chakra_ganesh
అన్ని గ్రహములు ఒక చోటు నుండి ఇంకొక చోటుకు నడిచేవిగానే వుండును. అన్ని గ్రహముల వాటి వేగాను సారముగా నడుచు చుండును. కొన్ని గ్రహములు వేగముగాను మరికొన్ని గ్రహములు మందముగాను వాటి గతి అనుసారముగా నడుచును. గ్రహముల ఈ గతిని గోచరమని అనెదరు (The movement of planets through the zodiac is called transit). గ్రహముల గోచరము జ్యోతిష్య శాస్త్రములో మహత్వ పూరితమైన స్థానమును కలిగి వుండును. గ్రహముల గోచరము అదారముగా జ్యోతిష్య విధి నుండి ఫలితములను విశ్లేషణ చేసెదరు.
ప్రత్యేక గ్రహము యతి జన్మ రాశిలోకి ప్రవేశించునప్పుడు లేదా జన్మ రాశి నుండి రెండవ, మూడవ, నాల్గవ, ఐదవ, ఆరవ, ఏడవ, ఎనిదవ, తొమ్మిదవ, పదవ, పదకొండవ మరియు పన్నెండవ స్థానములో వుండిన ఎడల అప్పుడు వారి గుణములు మరియు దోషములకు అనుకూలముగా వ్యక్తిపై ప్రభావమును కలిగించును (The planetary transits affects the native according to the planet’s qualities). గోచరములో ఈ గ్రహముల ప్రభావము గోచరము యొక్క ఫలితముగా చెప్పదగును. శని, రాహువు, కేతువు మరియు గురువు మందగతి గల గ్రహములు (Saturn, Rahu, Ketu and Jupiter travel slowly. They are called slow planets) అనగా ఇవి వ్యక్తి యొక్క జీవితముపై అధిక ప్రబావము కలిగి వుండును. అందువలన గోచరములో వీరి ఫలితములు విశేష మహత్యమును కలిగి వుండును. అన్య గ్రహముల గతి తీవ్రముగా వుండును. కాని అవి అధిక సమయము వరకు ప్రబావమును కలిగించవు (Fast planets move through the sign quickly and do not have a lasting impact on the native).
సూర్యుని యొక్క గోచర ఫలితములు: (Predictions for Transit of Sun)
గోచరములో సూర్యుడు తృతీయ, షష్టమ, దశమ మరియు ఏకాదశ బావములలోని ప్రవేశించును. అప్పుడు ఇది శుభ ఫలదాయిగా వుండును. ఈ బావములలో సూర్యుని గోచరము సుఖమయముగా వుండును. ఈ భావములలో సూర్యుడు ప్రవేశించిన ఎడల ఆరోగ్యము అనుకూలముగా వుండును. మిత్రుల నుండి సమ్యోగము, శత్రువుల పరాభవము మరియు ధన లాభము కలుగును. ఈ స్థితిలో సంతానము మరియు జీవిత బాగస్వామి నుండి సుఖము లభించగలదు. దానితో పాటు రాజకీయ రంగము నుండి కూడా శుభ ఫలితములు లభించగలవు. సూర్యుడు యది ప్రధమ, ద్వితీయ, త్రితీయ, చతుర్ధ, పంచమ, సప్తమ, అష్టమ, నవమ మరియు మరియు ద్వాదశ (Sun’s transit through the first, fourth, fifth, seventh, eighth, ninth and twelth house is in auspicious) బావములలో ప్రవేశించిన మానసిక అశాంతి, అనారోగ్యము, కుటుంబ సమస్యలు మిత్రులతో వొడిదుడుకులు వుండును. ఈ బావములలో సూర్యుని గోచరము రాజకీయ పక్షము నుండి కూడా హాని కలిగించును.
చంద్రుని గోచర ఫలితములు: (Predictions for Transit of Moon)
గోచరములో చంద్రుని ప్రధమ, తృతీయ, షష్టమ, సప్తమ, దశమ మరియు ఏకాదశ బావములలో ప్రవేశించునప్పుడు ఇది అశుభ ఫలదాయకమును ప్రదానింఛును (Moon gives auspicious resuls when it is in first, third, sixth, seventh, tenth and eleventh houses).  ఈ బావములలో చంద్రుడు ప్రవేశించునప్పుడు వ్యక్తికి స్త్రీ సుఖము, క్రొత్త వస్త్రము, మంచి బోజనము ప్రాప్తి చెందగలవు. చంద్రుని ఈ బావములలో గోచరము వుండిన ఎడల అరోగ్యము కూడా బాగుండును. ఈ బావములను వధిలి ఇతర బావములలో చంద్రుని గోచరము అశుభ పలదాయినిగా వుండును. మానసిక అశాంతి, అనారోగ్యము, స్త్రీ పీడ మరియు కార్యము బాదించుట వంటివి ఏర్పడును.
కుజుని యొక్క గోచర ఫలితములు: (Predictions for Transit of Mars)
కుజుని అశుభ గ్రహముగా చెప్ప బడినది. కాని ఇది తృతీయ లేదా షష్టమ బావములలో గోచరము చేయుచున్నప్పుడు శుభ ఫలితములను ఇచ్చును (Mars gives auspicious results when it transits through the third or sixth house). ఈ బావములలో కుజుని యొక్క గోచరము పరాక్రమమును పెంచును. లేదా శత్రువులను పరాభవించును. ఇది ధన లాభమును, ప్రఖ్యాతిని, కీర్తిని మరియు ఆనందమును ప్రదానించును. ఈ రెండు బావములను విడిచి అన్య బావములలో కుజుడు పీడాదాయకముగా వుండును. తృతీయ మరియు షష్టమ భావములలో గోచరము చేయుచున్న ఎడల అప్పుడు బల హాని కలుగ గలదు. శత్రువులు ప్రభలముగా వున్నది. అనారోగ్యము, ఉద్యోగము మరియు వ్యాపారము లలో బాధలు మరియు అశాంతి వాతావరణము వుండును.
బుధుని యొక్క గోచర ఫలితములు: (Preditions for Transit of Mercury)
గోచరములో బుధుడు ద్వితీయ, చతుర్ధ, షష్టమ మరియు ఏకాదశ బావములో ప్రవేశించునప్పుడు గురువు యొక్క గోచర ఫలితములు వ్యక్తికి సుఖదాయకముగా వుండును (Mercury gives auspicious results when it transits through the second, fourth, sixth or eleventh house). ఈ గోచరములో బుధుడు విద్యా రంగములో అభిరుచి అధికముగా కలిగించును. అన్నము, ధనము, వస్త్రమునకు లాభమును కలిగించును. కుటుంబ సభ్యులతో మధుర సంబందములను మరియు క్రొత్త క్రొత్త వారితో మిత్రతను ప్రదానించును. అన్య గ్రహములలో బుధుని గోచరము శుభ ఫలదాయకముగా వుండును. గోచరములో అశుభ బుధుని ప్రబావము వలన స్త్రీతో వియోగము, కుటుంబస్తులతో వొడిదుడుకులు, అరోగ్య హాని, ఆర్ధిక బలహీనత, కార్యములలో బాదను కలిగించును.
