Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

ఐదు తలల నాగుపాము

  • April 26, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • లేబుళ్లు:

  • కర్నాటకలో ప్రత్యక్షమైన ఐదు తలల నాగుపాము
    AA

    పడగ విప్పిన నాగుపాములు తరచూ కనిపిస్తూనే ఉంటాయి. రెండు తలలున్న సర్పాలు కూడా అక్కడక్కడా తారసపడుతుంటాయి. తాజాగా ప్రత్యక్షమైన ఐదు తలల నాగు పాము కర్నాటక వాసుల్ని ఆశ్చర్యపరుస్తోంది. నాగు పాముల్ని సుబ్రమణ్యస్వామి ప్రతిరూపంగా భావిస్తారు హిందువులు. నాగుల చవితిరోజు మహిళలు పోటీపడి పాముల పుట్టకు పాలు పోస్తుంటారు. పిల్లలులేని మహిళలు ప్రత్యేకంగా నాగదేవతను కొలవడం హిందువుల సాంప్రదాయం. ఇక రెండు తలల నాగుపాములు కనిపిస్తే..వాటికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. అక్కడక్కడా కనిపించే రెండు తలల నాగుపాములను చూసి ఆశ్చర్యపోతుంటారు. రెండు తలల పాములు కనిపిస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది. వాటిని చూసేందుకు ఆసక్తి చూపుతారు. ఇక ఐదు తలల నాగుపాము తారసపడితే...మహాద్భుతంగా భావించడం సహజం. ప్రత్యేకించి హిందువులు పంచముఖ సుబ్రమణ్యస్వామిని కొలుస్తారు. అదే..ఆకారంలో ఐదు తలల నాగుపాము ఇటీవల కర్నాటక రాష్రంలోని ఓ దేవాలయంలో ప్రత్యక్షమైంది. ఆ దేవాలయం సుబ్రమణ్యస్వామిది కావడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పగడ విప్పిన ఐదు తలల నాగుపాము దేవాలయంలో ప్రత్యక్షం కావడం భక్తులను సభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. దేవాలయంలోని ఓ ఔత్సాహికుడి దాన్ని ఫోటో తీశాడు. ఆ తరువాత కొద్దిసేపటికి అది అక్కడ నుంచి వెళ్లి పోయింది. భక్తులు మాత్రం దాన్ని సాక్షాత్తు సుబ్రమణ్యస్వామిగా భావిస్తున్నారు. రెండు తలల పాములు మాదిరిగానే ఐదు తలల పాములు ఉండడం సహజమంటున్నారు శాస్ర్తవేత్తలు. ఎవరెన్ని చెప్పిన ఐదు తలల నాగుపామును అద్భుతంగానే భావిస్తున్నారు భక్తులు. 

    0 వ్యాఖ్యలు:

    Post a Comment