ఈ మధ్య గుడి ముఖమంటపం పడగొట్టి బాగుచేసినప్పుడు మహర్షులు బొమ్మలు పగిలిపోయినవి. (కోడి) కుక్కుటము, నెమలియు తలలు పోవుటచే ప్రక్కకు తొలగించిరి. ఆలయం బాగుచేత సుమారు ముప్పైఅయిదేండ్ల క్రిందట జరిగింది.ఆ పర్వతాలు నేర్పుకు భక్తికి ప్రతీకగా ఇపుడు గుఱ్ఱము, నందియు, గణపతి, గరుత్మంతుడు నేటికిని నిల్చినవి వాటి యెడలందు సర్వప్రకృతి చిత్రణము నగుపించు కాల్పులో కూడా చిత్రణ మార్పురాలేదు. అది దైవానుగ్రహము గాక మరేమగును. ఏ విధముగా సుబ్రహ్మణ్యుడు తన కృపను ఫణమొనర్చి యాలయ మేర్పరచుకొన్నాడు. సుబ్రహ్మణ్యార్పణకు సంకల్పించి తయారొనర్చిన యా బొమ్మలు కుమ్మరి కాల్చినాడు గాన వంకర తిమకరులు రాలేదనిన తప్పుకాదు. దానకారణం 'అగ్నిభూ:' అని యామూర్తికి పేరున్నది. కుమారుని కైవసంబగు వానిని తండ్రి తప్పొనర్చడు గదా!
సుబ్రహ్మణ్యుని మహిమలన్నియు వర్ణనాతీతము సుబ్రహ్మణ్యుని గరిమ చే మోపిదేవి పురోగమిస్తోంది. ఈ క్షేత్రములో ఆలయమును సందర్శించి శ్రీస్వామివారికి మ్రొక్కుబడులు అర్పించి కోర్కెలు సడసి యానందించు వారెందరో కలరు. నమ్మికతో తన దరికి వచ్చిన వారిని కరుణించి కాపాడి చల్లని కరుణామృతము వర్షించి ఈ హరసుతుడు పరిజనులకు పొరుగువారిపై సైతము పెరటిలో నున్న హరిచందనమై కీర్తిల్లినాడు. మోపిదేవి చిన్నపల్లెటూరు మాత్రము అయినను శ్రీశరజన్మునిదయ చేత వాడవాడలా పదిగురినోట విస్తరించింది. ఎక్కడెక్కడి వారలో వచ్చి మ్రొక్కులు తీర్చుకొనుట పరిపాటి అయినది. శ్రీ స్వామివారి మహిమలు వినుటయేగాక స్వానుభవమును కూడా తోడై దేవరకోట ఎస్టేట్ చల్లపల్లి నుండి శ్రీమత్ రాజావారి వంశీయులు వచ్చి పౌరుల సంప్రదింపులతో నీ ఆలయమును తమ యాజమాన్యమునకు తీసుకొనినారు. వారికి ఈ మూర్తి యిలవేల్పయి బ్రహ్మొత్సవములు సైతము మహావైభవో పేతముగా రాజలాంచనములతో షుమారు రెండువందలయేండ్ల నుండి జరిపించుకొనుట సర్వజన విదితము.
శ్రీ సుబ్రహ్మణ్య పూజ
ఓం ఆచమ్య, "ఓం కేశవాయ స్వాహా" "ఓం నారాయణాయ స్వాహా" "ఓం మాధవాయ స్వాహా" "ఓం గోవిందాయ నమః" "విష్ణవే నమః" " ఓం మధుసూదనాయ నమః " "ఓం త్రివిక్రమాయ నమః " " ఓం వామనాయ నమః " " ఓం శ్రీధరాయ నమః " ఓం హృషీ కేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్దాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నార సింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్ధనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః
మమోపాత్త ...... శుభే ....... శుభతిథౌ, శ్రీమాన్ ..... గోత్ర : నామదేయః శ్రీమతః ............ గోత్రస్య నామధేయస్య మమ సర్వాపమృత్యు పరిహారార్ధం సర్వదోషనివారణార్ధం మనోవాంచాఫల సిద్ద్యర్ధం ధర్మార్ధ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధసిద్ద్యర్ధం చ ఇహ జన్మని జన్మాంత రేషు కృత పీడాపరిహారార్ధం పుత్రా పౌత్రాభి వృద్ద్యర్ధం శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర దేవతా ముద్దిశ్య ...... ప్రీత్యర్ధం యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే త్దంగా కలశారాధనం కరిష్యే కలశం గంధ పుష్పాక్షతై రభ్యర్చ్య కలశస్యముఖే విష్ణు: కంటే రుద్రా స్సమాశ్రితః ! మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్రు గణాస్మ్రుతా: ! కుక్షౌతు సాగరా స్సర్వే సప్త ద్వీపావ సుంధరాః రుగ్వేదో యజుర్వేదో స్సామవేదో హ్యధర్మణః ! అంగైశ్చ సహితాసర్వే కలశాంబు సమాశ్రితాః గంగైచ యమునేచైవ కృష్ణే , గోదావరి , సరస్వతి , నర్మదా సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు ఆయాంతు శ్రీవల్లీ..... దేవతా కలశ పూజార్ధం దురితక్షయ కారకాః కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి ), ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆ నీటిని తనపై చల్లుకోవాలి ) ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య (పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి ).