గురువు యొక్క గోచర ఫలితములు: (Predictions for Transit of Jupiter)
గురువును శుభ గ్రహముగా చెప్పబడినది. ఇది దేవతలకు గురువు మరియు సాత్వికమైన మరియు ఉత్తమమైన ఫలితములను ఇచ్చు గ్రహము (Jupiter is a benefic planet) కాని గోచరములో ఇది ద్వితీయ, పంచమ, సప్తమ, నవమ, ఏకాదశ బావములలోనికి ప్రవేశించునప్పుడు మాత్రమే ఇది వ్యక్తికి శుభ ఫలితములను ఇచ్చును. అన్య బావములలో గురువు యొక్క గోచరము అశుభ ప్రభావ దాయకముగా వుండును (Jupiter is beneficial in second, fifth, seventh, ninth, eleventh houses). పైన చెప్పిన బావములలో గురువు గోచరము చేయుచున్నప్పుడు మాన ప్రతిష్ట, ధనము, ఉన్నతి, రాజకీయ పక్షము నుండి లాభము మరియు సుఖము లభించగలదు. ఈ బావములలో గురువు యొక్క గోచరము శత్రువులను పరాభవించును. శుభ గురువు కారణముగా కుటుంబస్తులతో మరియు మిత్రులతో సమ్యోగము మరియు పదోన్నతి లభించగలదు. పైన చెప్పిన ఐదు బావములు కాకుండా అన్య బావములలో గురువు గోచరము చేయు చున్నప్పుడు వ్యక్తికి మానసిక పీడ, శత్రువుల నుండి కష్టము, అనారోగ్యము మరియు ధన హాని కలుగగలదు. గోచరములో అశుభ కారిగా వుండుట వలన గురువు సంబందములలో కూటతను, ఉద్యోగ వ్యాపారములలో సమస్యలను మరియు గృహస్థ జీవితములో బాదలను ఎదుర్కొన వలసి వచ్చును.
శుక్రుని గోచరములో ఫలితములు: (Predictions for Transit of Venus)
ఆకాశ మండలములో అన్ని గ్రహముల కంటా శుక్రుడు ప్రకాశవంతమైన గ్రహము. ఇది బోగవిలాశములు మరియు సుఖములకు కారక గ్రహముగా చెప్పదగ్గది. శుక్రుడు యది ప్రధమ, ద్వితీయ, పంచమ, అష్టమ, నవమ మరియు ఏకాదశబావములలో గోచరము చేయుచున్నప్పుడు ఇది శుభ ఫలితములను ప్రదానించును (Venus is auspicious in first, second, fifth, eighth, ninth and eleventh houses). ఈ బావములలో శుక్రుని గోచరము కలిగి వుండుట వలన వ్యక్తికి బౌతిక మరియు శారీరక సుఖము లభించగలదు. భార్య మరియు స్త్రీ పక్షము నుండి లాభము లభించగలదు. అరోగ్య సుఖము మరియు ధన దాన్య, వస్త్రములు మరియు అభూషణముల లాభము కలుగును. అయిననూ ప్రధమ బావములో ప్రవేశించినప్పుడు ఇది తన గుణమునకు అనుకూలముగా అన్ని విధముల లాభములను కలిగించును. కాని అత్యదిక బోగవిలాశములకు వ్యక్తిని ప్రోత్సాహించును. అన్య బావములలో శుక్రుని గోచరము అశుభ ఫలదాయిగా వుండును. గోచరములో అశుభకార శుక్రుని కారణముగా ఇది అరోగ్యము మరియు ధన హాని కలిగించును. స్త్రీ వలన కష్టములు, జననేంద్రియ సంబందమైన రోగములు, శత్రు బాద మరియు ఉద్యోగ వ్యాపారములలో కష్టములు గోచరములో అశుభ శుక్ర గ్రహము యొక్క ఫలితములుగా వుండును. ద్వాదశ బావములో శుక్రుడు గోచరము చేయుచున్నప్పడు అశుభ కరముగా వున్నప్పటికీ కొన్ని శుభ ఫలితములను కూడా ఇచ్చును.
శని యొక్క గోచరములో ఫలితములు: (Predictions for Transit of Saturn)
శని గ్రహమును అశుభ గ్రహముగా చెప్పబడినది. ఇది వ్యక్తికి కష్టమును మరియు సమస్యలను కలిగించును. కాని ఇది గోచరములో షష్టమ మరియు ఏకాదశ బావములో వున్నప్పుడు శుభ ఫలితములను ఇచ్చును (Saturn is auspicious in the sixth or eleventh house). నవమ బావములో శని గోచరము సాదారణముగా వుండును. అన్య బావములలో శని యొక్క గోచరము పీడాదాయకముగా వుండును. గోచరములో శుభ శని ధన దాన్యములను మరియు సుఖమును ప్రదానించును మరియు శత్రువుల పరాభవము కూడా శని యొక్క గోచరములో కలుగును. సంతాన సుఖము మరియు ఉచ్చ అధికారుల నుండి సమ్యోగము కూడా శని యొక్క శుభ గోచరము వలన కలుగ గలదు. శని యొక్క అశుభ గోచరము కారణముగా మానసిక కష్టము, ఆర్ధిక సమస్యలు, ఉద్యోగ వ్యాపారములలో బాదలతో పాటు ఆరోగ్యముపై కూడా ప్రతికూల ప్రభావము పడగలదు.
రాహువు మరియు కేతువు యొక్క గోచర ఫలితములు: (Predictions for Transit of Rahu and Ketu)
రాహువు మరియు కేతువు చాయాగ్రహములుగా వుండును (Rahu and Ketu are shadow planets considered malefic like Saturn). వీటిని శనికి సరిసమమైన అశుభకార గ్రహములుగా లెక్కించవచ్చును. జ్యోతిష్య శాస్త్రమునకు అనుసారముగా గోచరములో రాహువు కేతువు ఏ గ్రహబావములో వీటి స్థితి వున్నవో అవే బావములో మాత్రమే గోచర ఫలితములను ప్రదానించును. తృతీయ, షష్టమ మరియు ఏకాదశ బావములో వీటి గోచరము శుభ ఫలదాయిగా వుండును. అనగా ధనము, సుఖము మరియు లాభములు కలుగును. ఈ బావముల వదిలి ఇతర బావములలో రాహువు కేతువు గోచరము చేయు చున్న ఎడల అప్పుడు ఇవి హానిప్రదముగా వుండును.

