Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

బ్రహ్మచారి కార్తికేయుడు

  • April 28, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • కార్తికేయుడు శివ పార్వతుల కుమారుడు. ఒక రోజు కార్తికేయుడు ఒక పిల్లితో ఆడుకుంటున్నాడు. ఆటలో అతడు దాని ముఖము మీద గిల్లాడు. ఆట అవగానే అతడు తన తల్లి పార్వతి దగ్గరకు వెళ్ళాడు.అతనికి తన తల్లి బుగ్గ మీద గిల్లిన గాయం కనిపించింది. అప్పుడతడు "అమ్మా నీ బుగ్గ మీద ఆ గాయమేమిటి, ఎంత పెద్ద దెబ్బతగిలిందమ్మా, అసలెలా తగిలింది " అని అడిగాడు. అప్పుడు పార్వతీదేవి, "నువ్వే కదా నాయనా గిల్లావు" అని సమాధానము చెప్పింది.

             కార్తికేయుడు నివ్వెరపోయి "అమ్మా, నిన్ను నేనెప్పుడు గిల్లాను?నాకేమి గుర్తులేదే" అని అన్నాడు. అప్పుడు పార్వతి "నాయనా ఈ రోజు వుదయము నువ్వు ఆ పిల్లిని గిల్లవు మరచిపోయావా" అని అడిగింది. కార్తికేయుడు, "అది నిజమే!మరి నేను ఆ పిల్లిని గిల్లితే నీ బుగ్గ మీద ఎందుకు గాయమయ్యింది?" అని అడిగాడు. అప్పుడు ఆ జగజ్జనని, "నాయనా! ఈ ప్రపంచములోని ప్రతి ప్రాణిలోనూ నేను వున్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే ! అందువల్ల నువ్వు ఎవరిని గాయపరచినా నన్ను గాయపరచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు చాలా ఆశ్చర్యపోయాడు. జీవితంలో తానెప్పటికి పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరు స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించినపుడు తను ఎవరిని పెళ్ళాడగలడు, అందువలన కార్తికేయుడు బ్రహ్మచారిగా జీవితాంతము వుండి పోయాడు.

    0 వ్యాఖ్యలు:

    Post a Comment