధిస్తాడని చెప్పాడు రకంగాపార్వతి పరమేశ్వరుల అనుగ్రహం తోకుమారస్వామి పుట్టుకవిలక్షనమైనది.

    శివాంశతో జన్మించినసుబ్రహ్మణ్యస్వామి గంగాదేవి గర్భంలో పెరుగుతాడు.గంగాదేవి  పుత్రుని భారంమోయలేక రెల్లు పొదల్లోకి జారవిడుస్తుందిఅప్పుడు 
    కృత్తికా దేవతలు ఆరుగురు తమస్తన్యమిచ్చి పెంచుతారురెల్లు పొదల్లో పెరిగినందువల్ల శరవణుడు అనికృత్తికా దేవతలుపెంచినందు వల్ల కార్తికేయుడని పేరు వచ్చినది అని పురాణాలు చెబుతున్నాయిఆరుముఖాలు కలిగినందు వల్లనా షణ్ముఖుడు అని అంటారునెమలి వాహనం కలిగినస్వామి గణేశునికి సోదరుడుఆరు ముఖాలలో ఐదు పంచేంద్రియాలకుఒకటిమనసుకు ప్రతీక.
    స్వామి
     అనే నామధేయం సుబ్రహ్మణ్య స్వామి కి మాత్రమే సొంతంసేనాపతిగా సకలదేవగణాల చేత పూజలు అందుకొనే సుబ్రహ్మణ్యుని అనుగ్రహం పొందితే గౌరిశంకరులకటాక్షం లభిస్తుందని ప్రతీతితారాకాసురుడిని సంహరించిన కుమార స్వామి మార్గశిరమాసం శుక్లపక్ష షష్టినాడు జన్మించాడుఆరు ముఖాలుపన్నెండు చేతులు సూర్యతేజస్సుతో జన్మించిన షణ్ముఖుని ఆరాధించడం వలన సమస్తదోషాలు తొలగిశుభాలుకల్గుతాయని భక్తుల నమ్మకంఆషాడమాస శుక్ల పక్ష పంచమిషష్టిని పర్వదినాలుగాజరుపుకొంటారుశుక్ల పక్ష పంచమిని స్కంద పంచమనిషష్టిని కుమార షష్టి అనిభావించి భక్తులు  రెండు రోజుల విశేష పూజలు చేస్తారు
    పంచమి
     నాడు ఉపవాసం ఉందిషష్టి నాడు కుమారస్వామి ని పూజించినట్లైతే నాగదోషాలు తొలగుతాయనిజ్గ్యానం వృద్ధి కలుగుతుందనికుజదోషాలు తొలగుతాయని,సంతానం కలుగుతుందని నమ్మకం.

    దేవాలయం

  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)

  • దేవాలయం

    దేవుని వద్ద కొబ్బరి కాయను కొట్టేది  ఎందుకు?
     
    సర్వదేవతలను పూజించే సమయాల్లోను, యజ్ఞ హోమదుల్లోను కొన్ని శుబకార్యాల్లోను కొబ్బరికాయను  కొట్టడం తప్పనిసరి. కొబ్బరికాయ
    పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతిక.  ఎప్పుడైతే  కొబ్బరికాయను  స్వామి ముందు కోడతామో  మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని, లోపలున్న తెల్లని కొబ్బరిలా  మన మనసు స్వామి ముందు పరిచామని తద్వారా  నిర్మలమైన కొబ్బరి నీరులా
    తమ జీవితాలను ఉంచమని అర్థం. 
     
    గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు?
     
    "ప్రదక్షిణం "  లో  "ప్ర"  అనే అక్షరము  పాపాలకి నాశనము,  "ద" అనగా  కోరికలు తీర్చమని,  "క్షి"  అనగా  అజ్ఞానము  పారద్రోలి  ఆత్మ జ్ఞానము ఇమ్మని.    గుడిలో భగవంతుడి  చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో  ఇంత అర్థం ఉంది.  పూర్వం  ఆదిలో వినాయకుడు  పార్వతి, పరమేశ్వరుల చుట్టూ  తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన  ఫలం  పొందాడు.  కాబట్టి  భగవంతుని  చుట్టూ చేసే  ప్రదక్షిణ  విశ్వా ప్రదిక్షణ
    అవుతుంది.  ఆత్మ ప్రదక్షిణ అవుతుంది.   భగవంతుడా  నేను అన్ని వైపులా నుంచి  నిన్నే అనుసరిస్తూ ద్యానిస్తున్నాని   అర్థం. 
     
     ఏ గుడికి  ఏ  ఏ  వేళల్లో వెళితే ఎంత పుణ్యం?
     
    ఉదయాన్నే  శ్రీ మహావిష్ణువు  ఆలయానికి,  సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి  వెళ్ళడం మంచిది.   శ్రీ మహావిష్ణువు  స్థితికారుడు.
    కాబట్టి ఆయన  మన జీవన పోరాటంలో  నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు.  మన బుద్ధి  ద్వార ఆపదలను తొలగించి  మనల్ని 
    సుఖంగా ఉండేలా  చూస్తాడు. 
    మహేశ్వరుడు  లయకారుడు.  కాబట్టి రోజు పూర్తి  అవుతున్న సమయంలో  దర్శిస్తే  రెట్టింపు ఫలాన్ని అందిస్తాడు.  తొందర పడకుండా
    ప్రశాంతంగా నెమ్మదిగా  భగవంతున్ని  దర్శించాలి.
     
     గుడికి వెళ్ళేటప్పుడు తలస్నానం చేసి వెళితే  మరింత శుబమా?
     
    తలస్నానం   చేసి వెళితే శరీరం మొత్తం శుచిగా  ఉంచుకొని దర్శనం చేసుకున్నట్టు.   మన నిత్య కృత్యాలతో మనసు ఎల్లప్పుడూ అనేక విధాలుగా  కామ,  క్రోధ, లోభ ,మదాలతో  నిండి ఉంటుంది.  ఆ మనసుని  పవిత్రంగా 
    పరిశుద్ధంగా  చేసుకొని వెళ్ళే ఆధ్యాత్మిక శక్తి మనకు లేదు కనుక  కనీసం శరీరం  మొత్తాన్ని శుబ్రపరచుకొని దర్శించుకున్తున్నాము.
    ఈ శరీరంలా  మనసుని శుచిగా, నిర్మలంగా ఉండేలా చెయ్యమనే అర్థమే  పూర్తి స్నానం యొక్క   భావము.
     
    గుడిలో  శడగోప్యం (శతగోపనం)  తలమీద పెట్టడం ద్వారా ఎం ఫలితం వస్తుంది?
     
    దేవాలయం లో దర్శనం అయ్యాక  తీర్ధం, శాదగోపం తప్పక తీసుకోవాలి.  శతగోపనం అంటే అత్యంత రహస్యం. అది పెట్టె పూజారికి  కూడా విన్పించానంతగా కోరికను తలచుకోవాలి.  అంటే మీ కోరికే శదగోపం.   మానవునికి శత్రువులైన   కామం. క్రోధం, లోభం, మొహం మదం, మాత్సర్యములు  వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవడం మరో అర్ధం.
    షడగోప్యం ను రాగి,కంచు, వెండి లతో తయారు చేస్తారు.  పైన విష్ణు పాదాలు ఉన్ట్టాయి. షడ గోప్యమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినపుడు విద్యుదావేశం జరిగి మనలోని అధిక విద్యుత్
    బయటికివేలుతుంది.  తద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశం తగ్గుతాయి.
     
    దేవాలయాల్లో తల నీలాలు ఎందుకు సమర్పిస్తారు?
     
    బ్రతుకు జీవన పోరాటంలో మనం చెప్పే అబద్ధాలకు, చిన్న మోసాలకు అంతే ఉండదు.  మనావుడు చేసే సర్వ కర్మల పాపఫలం  వెంట్రుకలను చేరుతుంది. అందుకే పాపాలకి నిలయమైన వెంట్రుకలను స్వామికి సమర్పించి, స్వామి ఇంతవరకు పాపాలను వదిలేస్తున్నాను. ఇకపై  మంచిగా, ధర్మంగా, న్యాయంగా ఉంటానని చెప్పడమే తలనీలాలు ఇవ్వడము.
     
