Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

పుష్యరాగం

  • April 27, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • లేబుళ్లు:
  • పుష్యరాగం
    పుష్యరాగ రత్నాలు బృహస్పతి (గురు) గ్రహానికి విశేషమైన ప్రీతి గలవి. ఎందువలన అనగా ఖగోళంలో నున్న పుష్యమీ నక్షత్రానికి అధిపతి గురువు. ఈ నక్షత్రమువలే ప్రకాశించే పుష్యరాగం గురుగ్రహానికి అభిమాన పాత్రవంటే అతిశయోక్తి కాదేమో ? అదీగాక, కర్ణేంద్రియ ప్రధానమైన ఆకాశతత్వాధిపతి బృహస్పతి, ఆకాశము శబ్ధలక్షణము కలది. ఈ పుష్యరాగం కూగా పై లక్షణము కలిగియుండును. అందువలన గురు గ్రహమునకు సంభంధించిన రత్నము పుష్యరాగమని స్పష్టమగుచున్నది. పుష్యరాగము త్రిదోషము నందలి వాత దోషమును శమింపజేయగలదు. ప్రాణపంచకములలో వ్యానమను ప్రాణవాయువునకు సంకేతమై ఉన్నది. ఇది పురుషజాతి రత్నము శరీరమునందలి అతి ప్రధానమైన అజ్ఞాచక్రమునందలి మహత్తరమైన ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్ఛాయా కాంతులకు ప్రతీకమైనది పుష్యరాగము-- బృహస్పతి బ్రహ్మజ్ఞాన సమన్విటుడు బ్రహ్మజ్ఞాన ప్రతిపాదిత మయినది గాయత్రి, అట్టి గాయత్రి యొక్క ఐదు ముఖాములకు గల వర్ణములే బ్రహ్మతత్వాన్ని ప్రతిపాదించే భవామధ్య స్థానంలో గల అజ్ఞచక్రంలో నిబిడీకృతామై ఉన్నది. బృహస్పతి యొక్క రత్నమయిన పుష్యరాగం ఏ రంగులో నున్నప్పటికీ ఈ ఐదురంగుల యొక్క సమిష్టి ప్రభావము కలిగి వుంటుంది. అందువల్లనే ఈ రత్నము సత్కర్మలకు, బ్రహ్మజ్ఞాననిష్ఠులకు ఉపయోగార్ధమై రాణించుచున్నది.
    పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర నక్షత్రములందు బుట్టిన వారు అన్ని వేళలయందు పుష్యరాగం ధరించవచ్చును. ఇతర నక్షత్రములలో జన్మించిన వారి విషయంగా భరణి, పుబ్బ, పూర్వాషాడ, నక్షత్రజాతకులు మినహా మిగిలిన అన్నినక్షత్రములవారు పుష్యరాగమును నిరభ్యరంతముగా ధరించవచ్చును. ఈ రత్నమును ధరించుటకు జన్మకాలమునందు గ్రహముల యొక్క స్థితి గతులు విచరించి దశాంతర్దశల యందలి శుభాశుభములను గోచారము నందలి మూర్తి మరియు వేదలను బాగుగా విచారించి గురు గ్రహము దోషప్రదుడుగా నున్న సమయములందు పుష్యరాగమును ధరించిన యెడల గురు గ్రహమువల్ల కలిగే అన్ని విధములైన కష్టనష్టములు దుఃఖములు పరిహరింపబడి సఖలైశ్వర్య భోగ భాగ్య సంపదలను ఆయురారోగ్యములను పొందగలరు. జన్మ సమయమున లేర్పడిన జాతక చక్రమునందు గురుగ్రహము లగ్నము నుండి 6-8-12 స్థానములందున్నను, ఆ స్థానాధిపత్యములు కలిగినను, ఆ స్థానాధిపతులచే కలయుట లేక చూడబడుట యుండినను షష్ఠ్యాధిపత్యము కలిగి కోణరాశులయందున్నను, వ్యయాధిపత్యము కలిగి ద్వితీయ తృతీయ ఏకాదశ రాశులయందున్నను గురు గ్రహము బహుదోషప్రదుడు మరియు పాపగ్రహ వీక్షితుడైన క్షీణ చంద్రునితో గలసి లగ్నమునందున్నను, రాహుగ్రహ సహితుడై లేక వీక్షితుడై ఏ రాశియందున్నను గురువు గొప్ప దోషవంతుడు కాగలడు. ఇట్టి ధోషములు కలిగియున్న బృహస్పతికి స్థానాదిషడ్వర్గబలములు, అష్టకవర్గ బిందుబలము కలిగియున్న తన దోషములను వృద్ధి గావించుకొనగలడు. గురుడు దుష్ట లక్షణములతో గూడి యున్నప్పుడు అతని మహర్దశగానీ సంభవించినను లేక గోచారమునందు దుష్టన్థాన సంచారములు కలిగిన కాలము మొదలగు గురు సంభందితమైన అశుభ కాలములందు సర్వవిధములైన అరిష్టములు ప్రాప్తించగలవు. ముఖ్యముగా ఆర్దిక ఇబ్బందులు కుటుంబకలహాలు, పిల్లల ప్రవర్తన సరిగా లెకపోవుట పుత్రవిచారము భార్యతో కలహము, దేశాటనము, ఋణబాధలు, అకారణ శతృత్వము నిందలు, అవమానములు అగౌరవ పరిస్థితులు పరీక్షలలో అపజయము, ఆకస్మిక ప్రమాదములు, అజీర్ణ వ్యాధులు, వాత ప్రకోపము, ఉబ్బులు, చర్మరోగాలు, మానసికవిచారము, నష్టకష్టములు మొదలగు అనేక శుభఫలితములు కలుగుచుంటవి.