గోచరములో రాహువు యొక్క ఫలితము (The Results For Rahu’s Transit Through 12 Signs)
ఆకాశీయ గ్రహములలో రాహువు మరియు కేతువు యొక్క అస్తిత్వము లేనప్పటికీ జ్యోతిష్య శాస్త్రములో అన్య గ్రహముల వలె వీటికి కూడా ప్రాముఖ్యత కలిగి వున్నది. రాహువు మరియు కేతువు ఆబాసీయ గ్రహములు (Rahu and Ketu are non-physical planets). అవి ఏ వ్యక్తి యొక్క జన్మ కుండలిలో కూర్చుని భావానుకూలముగా ఫలములను ప్రదానించును. జన్మ సమయములో గోచరములో రాహువు యొక్క స్థితి వ్యక్తిపై చాలా ప్రభావమును చూపును. (Raju’s transit has a strong impact on a person).
జన్మ కుండలిలో ఏదైనా గ్రహముతో రాహువు మరియు కేతువు వుండిన ఎడల వాటి ప్రభావము ఇవ్వకుండా ఏ గ్రహముతో వున్నదో ఆ గ్రహము యొక్క ప్రభావమును ఇచ్చును (Rahu and Ketu give the result of he planets placed with them). రాహువు చంద్ర రాశి నుండి మూడవ బావము, ఆరవ బావము మరియు పదకొండవ బావములో శుభ ఫలములను ఇచ్చును కాని పంచమ, నవమ మరియు దశమ బావములో యది అన్య గ్రహములు వుండిన ఎడల రాహువు బలహీన లేదా గాయపడిన రాహువు యొక్క శుభఫలితములు లభించ జాలవు. జన్మ కాలీన చంద్ర రాశి నుండి ప్రత్యేక బావములో గోచర సమయములో రాహువు వేరు పలితములను ఇచ్చును.
రాహువు గోచరము ప్రధమ బావము: (Rahu’s Transit Through First House)
జన్మ యొక్క సమయములో చంద్రుడు ఏ రాశిలో వుండునో ఆ రాశిలో రాహువు ప్రవేశించునప్పుడు వ్యక్తిని రోగములు మరియు వ్యాదులు ఆకట్టుకొనును (A native is plagued with disease when Rahu transits through the Moon’s Rashi at birth).  ఈ సమయములో వ్యక్తికి అనేక విధములైన శారీరక కష్టములను అనుభవించవలసి వుండును. వ్యక్తి ఆలోచనకు వ్యతిరేకముగా అన్ని జరుగును. అందువలన మానసికముగా సమస్యలు ఎదుర్కొన వలసి వుండును. శరీరము అలిసి నట్టుగా వుండి బద్దకముగా వుండును.  అందువలన కార్య పరిణామములలో లోపము ఏర్పడును.
రాహువు గోచరము ద్వితీయ భావము: (Rahu’s Transit Through Second House)
జన్మ రాశిలో యది రాహువు గోచరములో వుండిన ఎడల ధన హానిని కలిగించును (Rahu gives financial loss when in the second house from the Moon sign).  ఈ గోచరములో అనవసరముగా మీ ధనము ఖర్చు కాగలదు మరియు మీరు ఆర్ధిక సమస్యలను ఎదుర్కొన వలసి వుండును.  మీ కుటుంబము మరియు సహ సంబందులలో ఈ రాశి కారణముగా కష్టములు కలుగును అందువలన మీకు సమస్యలు కూడా పెరుగును. రాహువు యొక్క ఈ గోచరము కుటుంబస్తుల మద్య వివాదములకు కారణము కాగలదు. తప్పు మార్గములో మిమ్ము మద్య పదార్ధములను బానిసగా మిమ్ము చేయగలవు. రాహువు యొక్క ఈ గోచరము మీకు మానసికముగా అశాంతిని కలిగించును.
రాహువు గోచరము తృతీయ భావము: (Rahu’s Transit Through The Third House)
చంద్ర రాశి నుండి తృతీయ బావములో రాహువు శుభ ఫలదాయకముగా వుండును (Rahu’s transit in the third sign from Moon gives you political rise).  ఈ భావములో రాహువు యొక్క గోచరము కారణముగా మీరు కూట నీతి మరియు రాజనీతిలో మీ బుద్ధిని ఉపయోగించి మీ పనులను చేపట్టుటకు ప్రయత్నించెదరు. మీలో గుప్తరూపముగా పనిని చేపట్టే అలవాట్లు ఏర్పడును. మీరు మీ పని పూర్తిగా జరిగిన తరువాతే దానిని బయట చెప్పెదరు. రాహువు యొక్క ఈ గోచరము మీ శుఖ సంతోషములలో ప్రాభల్యమును ఇచ్చును.
రాహువు గోచరము చతుర్ధ బావము: (Rahu’s Transit Through The Fourth House)
జన్మ రాశి నుండి చతుర్ధ బావములో రాహువు యొక్క గోచరము కలిగి వుండిన ఎడల ఇది వ్యక్తికి అనేక విధములైన సమస్యలను మరియు కష్టములను కలిగించును (Rahu’s transit through the fourth house is malefic). రాహువు యొక్క ఈ గోచరము తల్లికి కష్టములను కలిగించును. జీవితములో అడుగడుగున వ్యక్తి కష్టములు మరియు బాధలతో సమస్య చెంది వుండును. అగౌరవము మరియు అవమానము యొక్క బయము కలిగి వుండును. కష్ట నష్టములు ఒకదాని వెనుక మరికటి వచ్చు చుండును. భూమి మరియు వాహన సంబందమైన విషయములలో సమస్యలను ఎదుర్కొన వలసి వుండును.