     దేవాలయపు వెనుక బాగాన్ని ఎందుకు తాకరాదు?
     
    చాల మంది ప్రదిక్షినలు చేస్తున్నప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని అద్ది నమస్కరిస్తుంటారు.  అలా  చేయరాదు.  ఆ బాగంలో  రాక్షసులు ఉంటారు. అలాగే ఆలయానికి  గజం దూరం నుంచి ప్రదిక్షిణ చేయాలి.
     
    దేవాలయంలో ప్రదిక్షిణ చేసేటప్పుడు ఎలా  నడవాలి?
     
    వింటి నుంచి వెలువడ్డ బాణంలా వెనేకేవరో  తరుముతున్నట్టు  ప్రదిక్షణం చేయరాదు.  నిండు గర్భిని  నడిచి నట్టు అడుగులో అడుగు వేస్తూ అడుగడుగునా దేవుణ్ణి స్మరిస్తూ ప్రదిక్షణలు పూర్తి చేయాలి.  అలాగే అర్ధ రాత్రి, మధ్యాహానము  దైవదర్శనం చేయరాదు.
     
    గుడిలో ఎలా ఉండాలి?
     
    గట్టిగ నవ్వడము, అరవడము,ఐహిక విషయాల గురించి మాటలాడడం చేయరాదు.  గుడి పరిసరాలని పరిశుబ్రంగా ఉంచాలి.  బగవంతున్ని  కనులార వీక్షించి  ఆపై  కనులు మూసుకొని ధ్యానం చేయాలి.   దేవాలయం లో నిలుచుని తీర్థం తీసుకోవాలి.  ఇంట్లో  కూర్చుని తీర్దం పుచ్చుకోవాలి.  దీపారాధన శివుడికి ఎడమ వైపు, శ్రీ మహా విష్ణువుకు కుడివైపు చేయాలి.  అమ్మవారికి  నూనె దీపమైతే
    ఎడమపక్కగా, ఆవు నేతి దీపమైతే కుడు వైపు వెలిగించాలి. 

    వివాహము

  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)

  • వివాహము

    వివాహ పద్ధతులు ఎన్ని, అవి ఏవి?
     
    కన్యను అలంకరించి వరునికి ఇచ్చి జరిపించే  వివాహం బ్రహ్మ వివాహం,  యజ్ఞం చేయడం కోసం రుత్విక్కుకు కన్యని దక్షిణగా  ఇవ్వడం దైవవివాహం, ఆవు, ఎద్దు దానం చేసి ఆపై కన్యను ఇవ్వడం ఆర్ష వివాహం, మహానుభావునికి ప్రియురాలిగా సహధర్మచారిణి  గ ఉండమని ఆదేశించి కన్యను ఇవ్వడం ప్రాజాపత్య వివాహం, తల్లి, తండ్రి అనుమతి లేకుండా ఇరువురు చేసుకోవడం  గాంధర్వ  వివాహము,  షరతు పెట్టి వివాహం చేసుకోవడం అసుర వివాహం,  కన్యను బలాత్కారంగా తీసుకెళ్ళి వివాహం చేసుకోవడం రాక్షస వివాహం, కన్య నిదురపోతున్నప్పుడు, ఏమరు పాటుగా ఉన్నప్పుడు చేసుకున్న వివాహం పైశాచిక వివాహం. 
     
    పెళ్ళిలో వధూవరులు ఒకరిపై ఒకరు  తలలపై జీలకర్ర, బెల్లం పెట్టేదేందుకు?
     
    మంత్రాలతో వధూవరుల నెత్తి మీద జీలకర్ర,బెల్లం పెట్టేది శుభాసూచికముతో  పాటు శరీరంలో ఉన్న దోషాలు పోవాలని,  జీలకర్ర, బెల్లంలా వారిరువురు కలసి మెలసి ఉండాలని.  జీలకర్ర, బెల్లం పెట్టె సమయమే వధూవరుల తొలిస్పర్శ .ఎప్పుడైతే ఒకరినిఒకరు తాకుతారో అప్పుడే పెల్లయిపోయినట్టు.
     
    తలంబ్రాలు పోసుకునేదేందుకు?   
     
    ప్రధమంగా నాలుగుసార్లు ఒకరిపై ఒకరు పోసుకొని ఆపై పోటిపడి ఒకరిపై ఒకరు సంతోషంగా పోసుకుంటారు.  ఆ సమయాన మంత్రాలకు అర్ధం సంతానం వృద్ధి చెందాలని మగవాడు, ధన ధాన్యాలు వృద్ధి చెందాలని వధువు ....ఇలా సమస్త సంపదలు, సుఖాలు కావాలని ఇరువురు భగవంతున్ని కోరుకోవడమే తలంబ్రాల ఉద్దేశము.
     
    సప్తపది అనగా ఏంటి?
     
    వరుడు వధువుని  ఏడడుగులు నడిపిస్తూ.... నన్నే సదా అనుసరించు, పరమేశ్వరుడు నీవు నాతో నడిచే అడుగుతో మనల్ని ఒకటిగా చేయాలి. ఇంకా అన్నాన్ని, శక్తిని, బుద్ధిని , సుఖాన్ని పశువ్రుద్ధిని, రుతు సంపదను, ఋత్విక్ సంపదను కలగచేయాలి.  ఇరువురము ధర్మ,మోక్ష, సుఖ కార్యాలను కలసి చేద్దాము.
     
    పెళ్ళిలో మంగళసూత్రం కట్టడంలో పరమార్ధం ఏంటి?
     
    పెల్లికోడుకైన నేను నీ మేడలో మాంగల్యం కడుతున్నాను,  నా, నీ జీవనం  ఈ క్షణం నుండి ప్రారంభం.  నిండు నూరేళ్ళు పూర్ణ ఆయుస్శుతో మనం కలసి ఉండాలి. రెండు తాళి బొట్లు గౌరీ శంకరులు.  పరస్పరం ఒక్కటై అత్తింటి వార్నీ,  పుట్టింటి వారిని రెండు తాలిబోట్ల వలె సదా కలిపి ఉంచి సుఖంగా జీవితాన్ని గడుపుదామని పరమార్ధం.   
     
    పెళ్ళిలో అల్లుడి కాళ్ళు మామ గారెందుకు కడుగుతారు? 
     
    ఓ పెండ్లి కూమారుడా  పంచ భూతాల సాక్షిగా, అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన నా పుత్రికను , నా కన్యమనిని,  ధర్మ, అర్థ, కామ , మోక్షాలకై నీకు అర్పిస్తున్నాను, దానమిస్తున్నాను.  ఈ దానం వల్ల నాకు బ్రహ్మ లోక ప్రాప్తి కావాలని అడుగుతున్నాను....
    "ఓ వరుడా......నీవు ఈ సమయాన సాక్షాత్తు శ్రీమన్నారయనుడవి,  నా బిడ్డ లక్ష్మి దేవి, కాబట్టి అంతటి నీకు కాళ్ళు కడుగుతున్నాను" అని వధువు తండ్రి వరుని కాళ్ళు కడుగుతాడు. అందుకే అంతా వారిపై అక్షితలు వేసి,  శ్రీ లక్ష్మి నారాయనులుగా భావించి నమస్కరిస్తారు.
     
      నల్ల పూసలు ధరించేది ఎందుకు?
     
    మంగళ సూత్రంతో పాటు నల్ల పూసలు గొలుసుగా ధరించడం మన హిందూ సాంప్రదాయం.  దుష్ట శక్తులు తన మాంగల్యం మీద పడకుండా  ఉండటానికి ముక్యంగా ధరిస్తారు.  అంతే కాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి, దానానికి, సుఖానికి చిహ్నాలు.  నల్లపూసలు మంగళకరమైన, సౌభాగ్యమైన ఆభరణము.
     
    భర్త, భార్యను ఎప్పుడు తాకాలి?
     
