Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

పూజ విధానం

  • April 28, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)

  • పూజ విధానం

    గృహమందు  పూజలు చేయువారు ఈశాన్య గదులందు కాని,వాయువ్య గదులందు కాని పూజలు చేయాలి. అలాగే తూర్పు ఉత్తర దిశా లో ఉన్న గదులలో చేయాలి .  పూజ చేయు వారి ముఖము
    ఉత్తరమునకు  అభిముఖముగా కాని, తూర్పు కు అభిముకముగా కాని ఉండాలి.
     దీపారాధనకు వేరుశనగ నూనే ను వాడితే అరిష్టములు కలుగును.  ఆవు నెయ్యి తో చేసిన ఐశ్వర్యము, ఆరోగ్యము, సంతోషముకలుగును. నువ్వుల నూనె తో చేస్తే దుష్ట శక్తి భాధలు, శత్రు బాధలు తోలుగుతాయి.
    ఆముదము తో చేస్తే ఎకగ్రత ,కీర్తి ప్రతిష్టలు, స్నేహితులు పొందుతారు. కొబ్బరి నూనె గణపతి పూజ కు మేలు చేయును.
    ఆవు నెయ్యి, పిప్పి నూనె, వేప నూనె కలిపి దీపారాధన చేయుట మంచిది. 
    వెండి కుందులు, పంచ లోహ కుందులు మంచివి. మట్టి కుందులు మాద్యమము. స్టీలు కుందులు అధమము.  
     
    పూజ సమయమున అరుణ వస్త్రములు ధరించుట మేలు. పూజ ను విగ్నేశ్వర పూజ తో ప్రారాబించి, ఆంజనేయ పూజతో ఆపుట ఆచారము . పూజ చేస్తూ ఇతరులతో మాటలాడటం, హాస్యముగా వ్యవహరించడము తప్పు.  

     

     దీపారాధన

     దేవతారాధన చేయుటకు ముందు ఒక వైపు ఆవు నేతితో, మరొక వైపు నువ్వుల నూనె తో దీపరాదన చేయవలెను. వీటిని సుదర్శన, పాశుపతములు అని పిలుస్తారు. 
    అగరావత్తులు, ఎకహరతి, కర్పూర హారతి ఇవ్వవలసి వచినప్పుడు  వీని నుండి వెలిగించ రాదు.  
     
    దేవతామూర్తి అభిషేకానికి కేవలం మంచి నీటిని (శుద్ధోదకము) వాడరాదు.  నిషిద్దం. తులసి దళమును కాని, పచ్చ కర్పూరం కాని శ్రీ గంధం కాని చేర్చి ఆ ఉదకముతో దేవతముర్తికి 
    అభిషేకం చేయవలెను. 
     
    వినాయకునికి ఒక ప్రదిక్షణ , సూర్యునికి ''2  '' శివునకు ''3'' , విష్ణువుకు''4'' రావిచెట్టు కు ''7'' ప్రదిక్షణలు చేయవలెను. 
     
     
    దీపారాదనలో తెలియకుండా చేసే పొరపాట్లు
     
    స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు.
    అగ్గిపుల్లతో దీపాన్ని  వెలిగించారాదు.
    ఒకవత్తి దీపాన్ని  చేయరాదు. ఏక వత్తి శవం వద్ద వెలిగిస్తారు.
    దీపాన్ని అగరవత్తి తో వెలిగించాలి.
    దీపారాధన మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి.
    విష్ణువుకు కుడివైపు  ఉంచాలి. ఎదురుగ దీపాన్ని ఉంచరాదు.
    దీపం కొండెక్కితే  "ఓమ్  నమః  శివాయ " అని 108 సార్లు
    జపించి దీపం వెలిగించాలి.

     

    అరుందతికి ఉపదేశించిన వత్తుల దీపారాధన

    శ్రీ మహలక్ష్మి, శ్రీ గౌరీ, మహా సరస్వతులైన ముగ్గురమ్మలు జ్యోతిర్యోపసనాను అరుందతికి ఉపదేశించారు. ఐదు వత్తుల దీపారాధన చేయటం వల్ల తొలి వత్తి భర్త సమస్త కోరికలు తీరుటకు, రోండవ వత్తి సంతాన యోగక్షేమాల కోసమూ, మూడవ వత్తి పుట్టింటి మరియు అత్తింటి క్షేమము కొరకూ, నాలుగవ వత్తి కీర్తి, గౌరవము కొరకు, ఐదవ వత్తి సకల ఆరిష్టాలను పొగొట్టుటకు, 
    దుఃఖము నుంచి విముక్తి కొరకూ.
     
    ఒక వత్తి దీపారాధన చేయవలదు.
     
    షోడశోపచార పూజావిధి - పరిచయం
     
    మన ఇంటికి వచ్చిన పెద్దలని ఏ విధంగా ఆహ్వానించి  మర్యాద  చేస్తామో అదే మన ఇష్ట దైవాన్ని కూడా పూజ పరంగా మర్యాద
    చేయడమే షోడశ (పదహారు)  ఉపచారాల విధానం. ఈ విధానం
    ప్రతీ దేవత పూజలోను పాటించి తీరాలి.
     
    ఆవాహనము:  మనస్పూర్తి గా మన ఇంట్లోకి స్వాగతం పలకడం.
     ఆసనము:  వచ్చినవాళ్ళు కూర్చునేందుకు ఏర్పాటు చేయడం.
    పాద్యము:  కాళ్ళు కడుగుకునేందుకు నీళ్ళను ఇవ్వడం.
    అర్ఘ్యము:  చేతులు పరిశుబ్ర పరచడం
    ఆచమనీయము: దాహం (మంచినీళ్ళు) ఇచ్చుట
    స్నానము:  ప్రయానాలసట తొలిగే నిమ్మిత్తం
    వస్త్రము:  స్నాన అనంతరం - పొ(మ)డి బట్టలివ్వడం
    యజ్ఞోపవీతము:  మార్గ మధ్యంలో మైలపడిన - యజ్ఞోపవీతాన్ని  మార్చడం
    గంధం:   శరీరం మీద సుగంధాన్ని చిలకడం
    పుష్పం:  వాళ్ళు కూడా సుగంధాన్ని ఆస్వాదించే ఏర్పాటు.
    దూపము:  సుఘంధ మయ వాతావరణాన్ని కల్పించడం
    దీపము:  పరస్పరం పరిచయానికి అనుకూలత కోసం
    నైవధ్యము: తన స్థాయి అనుసరించి - తనకై సాధించిన దానినే ఇష్ట దైవానికి కూడా ఇవ్వడం.
    తాంబూలం:  మనం భక్తి తో ఇచ్చిన పదార్థాల వల్ల - వారి    ఇష్టాయిష్టాలకి(రుచులకి) కలిగే - లోపాన్ని తొలగించడం
    నమస్కారం:     గౌరవించడానికి సూచన
    ప్రదక్షిణం:  ముమ్ముర్తుల వారి గొప్పదనాన్ని అంగీకరించడం.

    0 వ్యాఖ్యలు:

    Post a Comment