ధ్యానమ్:
పార్వతీ హృదయాంభోజ చిత్ర భానో మహాతనో
బ్రహ్మణ్య! బ్రహ్మవిద్గణ్య ! సుబ్రహ్మణ్య సురప్రభో
ప్రారబ్ద వార సంహార షాన్మాతుర శివంకర
నమః శ్శరవణో ద్భూత ధ్యాయేత్వాం సతతం హృది
శ్రీవల్లీ దేవసేనా సామెత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః -- ధ్యానం సమర్పయామి
శివాత్మజ మహాతేజః శివాంకాసన సువ్రజ
దదామ్యావాహనం తుభ్యం భవానీ సుముఖప్రజ.
శ్రీ వల్లీ దేవసేనా ....... ఆవాహనం సమర్పయామి
గుహదేవ సహృద్భావా దేవ సేనా సతీధవ
రత్నపీటం మయాదత్తం వీతిహొత్ర సముద్భవ !
శ్రీవల్లీ .................. నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి
వందారు జన సందోహ బృందాకర మహీరూహ
బాలఘాస సమాయుక్తం పాద్యంశక్తి శరావహ
శ్రీవల్లీ ............... నమః పాదయో: పాద్యం సమర్పయామిదేవాపగా సముద్భూత గీర్వాణ జనవేష్టితః
అర్ఘ్యం కాశాగ్ర సంకీర్ణం వరముద్రా సమంచిత
శ్రీవల్లీ............... నమః హస్తయో రర్ఘ్యం సమర్పయామి
కృత్తికా హృదయానంద భక్తలోక సుఖప్రద
జాతీ సుగంధ సంబంధ వారి మాచ మనందదే
శ్రీవల్లీ................నమః మధుపర్కం సపర్పయామి
గంగాపుత్ర జగత్పాత్ర హేతుమాత్ర పవిత్రభో
స్నానం పంచామృతో దైస్చస్వామినాధ ! మహాప్రభో !
శ్రీవల్లీ................ నమః పంచామృత స్నానం సమర్పయామి తతః శుద్దోదక స్నానం సమర్పయామి స్నానంతరం మాచమనీయం సమర్పయామి.
శక్తిబాణ మహాసేన బర్హి యాన మహాఘన
క్రౌంచ ధారణా వస్త్రంతే కాంచనం పూజనోదితమ్.
శ్రీవల్లీ...... నమః వస్త్రయుగ్మం సమర్పయామి
బ్రహ్మారాధ్య పదాంభోజ బ్రహ్మవిద్యా దురంధర
యజ్ఞ సూత్రం శ్రుతి ప్రోక్తం బ్రాహ్మన్ బ్రహ్మవినిర్మితమ్
శ్రీవల్లీ.......... నమః సువర్ణ దివ్య యజ్ఞోపవీతం సమర్పయామి
వల్లీనాధ జగన్నాధ శూరా పద్మా సురోద్భిద
చందనం శీత సౌగంధ మర్పయామి వరప్రద
శ్రీవల్లీ...........నమః శ్రీగందాన్ ధారయామిషడానన శ్రుతిప్రాణ ప్రణతార్తి వినాశన
నా నావల్యంత సౌరభ్యాం స్రజంభక్త్యా సమర్పయే
శ్రీవల్లీ ......... నమః అనేక పుష్పమాలికా సమర్పయామి
అధాంగ పూజ
స్కందాయ నమః పాదౌ పూజయామి
కుమారమూర్తయే నమః గుల్ఫౌ పూజయామి
పార్వతీసుతాయ నమః జంఘే పూజయామి
అగ్నిగర్భాయ నమః జానూ పూజయామి
శిఖివాహనాయ ఊరూ పూజయామి
గుహాయ నమః హృదయం పూజయామి
శరజన్మనే నమః ఉదరం పూజయామి
సేనాధవాయ నమః బాహూన్ పూజయామి
కార్తికేయాయ నమః కక్షౌ పూజయామి
క్రౌంచధారణాయ కంటం పూజయామి
షణ్ముఖాయ నమః ముఖం పూజయామి
విశాఖాయనమః కర్ణౌ పూజయామి
శక్తిధరాయనమః హస్తాన్ పూజయామి
ద్విషిణ్నేత్రాయ నమః నేత్రాణి పూజయామి
షాన్ముతురాయ నమః శిరాంసి పూజయామి
సుబ్రహ్మణ్యాయ నమః సర్వాణ్యంగాని పూజయామి
ఇక్కడ అష్టోత్తరములు లేక సహస్రములు చెప్పవలెను.