రాహువు గోచరము పంచమ బావము: (Rahu’s Transit Through The Fifth House)

జ్యోతిష్య శాస్త్రమును బట్టి జన్మ రాశి నుండి పంచమ బావములో రాహువు యొక్క గోచరము వ్యక్తికి కష్టమును మరియు దు:ఖమును కలిగించును. వ్యక్తి యొక్క బుద్ది బ్రమించగలదు మరియు త్వరగా ధనవంతునిగా మారవలననే పగటి కలలు కంటూ వుంటాడు. దనవంతుడైయ్యే ప్రయత్నములో చేతులో వున్నది కూడా తరిగి పోవును దాని వలన ఆర్ధిక స్థితి మరింత బలహీనముగా మారును ఈ బావములో రాహువు యొక్క గోచరము ఆరోగ్యముపై కూడా విపరీత ప్రభావమును చూపును. వ్యక్తి యొక్క ముఖము మరియు పళ్ళలో నెప్పి వలన సమస్యలను ఎదుర్కొనవలసి వుండును. ఈ సమయములో అనేక విధములైన సమస్యలను ఎదుర్కొన వలసి వుండును.
రాహువు గోచరము షష్టమ బావము: (Rahu’s Transit Through The Sixth House)
జన్మ కుండలిలో చంద్ర రాశి నుండి షష్టమ బావములో రాహువు యొక్క గోచరము కలుగు తున్నప్పుడు వ్యక్తి రాహువు యొక్క గోచరము సామాన్యముగా హానిని కలిగించదు. ఆరోగ్య రీత్యా రాహువు యొక్క ప్రభావము కొంచం విపరీతముగా వుండును. అందువలన బోజన పానీయములలో విపరీత శ్రద్ద వహించవలసి వుండును. ఉదర సంబందమైన సమస్యలు పీడించవచ్చును. ఆర్ధికముగా రాహువు యొక్క ఈ గోచరము శుభకారిగా వుండును. ఈ సమయములో వ్యక్తి ధనలాభము కలిగే అవకాశము వున్నది. వ్యక్తికి అకస్మికముగా ధనలాభము కలుగ వచ్చును.
రాహువు గోచరము సప్తమ బావము: (Rahu’s Transit Through The Seventh House)
జన్మ రాశిలోని చంద్రుని నుండి సప్తమ బావములో రాహువు యొక్క గోచరము దాంపత్య జీవితమునకు కష్టకారిగా వుండును (Rahu is malefic when in the seventh house from Rahu). ఈ రాహువు కారణముగా భార్యాభర్తల మద్య మధుర సంబందములలో లోపము ఏర్లడి దూరము పెరుగును. రాహువు యొక్క ఈ భావములో జీవిత భాగస్వామికి కష్టములను ఎదుర్కొన వలసి వుండును. వ్యక్తి వారి ఆరోగ్యము కారణముగా దు:ఖము లేదా పీడించబడి వుండును. ఈ సమయములో మీ స్వయ బుద్ది కూడా పనిచేయదు. అన్ని వైపుల నుండి మానసిక వొత్తిడి అధికముగా వుండును.
రాహువు గోచరము అష్టమ బావము: (Rahu’s Transit Through The Eighth House)
మీ కుండలిలో జన్మ రాశిలో చంద్రుడుతో గోచరములో రాహువు అష్టమ బావములో వుండిన ఆశుభ ప్రభావమును ఇచ్చును (Rahu in eighth house from the Moonsign yields physical problems). రాహువు ఈ గోచరములో శారీరక సమస్యలను ఇచ్చును. విభిన్న ప్రకారములైన రోగముల వలన మీరు బాదించబడగలరు. విశేష రూపముగా మూత్ర మార్గములో లేదా మల మార్గములో రోగము కలిగే అవకాశములు వుండును. ఆర్ధిక పరముగా కూడా అశుభ కారిగా చెప్పబడును. అనవసర ఖర్చులు ఏర్పడును మరియు ఆర్దిక నష్టము కలుగును.
రాహువు గోచరము నవమ బావము: (Rahu’s Transit Through The Ninth House)
కుండలిలో రాహువు జన్మ కాలికమైన చంద్రునితో నవమబావములో గోచరము చేయుచున్నప్పుడు ఇది మీ పనులలో అవరోధములను కలిగించును (Rahu in ninth house from the Moonsign raises many obstacles). మీ ఉద్యేశ్యము పూర్తి చేయుటలో రాహువు అడుగడుగున సమస్యలను కలిగించును. అనేక సమయములో మీ పని జరుగుతున్న దని సంతోషపడు సమయములో ఆపని జరుగ కుండా నిలిచిపోవును. ధన విషయములో కూడా రాహువు యొక్క ఈ గోచరము విపరీత ప్రభావమును ఇచ్చును. ఇది మీకు అనవసర కర్చులను చేయించును. అందువలన మీకు ఆర్ధిక సమస్యలను ఎదుర్కొన వలసి వచ్చును.
రాహువు గోచరము దశమ బావము: (Rahu’s Transit Through The Tenth House)
జన్మ కాలిక చంద్రుని నుండి రాహువు దశమ బావములో గోచరము చేయుచున్నప్పుడు ఇది వ్యక్తి యొక్క జీవితమును తలక్రిందులుగా చేయును (Rahu in tenth house from the Moonsign causes a lot of upheavel). రాహువు యొక్క ఈ గోచరము స్థానాంతరమును కలిగించును. మీరు ఇల్లు విడిచి వేరో చోటుకు వెల్ల వలసి వుండును లేదా ఉద్యోగములో బదిలీలు ఏర్పడును. ఈ గోచరములో మీకు కార్య పరివర్తనము కలుగును మీరు ఏపని చేయుచున్నారో దానిని విడిచి మరే ఇతర పనినైనా చేపట్టవచ్చును. ఈ గోచరములో ఆర్ధిక నష్టమును కూడా ఎదుర్కొన వలసి వచ్చును. అనవసర పరిశ్రమ కారణముగా వ్యక్తి అలసటకు గురి కాగలడు.