    వివాహాది మంత్రాల ప్రకారమూ, సామాజిక ధర్మం ప్రకారం, భార్యకు కడుపు నిండా తిండి పెట్టి , కప్పుకోవడానికి, సిగ్గును దాచు కోవడానికి బట్టలివాలి. అన్ని వైపులా నుంచి రక్షణ, భద్రత ఇవ్వాలి. ఆ తర్వాతే స్త్రీని తాకాలి.  అట్టి వాడే స్త్రీకి అత్యంత దగ్గరిగా వెళ్ళడానికి అర్హుడు.
     
    భార్య, భర్తకు ఏ వైపుగా  ఉండాలి?
     
    సమస్త కార్యాలలోను ఎడమ పక్కనే ఉండాలన్న నియమాన్ని శాస్త్రం చెప్పడం లేదు. పూజాదికాలు నిర్వహించే టప్పుడు, దానాలు,ధర్మాలు చేసే సమయాన భార్య, భర్త ఎడమవైపున ఉండాలి.   కన్యాదాన సమయాన, విగ్రహ ప్రతిష్టలప్పుడు
     కుడి వైపున ఉండాలి. 
    బ్రహ్మ దేవుడు మగవాడ్ని కుడి భాగం నుంచి, స్త్రీని ఎడమ భాగం నుంచి సృష్టించాడని శాస్త్రాలు చేపుతున్నంయి.   శ్రీ మహా విష్ణు శ్రీ మహా లక్ష్మిని ఎడమ స్థానంలో పదిలంగా ఉంచుకుంటాడు.

    పూజ విధానం

  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)

  • పూజ విధానం

    గృహమందు  పూజలు చేయువారు ఈశాన్య గదులందు కాని,వాయువ్య గదులందు కాని పూజలు చేయాలి. అలాగే తూర్పు ఉత్తర దిశా లో ఉన్న గదులలో చేయాలి .  పూజ చేయు వారి ముఖము
    ఉత్తరమునకు  అభిముఖముగా కాని, తూర్పు కు అభిముకముగా కాని ఉండాలి.
     దీపారాధనకు వేరుశనగ నూనే ను వాడితే అరిష్టములు కలుగును.  ఆవు నెయ్యి తో చేసిన ఐశ్వర్యము, ఆరోగ్యము, సంతోషముకలుగును. నువ్వుల నూనె తో చేస్తే దుష్ట శక్తి భాధలు, శత్రు బాధలు తోలుగుతాయి.
    ఆముదము తో చేస్తే ఎకగ్రత ,కీర్తి ప్రతిష్టలు, స్నేహితులు పొందుతారు. కొబ్బరి నూనె గణపతి పూజ కు మేలు చేయును.
    ఆవు నెయ్యి, పిప్పి నూనె, వేప నూనె కలిపి దీపారాధన చేయుట మంచిది. 
    వెండి కుందులు, పంచ లోహ కుందులు మంచివి. మట్టి కుందులు మాద్యమము. స్టీలు కుందులు అధమము.  
     
    పూజ సమయమున అరుణ వస్త్రములు ధరించుట మేలు. పూజ ను విగ్నేశ్వర పూజ తో ప్రారాబించి, ఆంజనేయ పూజతో ఆపుట ఆచారము . పూజ చేస్తూ ఇతరులతో మాటలాడటం, హాస్యముగా వ్యవహరించడము తప్పు.  

     

     దీపారాధన

     దేవతారాధన చేయుటకు ముందు ఒక వైపు ఆవు నేతితో, మరొక వైపు నువ్వుల నూనె తో దీపరాదన చేయవలెను. వీటిని సుదర్శన, పాశుపతములు అని పిలుస్తారు. 
    అగరావత్తులు, ఎకహరతి, కర్పూర హారతి ఇవ్వవలసి వచినప్పుడు  వీని నుండి వెలిగించ రాదు.  
     
    దేవతామూర్తి అభిషేకానికి కేవలం మంచి నీటిని (శుద్ధోదకము) వాడరాదు.  నిషిద్దం. తులసి దళమును కాని, పచ్చ కర్పూరం కాని శ్రీ గంధం కాని చేర్చి ఆ ఉదకముతో దేవతముర్తికి 
    అభిషేకం చేయవలెను. 
     
    వినాయకునికి ఒక ప్రదిక్షణ , సూర్యునికి ''2  '' శివునకు ''3'' , విష్ణువుకు''4'' రావిచెట్టు కు ''7'' ప్రదిక్షణలు చేయవలెను. 
     
     
    దీపారాదనలో తెలియకుండా చేసే పొరపాట్లు
     
    స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు.
    అగ్గిపుల్లతో దీపాన్ని  వెలిగించారాదు.
    ఒకవత్తి దీపాన్ని  చేయరాదు. ఏక వత్తి శవం వద్ద వెలిగిస్తారు.
    దీపాన్ని అగరవత్తి తో వెలిగించాలి.
    దీపారాధన మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి.
    విష్ణువుకు కుడివైపు  ఉంచాలి. ఎదురుగ దీపాన్ని ఉంచరాదు.
    దీపం కొండెక్కితే  "ఓమ్  నమః  శివాయ " అని 108 సార్లు
    జపించి దీపం వెలిగించాలి.

     

    అరుందతికి ఉపదేశించిన వత్తుల దీపారాధన

    శ్రీ మహలక్ష్మి, శ్రీ గౌరీ, మహా సరస్వతులైన ముగ్గురమ్మలు జ్యోతిర్యోపసనాను అరుందతికి ఉపదేశించారు. ఐదు వత్తుల దీపారాధన చేయటం వల్ల తొలి వత్తి భర్త సమస్త కోరికలు తీరుటకు, రోండవ వత్తి సంతాన యోగక్షేమాల కోసమూ, మూడవ వత్తి పుట్టింటి మరియు అత్తింటి క్షేమము కొరకూ, నాలుగవ వత్తి కీర్తి, గౌరవము కొరకు, ఐదవ వత్తి సకల ఆరిష్టాలను పొగొట్టుటకు, 
    దుఃఖము నుంచి విముక్తి కొరకూ.
     
    ఒక వత్తి దీపారాధన చేయవలదు.
     
    షోడశోపచార పూజావిధి - పరిచయం
     
    మన ఇంటికి వచ్చిన పెద్దలని ఏ విధంగా ఆహ్వానించి  మర్యాద  చేస్తామో అదే మన ఇష్ట దైవాన్ని కూడా పూజ పరంగా మర్యాద
    చేయడమే షోడశ (పదహారు)  ఉపచారాల విధానం. ఈ విధానం
    ప్రతీ దేవత పూజలోను పాటించి తీరాలి.
     
    ఆవాహనము:  మనస్పూర్తి గా మన ఇంట్లోకి స్వాగతం పలకడం.
     ఆసనము:  వచ్చినవాళ్ళు కూర్చునేందుకు ఏర్పాటు చేయడం.
    పాద్యము:  కాళ్ళు కడుగుకునేందుకు నీళ్ళను ఇవ్వడం.
    అర్ఘ్యము:  చేతులు పరిశుబ్ర పరచడం
    ఆచమనీయము: దాహం (మంచినీళ్ళు) ఇచ్చుట
    స్నానము:  ప్రయానాలసట తొలిగే నిమ్మిత్తం
    వస్త్రము:  స్నాన అనంతరం - పొ(మ)డి బట్టలివ్వడం
    యజ్ఞోపవీతము:  మార్గ మధ్యంలో మైలపడిన - యజ్ఞోపవీతాన్ని  మార్చడం
    గంధం:   శరీరం మీద సుగంధాన్ని చిలకడం
    పుష్పం:  వాళ్ళు కూడా సుగంధాన్ని ఆస్వాదించే ఏర్పాటు.
    దూపము:  సుఘంధ మయ వాతావరణాన్ని కల్పించడం
    దీపము:  పరస్పరం పరిచయానికి అనుకూలత కోసం
    నైవధ్యము: తన స్థాయి అనుసరించి - తనకై సాధించిన దానినే ఇష్ట దైవానికి కూడా ఇవ్వడం.
    తాంబూలం:  మనం భక్తి తో ఇచ్చిన పదార్థాల వల్ల - వారి    ఇష్టాయిష్టాలకి(రుచులకి) కలిగే - లోపాన్ని తొలగించడం
    నమస్కారం:     గౌరవించడానికి సూచన
    ప్రదక్షిణం:  ముమ్ముర్తుల వారి గొప్పదనాన్ని అంగీకరించడం.