ద్విషడ్భుజ షడ్బాహొ శరజన్మన్ శివప్రద
దూపమాఘ్రాపాయే దేవ గుగ్గులంచ పరీమళమ్
శ్రీవల్లీ.......నమః ధూపమాఘ్రాపయామి. వృజినద్రజ సంహార గజానన సహొదర
గోఘ్రుతాక్తం వర్తి దీపం విశాఖాన జ్ఞానవాపకమ్
శ్రీవల్లీ............నమః దీపం దర్శయామి
పదార్దై ర్భహుళై ర్యుక్తం స్నాన మాపన్నరక్షక
నివేదయే మహానంద చరనాయుధ కేతన
శ్రీవల్లీ........నమః నైవేద్యం సమర్పయామి ఉత్తరాపోశనం సమర్పయామి.
హస్తాన్ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి.
సంసార వార్ధి సంతార సాధుసౌహార్ద భాసుర
తాంబూలం ముక్త చూర్ణక్తం పూగీఫల సమన్వితమ్
శ్రీవల్లీ........నమః తాంబూలం సమర్పయామి
జ్ఞాన స్వరూప సందీప ప్రాజ్ఞ ప్రజ్ఞానదాయక
నీరాజనం సకర్పూరం తారకూసుర మారక!
శ్రీవల్లీ...... నమః కర్పూరా నంద నీరాజనం సమర్పయామి.
వేదసార మహొదార వేదవాక్యాను గోచర
మంత్రోక్త విధి నాతుభ్యం దక్షిణాం కుసుమాంజలిం
శ్రీవల్లీ.......నమః మంత్రపుష్పం సమర్పయామి.
కేకివాహ నమస్తుభ్యం నమస్తే కుక్కుట ధ్వజ
నమోనమస్తే సేనాని పాపానివినివారాయ
శ్రీవల్లీ.........నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.
చామరం వ్యజనం ఛత్రం నృత్త గీతం ప్రదర్శయే
సర్వోపచార పూజాంశ్చ గృహాణ శర సంభవ
అన్యా సుబ్రహ్మణ్యే శ్వర దేవ స్సుప్రీతి స్సుప్రసన్నో వరదో భవతు మమ ఇష్ట కామ్యార్ధ సిద్ధిరస్తు ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.శ్రీ సుబ్రహ్మణ్య దండకము
శ్రీమన్మహా దేవ పుత్రా వచోధీశ పౌత్రా, భవానీ హృదంభోజమిత్రా, పరేషాన గోత్రా, వీతిహొత్రాంగ నాగర్భ శుక్త్యంబు దత్యక్త సుస్వాతికార్త్యంబు మాత్రా మహాజ్ఞాన పాత్రా, పవిత్రాచ్చ గంగాజలోత్తుంగ రంగత్త రంగానుషంగాంగ పాత్రా, పవిత్రా, విశేషాచ్చ కాశాటవీ జన్య సౌజన్య గాత్రా, సుగాత్రా, మునీంద్రాంగ నాభవ్య వక్షోరుహస్తన్య సంపుష్ట చిత్రా, కృపాపూర్ణ నేత్రా, సురాధీశ గోత్రారి పుత్రీ గళానంద బద్దార్హ మాంగల్య సూత్రా సుపర్వాణమిత్రా, కృతానేక పాపాతవీ జన్య దుష్పాద పొద్దాహ కృద్వీతి హోత్రా, లసత్ప్రుష్టి పాత్రా, దురాచార వల్లీలవిత్రా, విచిత్రా శుభావాస్త వల్ల్లీ కళత్రా మహాసచ్చరిత్రా, నినున్ తెల్పగా శక్యమే? తొల్లిటన్ సర్గకాధార మై పారామి సర్వసంపూర్ణ మై మీరి యోంకారమై వేదవాక్సారమై, మారి, దిక్పాలక వ్రాత మర్దింప, లోకాలు కాపాడు సంకల్పముం జేసి, శర్వత్రికూటంబు కూటంబు కాగా, భవానీ మనోమోదముం గూర్చి స్కందత్వమింపొంద నగ్నిన్ని నిమిత్తంబుగా నూని స్వాహాంగనా గర్భసందర్భముం గాంచి యల్లంత మిన్నేటిలో ముద్దయై