రాహువు గోచరము ఏకాదశ బావము: (Rahu’s Transit Through The Eleventh House)

జన్మ రాశి నుండి ఏకాదశ బావములో రాహువు గోచరములో వున్నప్పుడు ఇది శుభ ఫలితములను ఇచ్చును. రాహువు యొక్క అశుభ ప్రభావము ఈ భావములో కలుగదు. గోచరములో రాహువు వ్యక్తికి గౌరవ మర్యాదలను మరియు ప్రతిష్టలను ఇచ్చును. వ్యక్తి కొరకు ధన సంపాదనమునకు క్రొత్త మార్గములను చూపును మరియు పాత మార్గముల నుండి కూడా ధన లాభము లభించును. ఈ గోచరము ధనము యొక్క దృష్టి నుండి అనుకూల పరిణామములను ఇచ్చును. వ్యక్తికి వారి కార్యములలో సఫలత లభించగలదు. యది మీ కుండలిలో కూడా జన్మ కాలిక చంద్రుడు ఏకాదశ బావములో గోచరము చేయు చున్న ఎడల మీకు మంచి రోజులు అని అర్ధము చేసుకొన వలెను.
548__Rahu-
ద్వాదశ బావములో జన్మ కాలిక చంద్రుడు నుండి రాహువు యొక్క గోచరము వ్యక్తికి శారీరక భాదలను కలిగించును. రాహువు గోచరములో ద్వాదశ బావములో ప్రవేశించునప్పుడు వ్యక్తి పగటి కళలు కనుట ప్రారంబించును. ఈ గాలి మేడల వలన ఏ విధమైన ప్రయోజనము వుండదు. వ్యక్తి యొక్క కల్పన మరియు యోగనలు అలేగే వుండి పోవును. ఆర్ధికముగా సమస్యలను ఎదుర్కొన వలసి వుండును. ఈ గోచరములో అనవసర ఖర్చులు అధికముగా వుం

విభిన్న బావములలో గురువు యొక్క ప్రభావము - Impact of Jupiter in different Houses


జ్యోతిష్య శాస్త్ర ఆదారముగా గురువు అతి ప్రభావశాలి మరియు శుభ గ్రహము. ఇది జ్నానమునకు కారక గ్రహము. ఇది విద్య, బుద్ది, జ్నానము, వివాహము, ధనము మరియు విభిన్న విషయములలో వారి మహత్వ పూరితమైన ప్రభావమును చూపుని. గోచరములో గురువు యొక్క విభిన్న భావముల నుండి ప్రయాణించు నప్పుడు వ్యక్తికి వేరు వేరు పరిణామములు ప్రాప్తించును.