    శ్లోకాలు

  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)

  • సర్వ దేవతా   శ్లోకాలు

    పూజను విగ్నేశ్వరుని ప్రార్ధనతో  ప్రారభించి  ఆంజనేయస్వామి  ప్రార్ధనతో  ముగించాలి.
    గణపతి స్తోత్రం :
     
            శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం 
            ప్రస్సన్న వదనం ధ్యాయే సర్వ విగ్నోప శాంతయే
            అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
            అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే.   
     
            వక్రతుండ మహాకాయ  కోటి సూర్య  సమప్రభ
            నిర్విగ్నం కురుమేదేవ సర్వకార్యషు సర్వదా
     
    గాయత్రి స్తోత్రం:
      
            ఓమ్ భూర్భువఃస్సువః తస్త వితుర్వ రేన్యం 
            భర్గో దేవస్య ధీ మహి  ధియోయోనః ప్రచోదయాత్
     
    అన్నపూర్ణ దేవి స్తోత్రం:
     
            అన్నపూర్ణే సదా పూర్ణే  శంకర ప్రాణ వల్లభే
            జ్ఞాన వైరాగ్య సిధ్యర్థం బిక్షాం దేహి చ పార్వతి 
     
    మహా లక్ష్మి స్తోత్రం:
     
            విష్ణు ప్రియే నమస్తుబ్యం నమస్తుబ్యం జగద్వదే
            ఆర్తహంత్రి నమస్తుబ్యం  నమస్తుబ్యం కురుమే సదా
            నమో నమస్తే మాహం మాయే శ్రీ పీటే సురపూజితే
            శంకు చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే.
     
    సరస్వతి దేవి స్తోత్రం:
     
            సరస్వతి నమస్తుబ్యం వరదే కామ రూపిణి
            విద్యారంబం కరిష్యామి సిద్ధిర్భవతు  మే సద
     
    పూజప్రారంబించే ముందు ముందుగ ఈ కింది శ్లోకాన్ని 
    పటించి ప్రారంబిస్తే మంచిది.
     
    సర్వ మంగళ మాన్గాల్యే శివే సర్వార్దాసారకే 
    శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే  
     
    విజయదశమి (దసరా)రోజు  ఈ కింది శ్లోకాన్ని పటిస్తే  సకలశుబాలు కలుగుతాయి.  ఈ శ్లోకాన్ని రోజు  పటించిన కోరుకున్న కోరికలు  తీరుతాయి.
     
    శమి శమయతే పాపం, శమి శత్రు వినాశనం
    అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని .
     
    (శమి అనగా జమ్మి వృక్షం)
     
    శ్రీకృష్ణుని స్తోత్రం:
     
    కస్తూరి తిలకం లలాటే ఫలకే, వక్షస్తలే కౌస్తుబం
    నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం , కరే కంకణం
    సర్వాంగే హరిచందనంచ కలయన్ కంటేచ ముక్తావలిం
    గోపాస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమని.
     
     
    శ్రీ వేంకటేశ్వరుని  శ్లోకం:
     
    విన వెంకటేశం ననాదో ననాద
    సదా వెంకటేశం స్మరామి స్మరామి
    హరే వెంకటేశం ప్రసీద ప్రసీదః
    ప్రియం వేంకటేశo ప్రయచ్చ ప్రయచ్చ.
     
     
    శ్రీ రాఘవేంద్రుని శ్లోకం:
     
    పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మ రతాయచ
    బజతాం కల్పవ్రుక్షాయ  నమతాం కామదేనువే
     
    సుబ్రమణ్య స్వామి:
     
    ఓంకార రూపం ఫణిరాజ వేషం, పలనిమల వాసం,
    శ్రీ స్వామినాథం,శ్రీదేవదేవం,శ్రీవల్లినాధం,
    శ్రీసుబ్రమణ్యం మనసాస్మరామి
    శ్రీసుబ్రమణ్యం శిరసా నమామి.
     
    మృత్యుంజయ మంత్రము:
     
    ఓమ్ త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం
    ఉర్వారుకమివ బంధనాత్ మ్రుత్యోర్మోక్షీయ మామృతాత్.
     
    సకల విద్యా ప్రాప్తికి   హయగ్రీవ స్తుతి :
     
    జ్ఞానానందమయం దేవం నిర్మలం స్పటికాక్రుతిం
    ఆధారం సర్వవిధ్యానం హయగ్రీవ ముపాస్మహే
     
    యగ్నోపవీత ధారణ  మంత్రము
    :
    ఓమ్  యజ్ఞోపవీతం  పరమం పవిత్రం ప్రజపతేర్యత్సహజం  పురస్తాత్
    ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు  తేజః
     
     
    శనికి ప్రీతికర  దశనామములు :
     
    శనైశ్చరః, యమః, కోణః ,  పింగాలః , బ్రభుహ్,  కృష్ణాః , రొద్రః,
    అంతః , కాష్రిహి,  మందః.  
    ఈ పది పేర్లు  పటించువారి జోలికి శని పోడు.  ఇవి శనైశ్చర
    ప్రీతికర నామములు.
    శ్రీ రామ శ్లోకాలు:
     
    1.     శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
            సహస్ర నామ తతుల్యం శ్రీ రామ నామ వరాననే
     
    2.    శ్రీ రాఘవం దశరతాత్మజ మప్రయోగం
            సీతాపతిం రఘుకులాన్వయ రత్న దీపం
            ఆజానుబాహుం  అరవింద దలయ తాక్షం
            రామం విషాచర వినాశకరం నమామి
    3   ఆపదపమహార్తారం దాతారం సర్వసంపదాం
         లోకాబిరామం శ్రీరాం భూయో భూయో నమామ్యహం.
     
    సూర్యుడు
     
     భానో భాస్కర మార్తాండ చందరష్మి దివాకర 
    ఆయురారోగ్యమ్యశ్వర్యం శ్రియం పుత్రాంశ్చ దేహిమే   
     
     నవగ్రహ ప్రార్ధనలు 
     
    సూర్యుడు:
     
    జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం 
    తమోరిం సర్వపాపగ్నం  ప్రణతోస్మి దివాకరం.
     
    చంద్రుడు:
     
    దధి శంఖ తుషారంబం క్షీరోదార్ణవ సంభవం
    నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం 
     
    కుజుడు:
     
    ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం 
    కుమారం శక్తి హస్తం చ మంగళం ప్రణమామ్యహం. 
     
    బుధుడు:
     
     ప్రియంగు గుళికా శ్యామం రూపేన ప్రతిమం
    బుధం సౌమ్యం సౌమ్య గునేపేతం తం బుధం ప్రణమామ్యహం.
     
    గురుడు:
     
    దేవానాం చ ఋషినాం చ గురుం కాంచన సన్నిభం
    బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం.
     
    శుక్రుడు:
     
    హిమకుంద మ్రునాలాభం ధైత్యన, పరమం గురుం,
    సర్వశాస్త్ర ప్రవక్తార భార్ఘవం ప్రణమామ్యహం.
     
    శని:
     
    నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
    ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం.
     
    రాహువు:
     
    అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం
    సింహిక గర్బసంభూత తం రాహు ప్రణమామ్యహం.
     
    కేతువు:
     
    ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం
    రౌద్రం రౌద్రాత్మకం ఘోరం కేతుం ప్రణమామ్యహం. 
     
