Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

కెంపు :

  • April 27, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • లేబుళ్లు:
  • కెంపు :
    జ్యోతిశ్శాస్త్రంలో కెంపు ప్రాధాన్యత :
    మాణిక్య రత్నము సూర్యగ్రహానికి అతి ప్రీతిపాత్రము ఎందువల్లననగా సూర్యగ్రహ సంభంధమైన వర్ణ, గుణతత్వములాదిగాగల సమస్తము కెంపునకు కూడా జెంది యుండటమే! పంచమహా భూతాలలో అగ్నితత్వము గల రత్నము కెంపు నవగ్రహములలో అగ్ని తత్వ గ్రహము రవి. ఈ ప్రకారము అన్ని విషయాలలోను సూర్యగ్రహాన్ని బోలిన గుణతత్వాలు కెంపుకున్నవి.ఈ రత్నము త్రిదోషమునందలి పిత్త గణదోషములను శమింపజేయగలదు. సమాన వాయువు దీని సంకేతమై ఉన్నది. పురుషజాతికి చెందిన ఈ కెంపు శరీరమందలి మణిపూర చకమునందు తన కాంతి పుంజములను ప్రసరింపజేసి, కళ్ళదృష్టి, హృదయము, మెదడు అను అవయవములపై తన ప్రభావము చుపగలదు.
    కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాడ అను నక్షత్రములందు బుట్టినవారు ఏ కాలమునందైనను కెంపును ధరించుటకు అభ్యంతరముండదు. ఇతర నక్షత్ర జాతకులు వారి జన్మకాలీన దశాంతర్దశలు-గోచారము మొదలగు విషయములు గమనించి సూర్యగ్రహము బలహీనుడై దుష్ట
    ఫలితములనిచ్చుచున్నప్పుడు స్వచ్ఛమైన కెంపును ధరించిన యెడల వారికి సూర్యగ్రహారిష్టము తొలగి వివిధ శుభఫలితములు కలుగుచుంటవి.
    జాతమునందు రవిగ్రహము 6-8-12 ఆధిపత్యములు కల్గుట 6-8-12 అధిపతులతో కలియుట, లేక షష్ఠాష్ట వ్యవస్థానములందు పాపగ్రహ సహితుడై ఉండుట, షడ్వర్గబలము లోపించుట, అష్టక వర్గమునందు హీనబిందువులు కలిగియుండుట, మొదలగు దుర్లక్షణములు సంభవించి బలహీనుగై అతని (రవి)యొక్క దశాంతుర్దశాది కాలములందు వ్యతిరేక, దుష్టఫలితముల నిచ్చుచున్నప్పుడు ఆ దోషపరిహారమునకు కెంపును ధరించవలెను.
    కెంపుద్వార కలిగే శుభయోగాలు :
    ఉత్తమమైన జాతి కెంపులు శాస్త్రీయ పద్ధతులలో ధరించిన వారికి ముఖ్యంగా శరీర ఆరోగ్యం సక్రమమైన పద్ధతులలో కొనసాగి ఉల్లాసంగా వుంటారు. శరీరంలో కలిగే అనేక విధములైన అనారోగ్యాలను ఈ కెంపు యొక్క కాంతిపుంజాలు నివారణగావించి దేహము యొక్క ఆరోగ్య పరిస్థితిని సక్రమంగా వుంచుతుంది.
    మాణిక్య రత్నధారణ వలన మానవుని మేధస్సు అభివృద్ది జెందగలదు. జ్ఞాపకశక్తి అధికంగా లభించి విద్యార్థులకు పరీక్షలలో విజయం చేకూరగలదు. దారుణమైన శిరోవ్యాధులు, హృదయరోగములు, క్షయ, అపస్మారకము మూర్ఛ నివారణమై తేజోవంతులుకాగలరు. ఆత్మస్థైర్యం చేకూరి ప్రజ్ఞావంతులుగాను, ప్రతిభావంతులు గాను మనగలరు. రాజకీయ సంభంధమైన అనేక కార్యాలలో ఎదురయ్యే అవరోధాలు తొలగిపోయి విజయం చేకూరగలదు. యింకా కోర్టు వ్యవహారాలు సులబంగా పరిష్కరించబడి మేలుకలుగగలదు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఈ కెంపు జాతికి చెందిన కౌస్తుభమణి ధరించి మహాభరతంలో సాటిలేని రాజకీయ చాతుర్యము ప్రదర్శించి విజయాన్ని పొందటం అందరికీ తెలిసిన విషయమే!