ప్రధమ భావములో గురువు యొక్క గోచరము: (Jupiter's transit through the first house)
యది మీ కుండలిలో ప్రధమ బావములో గురువు గోచరము చేయుచున్న ఎడల మరియు మీరు వివాహమునకు సిద్దముగా వుండిన ఎడల మీరు తయ్యారుగా వుండండి వివాహము తొందరగానే జరుగ నున్నది. ఈ భావములో గురువు యొక్క గోచరము కారణముగా మంచి అరోగ్యము కలిగి మానసిన స్థితిరత్వముతో వుండెదరు. ఇది మీకు ఆర్దిక సఫలత మరియు ఉన్నతిని చేకూర్చును. ఇది ఆర్ధిక పరముగా చాలా లాభదాయకముగా వుండును. ఈ స్థితిలో ధన సంపాదనమునకు అనేక మార్గములు కలుగును. దానివలన మీకు ధన ప్రాప్తి కలుగును. సమాజములో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు మరియు కార్య క్షేత్రములో ఉత్తరాదికారిగా వుండుట లేదా పదోన్నతి లభించును. దార్మిక కార్యములలో పాల్గొనుట మరియు సామాజిక కార్యములలో ఎక్కువ బావమును ప్రదర్శించుట గురువు ప్రభావము కాగలదు. మీరు మిమ్ము చాలా తెలివైన వారిగా బావించెదరు. గురువు యొక్క గోచరములో ప్రధమ బావములో వుండుట వలన కుటుంబములో ఎవరితోనైన మతబేదములు కలుగుటకు అవకాశములు వుండును.

ద్వితీయ భావములో గురువు యొక్క గోచరము: (Transit of Jupiter through the second house)
గోచరములో వున్న గురువు ద్వితీయ బావములో వుండుట వలన ఆర్ధిక స్థితి బలమైనదిగా వుండును. ధనము లభించును. కాని ధన వ్యయము యొక్క మార్గము కూడా తెరిచి వుండును. వ్యయము అధికముగా వుండుట కారణముగా మానసిక వొత్తిడి కూడా రాగలదు. మీ వ్యక్తిత్వము ప్రభావమైనదిగా వుండును. ప్రజలు మీ వలన ప్రభావితులు కాగలరు మరియు మీ మాటలను గౌరవించెదరు. సమాజములో గౌరవ మర్యాదలను పొందెదరు. గురువు ఈ భావములో గోచరమవుట కారణముగా సంతాన సుఖము లభించగలదు. కుటుంబ జీవితములో అనుకూలత కలిగి వుండును. మీరు ఆస్థి పాస్తుల సంబందమైన నిర్ణయములను తీసుకొన దలచిన ఇది మీకు లాభకరమైన స్తితి. గురువు ధర్మము యొక్క ప్రతినిధిత్వమును చేయును. అందువలన ఈ సమయములో మీ మనస్సు దార్మక కార్యముల పట్ల శ్రద్ద కలిగి వుండును. మీ మనస్సులో దార్మిక బావనలు వుండుట కారణముగా మీరు చాలా సంతోషముగా పూజలు మరియు ఇతర దార్మిక పనులలో శ్రద్ద వహించగలరు.

తృతీయ బావములో గురువు యొక్క గోచరము: (Jupiter Transit in third house)
తృతీయ బావములో గురువు యొక్క గోచరము కారణముగా ఆరోగ్యముపై అనుకూల ప్రభావము కలుగును. విద్యా సంబందమైన విషయములలో గురువు యొక్క ఈ గోచరము ఉత్తమముగా వుండును. మీ కార్యముల వలన మీరు విశాల హృదయము కలవారని తెలియ వచ్చును. మీ విచారములు మంచివిగాను మరియు శ్రేష్టమైనవిగాను వుండును. ఉన్నత వ్యవహారముల కారణముగా మీరు మీ చుట్టు పక్కల గౌరవ మర్యాదలను మరియు పేరు ప్రతిష్టలను పొందెదరు. ఈ సమయములో మీ పాత మిత్రులు సహాయపడగలరు. వీరు నుండి మీకు సమ్యోగము లభించగలదు మరియు భవిశ్యత్తులో లాభము కలుగుటకు వీరు సాధనముగా వుండగలరు. ఈ సమయములో మీకు కొత్త కొత్త మనుష్యులతో మెలుగుటకు అవకాశము లభించును మరియు లాభదాయకమైన మిత్ర సంబందము కూడా కలుగును. గురువు యొక్క ఈ గోచరములో యాత్ర కూడా సంబవించవచ్చును. యాత్ర మీకు లాభదాయకముగాను, సుఖమయముగాను వుండును. అందువలన యాత్రవలన బయపడవలసిన అవసరము లేదు.

చతుర్ద భావములో గురువు యొక్క గోచరము: (Jupiter transiting through fourth house)
యది మీ కుండలిలో చతుర్ధ బావములో గురువు యొక్క గోచరము కలుగు తున్న ఎడల మీ భాగ్యము ఈ సమయములో ప్రభలముగా వుండును. కుటుంబములో సుఖ శాంతుల వాతావరణము వుండును, మనస్సు సంతోషము మరియు ప్రసన్నత కలిగి వుండును. సుఖ సంతోషముల ఆగమనము కారణముగా మనస్సు ఆశలతో నిండి వుండును. మానసికముగా సంతుష్టి కలిగి వుండెదరు మరియు రోగములు మరియు వ్యాదులు కలిగే అవకాశముల నుండి మీరు ఇప్పుడు ముక్తి కలిగెదరు. ఉద్యోగ వ్యాపారములలో మీకు అనుకూల స్థితి కలిగి వుండి లాభదాయకముగా వుండును. ఆర్దిక పరముగా మీ స్థితి బలమైనదిగా వుండును. ఈ భావములో గురువు యొక్క గోచరములో పూర్తికాని పనులలో సఫలత మరియు ప్రగతి యొక్క సూచన వుండగలదు. ఆస్థి పాస్తులు మరియు వాహనముల విషయములో నిశ్చిత నిర్మాణమును చేయగలరు. మెట్టింటి వైపు నుండి లాభములను పొందగలరు. మీ పరిశ్రమ మరియు కార్య కుశలత కారణముగా మీ కోరికలను నెరవేర్చుకొన గలరు.