     
    నవగ్రహ ప్రార్ధన:
     
    ఆదిత్యాయచ  సోమాయ మంగళాయ బుదాయచ
    గురు శుక్ర శనిబ్యచ్చ  రాహవే కేతువే నమః
     
    ఆంజనేయ స్వామి ప్రార్దన:
     
    మనోజవం మారుతతుల్య వేగం
    జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
    వాతాత్మజం వానర యూద ముఖ్యం
    శ్రీరామ దూతం శిరసా నమామి.
     
    శ్రీ  నారాయణ ద్వాదశాక్షరి మంత్రము:
     
    "ఓమ్ నమో భగవతే వాసుదేవాయ " 
     
    శ్రీ శివ పంచాక్షరి మంత్రము:
     
    ఓమ్ నమః శివాయ
     
    అష్టాక్షరి మహా మంత్రం:
     
    ఓమ్ నమో నారాయణాయ
     
    సంతాన వేణుగోపాల స్వామి  
     
    సంతానం లేని వారు  సంతాన వేణుగోపాల స్వామిని  41రోజులు ఈ క్రింది శ్లోకంతో  పూజించవలెను.రోజు 27 సార్లు  కాని, 56 సార్లు కాని, 108 సార్లు కాని పటిస్తే ఫలితం   ఉంటుంది. .   
    108సార్లు పటిస్తే మంచి ఫలితాన్ని  పొందవచ్చు. చిన్ని కృష్ణుని 
    ఫోటోను ముందు పెట్టుకొని పూజించ వలెను. 
     
    దేవదేవాఖిలాదీశ  మమ వంశాభివ్రుద్ధయే
    స్వపత్యం దేహిమే కృష్ణ త్వమాహాం శరణం గతః
     
    ఏతద్వ్రతం  సద్గురూప దేశే నైవ గ్రాహ్యం
                గురు దక్షిణ
     
    గురురోతీర్ణ తాకేనా శిష్యరాత్మ నివేదనం
    అభావే స్వ యధా శక్తి ధ్యేయం సద్గురు దక్షిణ
    భక్తి శ్రద్ధ విరోదేన  మండలం వ్రతమాచరేత్
    యధాబిష్టం సుసంసిద్ధి  తత్పూర్వో  ద్యాపనం కురు
    నాభిష్ట వ్రతసంసిద్ధి  వినాసద్గురు దక్షిణ 
    కలౌ పరాష రోక్తానం వ్రతనామేవ
    ఓమ్ నమః పరమాత్మనే

    రామేశ్వరము

  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • రామేశ్వరము
    (జయ) భారతదేశ సముద్ర ప్రాంతానికి, ఆగ్నేయ భాగం లో, ఇసుకతో కూడిన చిన్న ద్వీపం 'రామేశ్వరం'. ఈ ప్రాంతము నుండే, శ్రీ రాముడు లంకకు వారధి ఏర్పరచుకుని, రావణ సంహారానికి తరలి వెళ్ళాడు. ఇక్కడ వెలసిన స్వయంభూ లింగమే 'రామేశ్వరుడు'. ఈ ప్రాంతం లో సముద్రం కేవలం నది లాగ, 3 cm కంటే తక్కువ ఎత్తులో అలలతో వుండటం విశేషం. రాముల వారు, లంకకు వారధి కట్టటం కోసం, సముద్రుడు తన ఉద్రుతాన్ని తగ్గించి, ఎప్పటికి అలాగే ఉండిపోవటమే, దీనికి కారణం అని పురాణాలు చెబుతున్నాయి. ఈ వారధిని "సేతు బంధం" లేదా 'రామ సేతు' అని కూడా అంటారు. ఎక్కడా లేని వింత జరిగినప్పుడు, అది తప్పక నిజమే అయి ఉంటుందనేది, నమ్మదగిన సత్యం. ఈ ద్వీపం, విష్ణుమూర్తి 'పాంచజన్యం' ఆకారం లో వుండటం మరొక విశేషం.

    కాశీ, రామేశ్వరము యాత్ర చేసినవారికి సకల పాపాలు హరించి, జన్మ చరితార్ధకమవుతుందని నానుడి. కాశీ నుంచి గంగ నీరు తీసుకువచ్చి ఇక్కడ స్వామీ వారికి అభిషేకించి, మరల ఇక్కడ నుండి ఇసుక తీసుకు వెళ్లి, కాశీ లో గంగ లో కలపటం, ఒక ఆచారంగా చాలా మంది భక్తులు, పాటిస్తున్నారు. ఇక్కడ దాదాపు 51 తీర్దాలు ఉన్నాయి. వాటిలో 22 ఆలయ ప్రాంగణం లో నే ఉంటాయి. అన్నిటికి లో కంటే, 'అగ్ని తీర్థం' లో స్నానమాచరించటం, ఇక్కడ చాలా విశేషం. మరికొన్ని విశిష్టత కలిగిన తీర్థాలు, రామ తీర్థం, సీతా కుండ్, జటా తీర్థం, లక్ష్మణ తీర్థం, కపి తీర్థం, పాండవ తీర్థం, కోదండరామ తీర్ధం, బ్రహ్మ తీర్థం..మొదలైనవి. దాదాపు 1000 స్తంభాలు, వాటి మీద అందమైన శిల్పకళా దృశ్యాలతో, అతి మనోహరంగా ఉండే, ఈ పుణ్యక్షేత్రం, చూడటం, ఒక సంప్రదాయ ధర్మం గా పెద్దలు పాటిస్తారు.

    స్థల పురాణం:
    శ్రీ రామచంద్రమూర్తి , రావణ సంహారం గావించాక, తిరిగి వచ్చు సమయం లో, ఈ ప్రాంతానికి వచ్చి, శివునికి అర్ఘ్యం ఇచ్చు వేళ అవటంతో, హనుమంతుల వారిని, కాశీ నుండి ఒక లింగం తెమ్మని ఆదేశిస్తాడు. కాని, హనుమంతుడు రావటం కొంత ఆలస్యం అవటంతో, సీతమ్మ వారు ఇసుకతో ఒక లింగాన్ని చేయగా, రాముడు ఆ లింగానికి షోడశోపచారాలు, సమర్పిస్తాడు. ఒక విధంగా, రావణ హత్యా పాతకం నుంచి కూడా శుద్ధి గావించుకొనుట కోసం కూడా రాముడు శివలింగాన్ని పూజించాడని, ఒక పురాణం. ఆ సమయం లో శివుడు ప్రత్యక్షమై, రాముని ఆశీర్వదించగా, లోక కళ్యాణార్ధం ఇక్కడే కొలువుండమని, రాముడు శివుడిని కోరుకుంటాడు. శివుడు, రాముని కోరిక ప్రకారం జ్యోతిర్లింగమై, సర్వజన సంక్షేమం కోసం కొలువున్నాడు.

    అయితే, హనుమంతుల వారు లింగం తో తిరిగివచ్చి, అప్పటికే రాములవారు, శివ లింగం చేయటం చూసి, చాలా బాధ పడగా, ఆ లింగాన్ని కూడా అక్కడ ప్రతిష్టించి, 'విశ్వనాధుని' గా, ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. 'రామేశ్వరుని' చూసే ముందు, 'విశ్వనాథ' లింగాన్ని దర్శించటం ఇక్కడ ఆనవాయితీ. ఇక్కడ శివుని రామేశ్వరునిగా, మరియు పార్వతి దేవి 'పర్వతవర్ధిని' గా కొలుస్తారు.
    ఇక్కడ కోదండరామాలయం, కూడా విశిష్టమైనది. విభీషణుడు, ఈ రామాలయం ఉన్న చోటనే, రాములవారిని కలిసి, భక్తితో పూజించినట్లు పురాణం.
    'రామేశ్వరం' లో నాగప్రతిష్ట చేసినవారికి, సర్పదోషాలు, తొలగిపోతాయని ప్రతీతి.

    ఉదయం 4 గం నుండి రాత్రి 10 గం, వరకు దేవాలయం భక్తుల దర్శనార్ధం తెరిచి వుంటుంది. రాత్రి చివరి దర్శనానంతరం, అయ్యవారు మరియు పార్వతి దేవి, ఉత్సవిగ్రహాలను, బంగారు ఉయ్యాలలో పవళింపు సేవ గావించటంతో ఆ రోజు స్వామివారి సేవలు ముగుస్తాయి.