    కెంపుకు రవిగ్రహధిపత్యము కలుగుటవలన సూర్య గ్రహము, ఆరోగ్య్టమునకు, శరీరమునకు కీర్తి ప్రతిష్టలకు ప్రధాన గ్రహమగుట వలన, రవి బలంలోపించిన వారికి సామాన్యంగా, అకారణ నిందలు, పరపతి లోపించుట, గౌరవభంగము, శరీర కృశత్వము, అనారోగ్యములు, కుటుంబకలహములు, నేత్రభాధలు, శిరోహృదయ భాధలు తరచుగ కలుగుచుంటవి. రాజకీయంగా సమస్యలు చిక్కులుగలవారు, ఉద్యోగ సంభంధమైన కష్టనష్టములు కలుగుచున్నవారు, దురభ్యాసములకులోనైనవారు, తమ జాతకమునందు సూర్యగ్రహము, బలహీనుడై వున్నాడని గ్రహించి జాతి కెంపును ధరించలి.
    కెంపునుధరించే పద్దతి:
    ఉత్తమమైన రత్నాన్నైనా పరీక్షించకుండా ధరించకూడదు. వివిధ రకములకు చెందిన కెంపులలో పరీక్షయందు నిలచి ప్రకాశవంతమైన ఉత్తమమైనదిగా నిర్ణయించిన రత్నాన్ని షుమారు 30 దినములు తమ వద్ద నిడివిగా ఉంచుకొనిన అనుభవంలో దాని గుణ ఫలితాలు అనుకూలంగా నున్నచో లేవో గమనించాలి శుభ ఫలితాలనిచ్చే రత్నం ఉంగరంలో ధరించటానికి అభ్యంతర ముండదు.
    కెంపులు ఉంగరమునందిమిడ్చి ధరించుట కొరకు గుండ్రని ఆకారము గలవి గానీ లేక నలుచదరపు ఆకారముననున్నవిగానీ శ్రేష్టములు. ఇట్టిరత్నములు 5 రతుల (15 వడ్డగింజల బరువుకు )తగ్గరాదు బంగారంలేక వెండి పంచలోహములలో దేనిచేనైనను ఉంగరము చేయించిన తర్వాత పుష్యమీ నక్షత్ర ఆదివారముగానీ, హస్తానక్షత్రయుక్త ఆదివారమునందుగానీ అమావాస్యా ఆదివారమునందుగానీ మధ్యాహ్నం 1-2 గంటల మధ్యగానీ (ఈ కాలంలో వర్జ్యం ఉండరాదు.)ఉంగరంలో బిగించి ఆ ఉంగరమును ఒక దినము ఆవుపాల యందు, ఆ మరుదినము ధాన్యమునందును, మూడవ దినము మంచినీటి యందును వుంచి నిద్ర గావింపజేసి శుద్దిచేయాలి.
    పంచాంగం శుద్ది అనగా ధరించువారికి తారాబలం చంద్రబలములు కలిగి శుభకరమైన తిదులలో ఆది, సోమ, బుధ, గురువారములయందు, మేష సింహ, ధనుర్లగ్నములు గల సమయములందు పూజించి కుడిచేతికి అనామికా వ్రేలికి ధరించాలి ఉంగరమును ధరించుటకు ముందుగా గంధపుష్పాక్షతములచే పూజించి ధూపదీపములర్పించి కొబ్బరికాయ కొట్టి, ఫలక్షీరములు నివేదన గావించి, భక్తిపూరస్సరముగా నమస్కరించి, గురువుని, గణపతిని, సూర్యభగవానుని స్మరించి, ఉంగరమును కుడిభాగమందలి అరచేతిలో పెట్టుకొని సూర్యునికెదురుగా నిలబడి "ఓం హ్రీం శ్రీం క్లీం సః సూర్యాయ నమః స్వాహా" అనే మంత్రాన్ని 108 సార్లు స్మరించి ఉంగరమును ముమ్మారు కళ్ళకద్దుకొని వ్రెలికి ధరించాలి. ఉంగరములో రత్నానికి అడుగుభాగంగల స్థానంలో రంధ్రం వుండి రత్నమునందలి దివ్యకిరణములు శరీరమునందు ప్రవేశించవలెను.

    0 వ్యాఖ్యలు:

    Post a Comment