పంచమ భావములో గురువు యొక్క గోచరము: (Jupiter's transit through fifth house)
గోచరములో గురువు పంచమ బావము నుండి కదులు చున్నప్పుడు ఆ సమయములో ఉత్తమ ఫలములను ప్రధానించును. గురువు యొక్క ఈ గోచర ప్రభావము కారణముగా జ్నానార్జనలో మరియు విభిన్న విషయములలో మీకు అభిరుచి కలిగి వుండును.  ఈ సమయములో సంగీతము మరియు రచయితా రంగములలో అభిరుచి కలిగి వుండెదరు. జ్యోతిష్య విద్యను మీరు లోతైన పద్దతిలో నేర్చుకొన దలచెదరు. దర్శనా శాస్త్రములో మీ అభిరుచి అధికముగా వుండును. సాహిత్య సంబందమైన విషయములు మిమ్ము ఆకర్షింపచేయును. గురువు యొక్క ఈ గోచరము మిమ్ము విపరీత లింగపు వారిపై మిమ్ము ఆకర్షితులను చేయగలదు. ప్రేమ సంబందమైన విషయములు ప్రారంభమగును. సంతానము కావలనని కోరుకునే వారికి ఈ గోచరములో సంతానము ప్రాప్తించగలదు. ఆర్ధిక పరముగాను ఈ గోచరములో గురువు మీకు మంచి పరిస్థితిని కలిగించును. రాజకీయ రంగములో మరియు ప్రభుత్వ ఉద్యోగుల నుండి మీకు మంచి సమ్యోగము లభించగలదు. ప్రభుత్వ రంగములో మీకు సంబందమైన పనులు పూర్తికాగలవు. ఉద్యోగ వ్యాపారములలో ఉన్నతిని ఇది సరైన సమయము. మీ కార్య కుశలత మరియు క్షమత యొక్క ప్రశంశ ఏర్పడును. సంతానము నుండి సమ్యోగము మరియు సుఖము ప్రాప్తించును.

షష్టమ బావములో గురువు యొక్క గోచరము: (Transit of Jupiter through sixth house)
గోచరములో గురువు షష్టమ బావములో ప్రయాణించు చున్నప్పుడు సామాన్య శుభ ఫలితములను ఇచ్చును. మీ కుండలిలో షష్టమ బావములో గురువు యొక్క గోచరము కలుగునప్పుడు మీ ఆరోగ్యము అనుకూలముగా వుండును, లేదా ఆరోగ్య సంబందమైన కొన్ని సమస్యలు ఎదురుకాగలవు. మానసికముగాను సాదారణ ఫలితములే వుండును. మీరు మీ శ్రద్ద మరియు పరిశ్రమతో ఉద్యోగ వ్యాపారములలో ఉన్నత స్థితిని పొందగలరు. మీ శత్రువులు మీకు ద్రోహమును కలిగించరు అందువలన మీకు కార్యములలో విడిదుడుకులు ఏమీ వుండవు. ఆర్ధిక లాభము కలిగి అయములో వృద్ది కలుగును. కాని ఖర్చుకూడా అధికముగానే వుండును. అందువలన సంతులత ముఖ్యము. శుభ కార్యములు మరియు మంగళకరమైన పనులను చేయు ఖర్చుల వలన మనస్సు ప్రసన్నముగా వుండును. ఈ గోచరము యొక్క ప్రభావము కారణముగా కుటుంబ మరియు సంసారిక సుఖములు కూడా ప్రాప్తించును.

సప్తమ భావములో గురువు యొక్క గోచరము: (Jupiter's transit through the seventh house)
మీ కుండలిలో ఎప్పుడైతే సప్తమ బావములో గురువు గోచరములో వుండునో ఆ స్థితిని చాలా శుభ స్థితిగా చెప్పబడినది. అవివాహితులకు వివాహ యోగముగా చెప్పబడినది. గురువు ఈ భావములో గోచరములో వుండుట వలన అవివాహితులకు వివాహము జరుగును. దాంపత్య జీవితమునకు కూడా గురువు యొక్క ఈ గోచరము ఉత్తమమైనది. ఇది సంతాన యోగమునకు కూడా కారకము. భార్య భర్తల మద్య మధుర సంబందములను కలుగజేయును. అనగా ఈ గోచరములో మీకు సంతానము కూడా కలుగవచ్చును. సమాజములో గౌరవ మర్యాదలలో వృద్ది కలుగును. ఉద్యోగము లేనివారికి ఉద్యోగము లభించుటకు అవకాశములు వుండును, ఉద్యోగములో వుండిన ఎడల పదోన్నతి మరియు వ్యాపారము చేయుచున్న ఎడల వ్యాపారములో సఫలత లభించగలదు. ఆర్ధిక పరముగా బలపడగలరు. ధన లాభము కొరకు విభిన్న పద్దతులను అబ్యసించెదరు. ఖర్చులకు కూడా అనేక మార్గములు తెరువ బడగలవు. మనస్సు ప్రశాంతతో కూడి సంతోషముగా వుండును.

అష్టమ బావములో గురువు యొక్క గోచరము: (Jupiter transiting through the eighth house)
మీ కుండలిలో అష్టమ బావములో గువురు యొక్క గోచరము కారణముగా సమయము సామాన్యమైన అనుకూలత కలిగి వుండును. గురువు యొక్క ఈ గోచరము కారణముగా మీరు శారీరకముగా అరోగ్యముగా వుండెదరు. కాని మానసికముగా అశాంతి మరియు సమస్యలను ఎదుర్కొన వలసి వుండును. మీరు మీ మనస్సు అదుపులో పెట్టని ఎడల క్రోదము మరియు ఆగ్రహమునకు బానిస కాగలరు. శత్రువులను నిర్బయముగా ఎదుర్కొనుటకు ఈ సమయము అనుకూలము కాదు అందువలన మీరు మీ కార్య క్షేత్రములో సఫలతా పూరితముగా ముందుకు నడువ గలరు.  ఈ సమయములో మీకు మీ పరిశ్రమకు తగ్గ పూర్తి లాభము లబించగలదు. అందువలన సఫలత కొరకు ప్రయత్నములు చేయుచుండవలెను. ఆర్ధిక స్థితి సామాన్యముగా వుండును. అకస్మాత్తుగా ధనలాభమునకు సాధనములు కూడా వుండగలవు. ప్రభుత్వ పరముగా మీకు సంయోగము లబించగలదు మీ పని సఫలతను పొందగలదు.