    ప్రతి మహాశివరాత్రి మరియు ఆషాడమాసం 15 వ రోజు, ఇక్కడ పెద్ద ఉత్సవాలు నిర్వహిస్తారు. భారతదేశ మరియు నేపాల్ ప్రజలు ఎక్కువగా ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.
    ఈ ప్రాంతంలో నే 'ధనుష్కోడి' అనే చిన్న గ్రామం వుంది. రాముల వారు రావణ సంహారం అయ్యాక, తన బాణం తో, వారధి ని ఒక వైపు తెగ్గొట్టటం వల్ల, ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. అంతే కాకుండా, వారధి నిర్మించేముందు, ఇక్కడ వారధి చివరి అంచు కోసం గుర్తుగా బాణం వేసినట్లు కూడా ఒక కధ. ఇక్కడి నుండి, లంకకు కేవలం చాల తక్కువ దూరం. (భారతదేశ మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం, ఈ 'ధనుష్కోడి' ప్రాంతం వారే).

    ఇంకా చెప్పినకొద్దీ మహిమాన్విత విశేషాలతో కూడిన, ఈ 'రామేశ్వరం' భక్తి, ముక్తి ప్రదాయకం. ఓం నమః శివాయ. 

    కుమార సంభవం

  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)

  • కుమార సంభవం| Print |
    మహాగ్రంథాలు - శ్రీ శివ మహాపురాణము
    మొత్తం ఆరు స్థానాలలో(అగ్ని, మునిపత్నులు, వాయువు, హిమవంతుడు, గంగ, రెల్లుపొదలు) పరిపక్వమైన శివవీర్యం కుమారిస్వామి అనే శిశువుగా పరిణతి చెందింది.

    ఆ శిశువు రెల్లుపొదల్లో క్యారుక్యారుమని ఏడుస్తూంటే, అక్కడికొచ్చిన విశ్వామిత్రుడు లోకోత్తర తేజంతో వెలిగిపోతున్న అ బాలుడ్నిచూసి తపోదృష్టితో జరిగిందంతా గ్రహించాడు.

    శివ వీర్యసంజాతుడైన ఈ శిశువు అసామాన్య శౌర్య పరాక్రమ వంతుడైన శక్తిధరుడని ఎరిగి శిరస్సు వంచి నమస్కరించాడు.

    జాతకర్మాది వైదిక ప్రక్రియలను పూర్తిచేసి తనను వొడ్డున పడేయ మన్నాడు కుమారస్వామి. తాను పుట్టుకతో బ్రాహ్మణుడనుకాను గనుక తనకా అర్హతలేదన్నాడు గాధేయుడు.

    బ్రాహ్మణుడిగా, శిష్ట గురువుగా తాను విశ్వామిత్రుడిని అనుగ్రహిస్తున్నట్లు కుమారస్వామి చెప్పడంతో, జాతకర్మలు నిర్వర్తించడానికి - పురోహితుడుగా విశ్వామిత్రుడొప్పుకున్నాడు.

    ఆ తరువాత ఏతెంచిన అగ్నిదేవుడు, కుమారుని చేరదీసి 'శక్తి' అనే ఆయుధాన్ని ప్రసాదించగా, వెంటనే దానిని పరీక్షించడానికి గాను ఒక పర్వతశిఖరాన్ని ఆ ఆయుధంతోతుత్తునియలు చేసిన సాహసీ; అత్యుత్సాహి కుమారస్వామి.

    ఆరుగురు మునిపత్నులూ చేరి, కుమారస్వామిని తమబిడ్డగా భావించడంతో వారు ఆరుగురి వద్దా ఏక కాలంలో స్తన్యం స్వీకరించాడు. షాణ్మాతురుడయ్యాడు.

    కైలాసం చేరుకున్న కుమారుడు:

    ఒకనాడు శివపార్వతుల మధ్య అనురాగ సంగమవేళ ప్రసంగ వశాన - ఆనాటి రేతఃపతన ప్రస్తావన వచ్చింది. ఆ విషయం ఇప్పుడేల? పోనిమ్మన్నాడు ఈశ్వరుడు. అమ్మవారు ఊరుకోలేదు. ఆ వీర్యఫలితం ఎలా పరిణమించినా తనకే కావాలంది. అసలు తన భర్త వీర్యోగ్రత భరించడం ఎవరి వశం? అనే నమ్మకం చేత కూడా ఆవిడ అలా అన్నది.

    వెంటనే శివుడు త్రిలోకవాసుల కర్మములకు సాక్షిభూతులైన ధర్మ, సూర్య, చంద్ర, వాయు, అగ్ని, జల, భూ , రాత్రిందివ సంధ్యలను రప్పించి సర్వకర్మసాక్షులైన మీకు తెలియని అంశములుండవు. నా తేజోపుంజము వెలువడినది మొదలు రేతో రూపమున ఎక్కడెక్కడ ఏయే రీతుల పరిణమించినదీ వివరించమన్నాడు. వారందరి వల్లా కుమార స్వామి జనన విశేషాలు తెలిసికొన్న ఆదిదంపతులు, " అట్లయినచో అతడు మన కుమారుడే గనుక కైలాసమున వసించుటకు అన్ని విధాలా తగినవాడు" అనడంతో పార్వతీదేవి "అవునవును! పుత్రుని చూడ నాకు కూడా మిక్కిలి వేడుకకగా ఉన్నది" అన్నది. వెంటనే ఆదిదేవుడు కుమారస్వామిని కైలాసానికి తీసుకురావలసిందిగా నందీశ్వరుడికి అనుజ్ఞ ఇచ్చి పంపించాడు.

    మరుక్షణమే - తన అనుచరగణంతో కృత్తికులున్నచోటు (షష్ఠ మాతృకలున్న ప్రదేశం)కు బయలుదేరిన నందీశ్వరుని అత్యుత్సాహం సమరసన్నాహాన్ని తలపించేదిగా ఉంది. అదే సంరంభంతో కార్తికేయుడున్న తావుకు చేరుకున్న నందీశ్వర గణాలను చూసిన కృత్తికలు భయపడి కుమారునితో చెప్పుకున్నారు. అభయం ఇచ్చిన కుమారస్వామి, విషయం విచారించి రమ్మని తన సన్నిహితులను పంపాడు.

    నందీశ్వరుడు సగౌరవంగా తనను కైలాసానికి ఆహ్వానింప వచ్చాడని తెలిశాక కుమారస్వామి సంతోషించి "ఈ మాతలు నన్ను విడిచి ఎట్లుందురు? వీరి పుత్రవత్సల్యమే నన్నింత వాడిని చేసినది" అని పలికాడు. కుమారస్వామిని శివపార్వతులు కైలాసానికి రప్పించు కోవాలనుకుంటున్న సంగతి తెలియడంతో కృత్తికలు కూడా ఖేదవదనలయ్యారు.

    వారికి జ్ఞానోపదేశం చేసి "తల్లులారా! వేదప్రామాణికత ననుసరించి షోడశ మాతృదేవతలు. కడుపున మోసినది, పాలిచ్చి పెంచినది, ఆహారం అందించినది, గురుపత్ని, ఇష్టదేవతాపత్ని, తండ్రి భార్య, సవతి తల్లికి పుట్టిన స్త్రీ సంతానం, మేనత్త/ (మేనమామ భార్య), భార్య తల్లి(అత్తగారు), తల్లి తోబుట్టువులు, అమ్మమ్మ, నాన్నమ్మ, సోదరుని భార్య, సహోదరి, సోదరుల కుమార్తెలు, పుత్రుని భార్య...ఈ 16 మంది మాతృ సమానులు. కనుక పార్వతీమాత ఆజ్ఞ చొప్పున నేను తప్పక కైలాసమునకు వెళ్లి తీరాలి" అంటూ అనునయించాడు.

    విశ్వకర్మ తనకొరకు ప్రత్యేకంగా నిర్మించి ఇచ్చిన రథాన్ని అధిరోహించి, నంది వీరభద్రాదులు వెంటరాగా కైలాసానికి బయల్దేరాడు కుమారస్వామి.