    పుష్యరాగము ద్వారా కలిగే శుభయోగాలు :
    మల్లెపువ్వువంటి తెల్లని రంగు కలిగినవి గానీ, గోగు పువ్వువంటి పసుపు పచ్చని రంగుతో నున్నవి గానీ, పుష్యరాగములను శాస్త్రీయ పద్ధతుల ద్వారా ధరించిన వారికి విశేష పాండిత్యము మబ్చగలదు. దరిద్రబాధ లంతరించి ధన సమృద్ధి కాగలదు, మరియు, విధ్యాలయందు ప్రధమశ్రేణిలో ఉత్తీర్ణత. సత్కర్మాచరణము, కుటుంబసౌఖ్యము, గృహచ్ఛిద్రములంతరించి, దంపతుల అన్యోన్యత,, వంశాభివృద్ది సంతానము ప్రయోజకులగుట భంధువుల ఆదరణ, ప్రజాభిమానము, గౌరవము సభాపూజ్యత కీర్తి నిరాటంకము, శతృవులు మితృలగుట, వారి వలన సహాయ సహకారములు సంతాన ప్రాప్తి అప్రయత్నముగా ధనలాభం దైవభక్తి దుర్వసనములందు అయిష్టత జీర్ణశక్తి, వాత వ్యాధులు అంతరించుట, మేధాశక్తి, వినయ వివేకములు, వ్యాధులు నివారింపబడుట శీఘ్రముగా ఆరోగ్యము, మనఃశ్శాంతి కార్యసాఫల్యత. ఐశ్వర్యాభివృద్ది కలుగ గలవు. యోగులు దీనిని ధరించిన యెడల పరిపూర్ణ యొగ ఫలసిద్దినొందగలరు. సత్కర్మాచరణులు నైష్టికులు ధరించిన ఆయా కర్మలందు సంపూర్ణ ఫలమునొంది ఇహపర సౌఖ్యములను పొందగలరు.
    పుష్యరాగమును ధరించే పద్ధతి:
    ఏ జాతికి చెందిన పుష్యరాగమైనప్పటికీ దోషరహితంగా చూచి బంగారు ఉంగరములో ధరించటం ఉత్తమము, వెండి యందు ధరించడం రెండవ పక్షము. ఇతర లోహములు పనికి రావు పంచలోహములలోను ఈ ఉంగరము ధరించవచ్చునని కొందరు చెప్పియున్నారు. బంగారం లేక వెండితో చేయబడిన ఉంగరము యొక్క పైపీఠము దీర్ఘచతురస్రాకారంగా చేయించి అందు పుష్యరాగ రత్నమును ఇమిడ్చి పూజించి ధరించవలెను. మృగశిర పుష్యమి, ఉత్తర, పూర్వాభద్ర నక్షత్రములు కలిగియున్న గురువారం గానీ లేక పుష్యమీ నక్షత్ర గురు ఆది వారములందుగానీ సంభవించిననాడు గురు హోరకాలమునందు వర్జదుర్ముహుర్తములు లేకుండా చూచి పుష్యరాగమును ఉంగరమును బిగించలి ఆ తర్వాత ఉంగరమును ఒక దినమంతా పంచగవ్యములందుంచి, రెండవదినము మంచి గంధపునీటియందుంచి శుద్ధి గావించాలి. ఆ తదుపరి ఉంగరమునకు విధ్యుక్తముగా పూజ జరిపించాలి.
    ధరించెడువాడు తమకు తారాబలము చంద్రములు కల్గిన శుభతిదులయందు ఆది, మంగళ, గురువారములయందు సింహ, కటక ధనుర్మీన లగ్నములు జరుగుచున్నకాలమునందు ఈ ఉంగరము ధరించవలెను. ధారణకు పూర్వమే పూజాధికములను నిర్వర్తించి ఉంగరము తన కుడి హస్తమునందుంచుకొని ఉత్తరదిశాభిముఖులై గురువుని , గణపతిని ధ్యానించి "ఓం ఐం శ్రీం హ్రీం క్లీం బృహస్పతయే స్వాహా"అను మంత్రమును 108 పర్యాయములు జపించి ఆ తర్వాత ఉంగరమును ముమ్మారు కనులకద్దుకొని కుడిచేతి చూపుడు వ్రేలుకిగానీ, ఉంగరపు వ్రేలికిగానీ ధరించవలెను. స్త్రీలు కూడా ఈ పుష్యరాగ ముద్రికను కుడిచేతికి ధరించుటే శ్రేష్ఠము. ఉంగరమునకు అడుగుభాగం రంధ్రమును కలిగి వుండటం శాస్త్రీయము. అందువల్ల పుష్యరాగమునందలి వివిధకాంతులకు చెందిన కిరణశక్తి శరీరమునందు చొచ్చుకుపోయి అంతర్గత నాడీమండలములందు తమ శక్తిని ప్రభావితము గావించి దివ్యసిద్ధులను సత్ఫలితాలను కలుగచేయగలదు. పుష్యరాగ రత్నములచే చేయబడిన దేవతా విగ్రహములు నిత్యపూజలందు అత్యుత్తమ శుభఫలితములను గూర్చగలదు.

    0 వ్యాఖ్యలు:

    Post a Comment