నవమ బావములో గురువు యొక్క గోచరము: (Ninth house transit of Jupiter)
మీ కుండలిలో గురువు నవమ బావములో గోచరము చేయు చున్నప్పుడు మీరు శారీరకముగాను మరియు మానసికముగాను ఆరోగ్యముగా వుండెదరు. ప్రసన్నత మరియు ఉత్సాహముతో మీరు ఎల్లప్పుడు వుండెదరు. ఈ సమయములో విలంబములో వున్న పనులు పూర్తి కాగలవు. పూజలు మరియు దార్మిక పనులలో మీ శ్రద్ద వుండును. సామాజిమ మరియు పరోపకార సంబందమైన పనులు మీకు సంతోషమును కలిగించును. కార్య క్షేత్రములో కొత్త పద్దతులను చేపట్టుట వలన మీకు భవిష్యత్తులో లాభములు కలుగును. ఈ గోచరములో పదోన్నతి లేదా విషేశ కరమైన ఉత్తరాదిపత్యము లభించగలదు. ఆర్ధిక పరముగా మీకు ఇది చాలా లాభములను కలిగించును, మనస్సు ప్రసన్నతతో వుండును. సమాజములో గౌరవ మర్యాదలను పొందెదరు.

దశమ బావములో గురువు యొక్క గోచరము: (Jupiter's transit through the tenth house)
దశమ బావములో గురువు యొక్క గోచరము మీరు వ్యాపారము మరియు ఉద్యోగ రంగములో సఫలతను మరియు ఉన్నతిని కలిగించును. గురువు ఈ గోచరములో వుండుట వలన రాజనీతితో కలిసి వున్న పెద్ద పెద్ద వారితో మీకు సంబందములు ఏర్పడును. ప్రభుత్వ రంగములోని ఉన్నత అధికారులతో మీకు స్నేహము వుండును. కుటుంబ జీవితము శాంతి మరియు ఆనందమయమైన వాతావరణము కలిగి దానివలన గృహస్థ జీవితము ఆనందమయముగా వుండును. ధన విషయములో మీ చింత తొలగి పోవును. అన్ని విధముల ధనలాభము కలుగ గలదు. ఈ భావములో గురువు గోచరము చేయుచున్నప్పుడు గౌరవ మర్యాదలను కలిగించును. మీ సఫలతలో మీ  పరిశ్రమ మరియు శ్రద్ద యొక్క మహత్వ పూరితమైన యోగదానము వుండును. పని వొత్తిడి అధికముగా వుండుట కారణముగా మీకు విశ్రాంతి తీసుకొనుటకు సమయము లభించుఅ కష్ట కరముగా వుండును.

ఏకాదశ బావములో గురువు యొక్క గోచరము: (Jupiter transit eleventh house)
ఏకాదశ బావములో గురువు మీ ఆర్ధిక పరిస్థితిని బలపరచును. మీకు ధన సంపాదనమునకు కొత్త మార్గములు కలుగును. దానివలన మీరు ధన లాభమును పొందగలరు. వర్తక వ్యాపారములలో సఫలత మరియు ఉత్తమత కలిగి వుండును. ఉద్యోగములో వుండున ఎడల కార్య స్థలములో మీ స్థితి బలమైనదిగా వుండును మరియు గురువు యొక్క ఈ గోచరము కారణముగా మీకు పదోన్నతి కూడా లభించగలదు. పని ఎక్కువగా వుండుట కారణముగా మీరు చాలా వస్థముగా వుండగలరు. సామాజిక రంగములో మీకు ప్రతిష్ట మరియు గౌరవ మర్యాదలు కలుగును. మానసికముగా మీరు సంతుష్టి కలిగి ప్రసన్నతతో వుండెదరు.

ద్వాదశ బావములో గురువు యొక్క గోచరము: (Jupiter in twelth house transit)
గోచరములో  గురువు ద్వాదశ బావమునకు వచ్చునప్పుడు శారీరకముగాను మరియు మానసికముగాను స్థితి సామాన్యముగా వుండును. ఒకవేల మీరు కొన్ని సమయములో అనారోగ్యము కూడా పొందగలరు. కాని గంభీర వ్యాదులు కలిగే అవకాశములు ఏమీ వుండవు. మానసికముగా కూడా సాదారణ స్థితి వుండును కాని అప్పుడప్పుడు అశాంతి మానసిక వొత్తిడి కలుగవచ్చును. ద్వాదశ భావములోని గురువు మీకు ఆర్ధిక లాభమును ప్రదానించును కాని మంగళకరమైన పనులకు వ్యయము చేయుటకు కూడా మీరు సిద్దముగా వుండవలెను. మీ కార్యములో మీకు సఫలత లభింఛగలదు. కాని దానికొరకు మీరు చాలా పరిశ్రమించవలసి వుండును. ఈ బావములో గురువు యాత్రను కూడా చేయించును కాని ఈ యాత్ర భవిష్యత్తులో లాభమునకు మార్గముగా వుండును. మీ పరిశ్రమ మరియు శ్రద్ద వలన మీకు కలిగే గౌరవ మర్యాదలను మరియు సఫలతను నిర్ధారించవచ్చును.