    ఆ దృశ్యం, ఆ ఆరుగురు తల్లులకూ కంటనీరు తెప్పించగా, వారికి ధైర్యం చెప్పి "మాతల్లారా! మిమ్ములను విడిచి వెళ్లాలన్నది నా అభిమతం కాదు! అందరం కర్మాధీనులమే కద! అది తప్పించ శక్యం కానిది! ఈ కలయికలు - విడిపోవుటలు అంతా కర్మవశాన జరిగేవే! మీరు కూడా నాతో కైలాసానికి రావలసింది" అని కోరాడు కుమారస్వామి.

    అందరూ కలిసి కైలాసానికి చేరుకున్నారు. అక్కడ అప్పటికే వారికి, అపూర్వ స్వాగత సత్కార సంరంభాలు సాగుతున్నాయి. శివపార్వతుల సన్నిధిననిలిచిన కార్తికేయ మహాశక్తిధరుడు శిరసు వంచి ప్రణామాలాచరించాడు ఆదిదంపతులకు. వారి దీవెనలు అందుకున్నాడు.

    ఒకానొక శుభ ముహూర్తమున గొప్ప సభచేసిన శంభుడు, కుమారస్వామికి సర్వదేవసేనాదిపతిగా పట్టాభిషేకం నిర్వర్తించాడు. శాంభవీ విద్యప్రసాదించాడు. వివిధ దైవత ప్రముఖులు దివ్యమైన అస్త్ర శస్త్రాలను,వెలలేని కానుకలను సమర్పించుకున్నారు.

    అత్యంత వైభవంగా జరిగిన ఆ పట్టాభిషేక మహోత్సవంతో బాటే, కుమారస్వామి కల్యాణంకూడా జరగడం ఇంకొక విశేషం! ప్రజాపతి, తన కుమార్తెయైన దేవసేన నిచ్చి కుమారస్వామితో వివాహం జరిపించాడు.

    అట్టి మహదానంద సమయంలో, సదానంద స్వరూపుడైన చంద్రశేఖరుడు, దేవతలందరికీ అడిగినదే తడువుగా వరాలు ప్రసాదించ సంకల్పించాడు.

    తమకు అందరికీ కలిపి ఉన్న ఒకే ఒక కోరిక - 'దుష్టశిక్షణార్ధం ఆవిర్భవించిన కుమారస్వామిని, తారకాసురునిపై యుద్ధానికి పంపుటయే' అని చెప్పగా శివుడు మహానందంగా అనుగ్రహించి, కొడుకును ప్రేరేపించాడు.

    దానవాధిపతి తారకునికీ - దేవాధిపతి కుమారునికీ భీకరపోరు సంప్రాప్తమైంది. ఆ మహాయుద్ధంలో వీరభద్రాదులందరూ కుమారునికి బాసటగా నిలవగా, కలకలం రేపే రక్కసి మూకలు చెల్లా చెదురయ్యాయి.

    అతిలోక భయంకరంగా సాగుతున్న ఆ యుద్ధం అవసాన దశకు చేరుకొనే లోపల రాక్షసవీరులు అగణితంగా అసువులు బాశారు.

    తనకు అగ్నిదేవుడు ప్రసాదించిన 'శాంత శూలం ' చేబట్టాడు శక్తిధరుడు. దంపతుల్లో కెల్లా ఆదిదంపతులూ - ఆదిదేవతలూ అయిన శివపార్వతులను మనస్సులో ధ్యానించి తన వేలాయుధంతో ఓ భీషణ ప్రహారాన్నిచ్చాడు.

    అంతే! తారకాసురుడు ఓ పెనువృక్షం తుఫాను దెబ్బకు కూలినట్లు నేలకూలాడు.

    అన్ని లోకాలా కుమారప్రభ దివ్యత్వం వెల్లివిరిసింది.

    బ్రహ్మచారి కార్తికేయుడు

  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • కార్తికేయుడు శివ పార్వతుల కుమారుడు. ఒక రోజు కార్తికేయుడు ఒక పిల్లితో ఆడుకుంటున్నాడు. ఆటలో అతడు దాని ముఖము మీద గిల్లాడు. ఆట అవగానే అతడు తన తల్లి పార్వతి దగ్గరకు వెళ్ళాడు.అతనికి తన తల్లి బుగ్గ మీద గిల్లిన గాయం కనిపించింది. అప్పుడతడు "అమ్మా నీ బుగ్గ మీద ఆ గాయమేమిటి, ఎంత పెద్ద దెబ్బతగిలిందమ్మా, అసలెలా తగిలింది " అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి, "నువ్వే కదా నాయనా గిల్లావు" అని సమాధానము చెప్పింది.

             కార్తికేయుడు నివ్వెరపోయి "అమ్మా, నిన్ను నేనెప్పుడు గిల్లాను?నాకేమి గుర్తులేదే" అని అన్నాడు. అప్పుడు పార్వతి "నాయనా ఈ రోజు వుదయము నువ్వు ఆ పిల్లిని గిల్లవు మరచిపోయావా" అని అడిగింది. కార్తికేయుడు, "అది నిజమే!మరి నేను ఆ పిల్లిని గిల్లితే నీ బుగ్గ మీద ఎందుకు గాయమయ్యింది?" అని అడిగాడు. అప్పుడు ఆ జగజ్జనని, "నాయనా! ఈ ప్రపంచములోని ప్రతి ప్రాణిలోనూ నేను వున్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే ! అందువల్ల నువ్వు ఎవరిని గాయపరచినా నన్ను గాయపరచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు చాలా ఆశ్చర్యపోయాడు. జీవితంలో తానెప్పటికి పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరు స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించినపుడు తను ఎవరిని పెళ్ళాడగలడు, అందువలన కార్తికేయుడు బ్రహ్మచారిగా జీవితాంతము వుండి పోయాడు.

    సుబ్రహ్మణ్య

  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • తారకాసురుడనే రాక్షసుడు వరగర్వంచేత విజృంభించి లోకాలను అల్లకల్లోలం చేస్తూ ఇంద్రాది దేవతలను భయపెట్టసాగాడు. బ్రహ్మదేవుడు కూడా ఏమీ చేయలేని స్థితిలో శివుని కుమారుడు తప్ప వేరెవ్వరూ ఆ రాక్షసునితో తలపడలేరని చెప్పాడు. దేవతలంతా కుమార సంభవానికి ఎదురుచూశారు. కుమారస్వామి జననం, కుమారసంభవంగా లోక ప్రసిద్ధిని పొందింది. శివపార్వతులొకసారి ఏకాంతంలో ఉండగా ఇంద్రుడు గ్రహించి తనను మించిన ప్రభావంగల పుత్రుడు వారికి జన్మిస్తాడేమోనని భయపడి క్రీడాభంగం కావించాలని నిర్ణయించుకుని వారి క్రీడకు అంతరాయం కలిగించమని అగ్నిదేవుణ్ణి పంపిస్తాడు. అగ్నిని చూడగానే శివపార్వతుల ఏకాంతానికి భంగం కలుగుతుంది.
    పార్వతి ఈ విషయాన్ని గ్రహించి కోపగించి అగ్నిదేవునితో భూమిపై పడిన శివుని వీర్యాన్ని ధరించమని శపిస్తుంది. అగ్ని కొంతకాలం ధరించిన తర్వాత తాను ఆ శివతేజస్సును భరించలేకపోయి గంగ దగ్గరకు వెళ్లి నీవు ధరించదగినదానవు కాబట్టి నీవు దీనిని ధరించి నన్ను రక్షించమని కోరతాడు. గంగ ఒప్పుకుని ఆ గర్భాన్నైతే తాను ధరించింది కానీ కొంతకాలానికి ఆమెకు కూడా అది దుర్భరం కాసాగింది. దానిని ఆమె రెల్లుగడ్డిలో విడిచిపెట్టింది. అక్కడనుంచి సూర్యరశ్మికి పెరిగి బాలుడు ఉదయించాడు. ఆ బాలుడే కుమారస్వామి. ఇతడిని చూసి దానవులు ఆశ్చర్యపోయారు. కృత్తికా దేవతలు ఇతనికి పాలిచ్చారు.
    దేవతలు కుమారస్వామిని సేనాధిపతిగా చేసుకుని తారకాసురునిపైన యుద్ధానికి పంపించారు. మహా ఘోర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రాక్షసులు హతులైనారు. తారకాసురుడిని కుమారస్వామి సంహరించాడు. ఈ మహత్కార్యాన్ని నెరవేర్చిన దేవతలకు ఆనందాన్ని కలిగించాడు. కుమారస్వామి సైన్యాధిపత్యాన్ని వహించడానికి వెనుక ఒక కథ వుంది. ఆరు ముఖాలను ధరించి శోభిస్తున్న కుమారస్వామిని చూడడానికి పార్వతి, శివుడు ఇతర దేవతలు వచ్చి ఇతని బాల్యచేష్టలకు అబ్బురపడి ఎవరి దగ్గరకు వస్తాడో, అని ఆడిస్తూ వుండగా ఆ బాలుడు అన్ని రూపాలు ధరించి అందరి దగ్గరకు వచ్చాడు. ఈ ప్రభావానికి ఆశ్చర్యపడి వారంతా సైన్యాధిపత్యాన్ని ఇచ్చినట్లు స్కాందపురాణం వల్ల తెలుస్తున్నది. కుమారస్వామి శూరపద్మాసనుడు అనే రాక్షసుణ్ణి వధించినందుకు మెచ్చుకొని ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేననిచ్చి వివాహం చేశాడు. శాఖుడు, విశాఖుడు, నైగమేషుడు, పృష్టజుడు అనేవారు కుమారస్వామి పుత్రులు, కుమారస్వామికి ఆరుగురు కృత్తికలు పాలివ్వడంవల్ల కార్తికేయుడనే పేరు వచ్చింది. ఆరు ముఖాలతో ఒక్కొసారి అతడు పాలను పానం చేశాడు కాబట్టి షణ్ముఖుడైనాడు. స్ఖలితమైన రేతస్సువలన పుట్టినవాడు కాబట్టి స్కందుడనే పేరు కలిగింది. మంచి బ్రహ్మజ్ఞానం కలిగినవాడైనందువల్ల సుబ్రహ్మణ్యుడైనాడు. సు అంటే పరిపూర్ణత అని అర్థం.
    సృష్టించే బ్రహ్మకంటే పరిపూర్ణతత్త్వంతో కూడుకున్న సుబ్రహ్మణ్య స్వరూపాన్ని పరబ్రహ్మతత్త్వంగా కుమారతంత్రం తెలియచేసింది. శ్రీలంక, మలేషియా దేశాలలో సుబ్రహ్మణ్య ఆరాధన జరుగుతున్నది. పళని, పెన్‌మధురచొళె, త్రిపురకుండ్రం, తిరుత్తని, సుబ్రహ్మణ్య మొదలైన క్షేత్రాలు మన దేశంలో విలసిల్లుతున్నాయి.

    నామ నక్షత్రాలు అధిదేతలు వర్ణం రత్నం

  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)

  • నామ నక్షత్రాలు అధిదేతలు వర్ణం రత్నం 

    నక్షత్రంఅధిదేవతవర్ణంరత్నంనామంగణంజంతువునాడిదిక్కువృక్షంగ్రహం
    అశ్వనిఅర్ధనారీశ్వరుడుపసుపువైడూర్యంచూ,చే,చో,లదేవగణంగుర్రంఆదినైఋతిఅడ్డరసకేతువు
    భరణిరవిఆకాశనీలంవజ్రంలీ,లూ,లే,లోమానవగణంఏనుగుమధ్యదేవదారుశుక్రుడు
    కృత్తికఅగ్నికావిమాణిక్యంఆ,ఈ,ఊ,ఏరాక్షసగణంమేకఅంత్యఔదంబరసూర్యుడు
    రోహిణిచంద్రుడుతెలుపుముత్యంఒ,వా,వృ,వోమానవగణంపాముఅంత్యజంబుచంద్రుడు
    మృగశిరదుర్గఎరుపుపగడంవే,వో,కా,కిదేవగణంపాముమధ్యచంఢ్రకుజుడు
    ఆరుద్రకాళిఎరుపుగోమేధికంకూ,ఘ,బ,చమానవగణంకుక్కఆదిరేలరాహువు
    పునర్వసురాముడుపసుపుపుష్పరాగంకే,కో,హా,హీదేవగణంపిల్లిఆదివెదురుగురువు
    పుష్యమిదక్షిణామూర్తిపసుపు,ఎరుపునీలంహూ,హే,హో,డాదేవగణంమేకమధ్యపిప్పిలిశని
    ఆశ్లేషచక్రత్తాళ్వార్కావిమరకతండి,డూ,డె,డొరాక్షసగణంపిల్లిఅంత్యనాగకేసరిబుధుడు
    మఖఇంద్రుడులేతపచ్చవైడూర్యంమా,మి,మూ,మేరాక్షసగణంఎలుకఅంత్యమర్రికేతువు
    పూర్వఫల్గుణిరుద్రుడుశ్వేతపట్టుపచ్చమో,టా,టి,టూమానవగణంఎలుకమధ్యమోదుగశుక్రుడు
    ఉత్తరఫల్గుణిబృహస్పతిలేతపచ్చమాణిక్యంటే,టో,పా,పీమానవగణంగోవుఆదిజువ్విసూర్యుడు
    హస్తఅయ్యప్పముదురునీలంముత్యంపూ,ష,ణ,డదేవగణందున్నఆదకుంకుడుచంద్రుడు
    చిత్తవిశ్వకర్మఎరుపుపగడంపే,పో,రా,రీరాక్షసగణంపులిమధ్యతాటికుజుడు
    స్వాతివాయువుతెలుపుగోమేధికంరూ,రే,రో,తదేవగణందున్నఅంత్యమద్దిరాహువు
    విశాఖ నక్షత్రముమురుగన్పచ్చపుష్పరాగంతీ,తూ,తే,తోరాక్షసగణంపులిఅంత్యనాగకేసరిగురువు
    అనూరాధమహాలక్ష్మిపసుపునీలంనా,నీ,నూ,నేదేవగణంలేడిమధ్యపొగడశని
    జ్యేష్టఇంద్రుడుశ్వేతపట్టుమరకతంనో,యా,యీ,యూరాక్షసగణంలేడిఆదివిష్టిబుధుడు
    మూలనిరుతిముదురుపచ్చవైడూర్యంయే,యో,బా,బీరాక్షసగణంకుక్కఆదివేగిసకేతువు
    పూర్వాషాఢవరుణుడుబూడిదవజ్రంబూ,దా,థా,ఢామానవగణంకోతిమధ్యనెమ్మిశుక్రుడు
    ఉత్తరాషాఢగణపతితెలుపుమాణిక్యంబే,బో,జా,జీమానవగణంముంగిసఅంత్యపనసరవి
    శ్రవణామహావిష్ణుకావిముత్తుఖీ,ఖూ,ఖే,ఖోదేవగణంకోతిఅంత్యజిల్లేడుచంద్రుడు
    ధనిష్టచిత్రగుప్తుడుపసుపుపట్టుపగడంగా,గీ,గూ,గేరాక్షసగణంగుర్రంమధ్యజమ్మికుజుడు
    శతభిషభద్రకాళికాఫిగోమేదికంగో,సా,సీ,సూరాక్షసగణంగుర్రంఆదిఅరటిరాహువు
    పూర్వాభాద్రకుబేరుడుముదురుపసుపుపూససే,సో,దా,దీమానవగణంసింహంఆదిమామిడిగురువు
    ఉత్తరాభాద్రకామధేనుగులాబినల్లపూసదు,శం,ఛా,దామానవగణంగోవుమధ్యవేపశని
    రేవతిఅయ్యప్పముదురునీలంముత్యందే,దో,చా,చీదేవగణంఏనుగుఅంత్యవిప్పబుధుడు