యెడ్డునుంబట్టి యచ్చోటునన్ రేల్లులో పిల్లడై మించి కెవ్వంచు విన్పించి ప్రాంత ప్రయాణస్థులన్ చెంతకుంజేర్చి కవ్వించి లే నవ్వులొల్లించి తన్నేత్ర పర్వంబు గావించి వాత్సల్యము బెంచి లీలల్ ప్రపంచించి యా పుణ్య సీమంతినీ కక్షలన్ జేరి పొత్తిళ్ళల్లో బిడ్డడై యడ్డమై యారుమోముల్ విడంబించి తట్ స్తన్యముంగ్రోలి యల్లారు ముద్దౌచు రాణించు నిన్నెన్న సామాన్యమెట్లౌనయా, కార్తికేయా జగన్మాతకున్ ముద్దునై దివ్య కైలాసముంజేరి టీవిన్ శివోత్సంగమన్ దగ్గేపై ముద్దులున్ బెద్దగా జూపుచున్ సుద్దులన్ గొల్పుచున్ పెర్గి ఫాలాక్షుడాచార్యుడై విద్ధియల్ నేర్ప, పాండిత్య మార్జించి శౌర్యంబు జూపించి క్రౌంచాద్రి భేదించి శక్తీషు వుందాల్చి బృందారకుల్ వచ్చి వందారులై కొల్వ సేనాధి పత్యంబుచేబట్టి తత్తార కామర్త్య వైరిన్ తలంగొట్టి సింహాస్యక్రవ్యాదునింగూల్చి యాశూర పద్మాసురుం జీల్చి చెండాడి వైవ స్వంతాంతః పురాతిథ్య మొందించి జేజేతులు రాబట్టి జేజేల రప్తి కంటాన మాగళ్య సూత్రంబునుంగట్టి , వేజెట్టి వైయుంటి విట్లంచు రూపించ గా సాధ్య మెలాగయా ! బాహులేయా ! సరోజాత జాతుం 'డహం బ్రహ్మ ' నాబల్క కాదంచు వాదించి బ్రహ్మ స్వరూపంబు బోధించి మెప్పించి యానంద మొందించి యవ్వానిచె ' సుష్టు బ్రహ్మణ్యభ్యో ' యందు బిల్పించు కొన్నట్టి బల్ మేటి వేపాటి నౌ విప్పనో పార్వతీ నందనా! కేకిరాట్స్యందనా! కల్కి మా పాపముల్ వాపగా పెక్కులౌ యిక్కలన్ కోవలన్ బోయుచున్ కాపురంబుండి డెందంబులన్ గూర్చుచున్ కౌతుకాలిచ్చుచున్ దొడ్డిలో వేల్పుగిడెన పున్యాత్మునేరే నిరూపించువారే కుమారా, ధర న్నీనివాసంబు లెందెందునందున్న కృష్ణాసరిత్తీర మందున్న 'శ్రీ మోపిదేవి' పురంబిడ్డ యన్నింటిలో మిన్నయౌకా, విశాఖ, యిటన్నీవుచూపించు మహాత్మ్యముల్ విప్పి యెట్లుందు నో స్కందకాంతాళిలో దోషముల్ వాపగా చీ కులల్లార్పగా సంతవుల్ కూర్పగా కోరికల్ తీర్పగా నేర్పులన్ కొంటివె, బాలికా బాల సంఘాలకినీ కృపాదృష్టి దివ్యౌషద ప్రాప్తియై కంటిలో కాయలన్ గెంటెడిన్ వీనులన్ పోటు లన్ దూటెడిన్ మేను పై మచ్చలన్ వాపెడిన్ నెత్తిపై కుర్పులన్ గోటితో గిల్లెడిన్ నిత్యమోయన్న సుబ్బన్న, ఈ యెన్ని కంగొన్న మిన్నాగువై యిందు కన్నాకువై కీర్తి నార్జించి ఈ యూరి నన్వర్ధ యాత్రాస్థలంబిద్ద కైలాసరంగంబుగా జేసి యందందు నందుడు స్త్రీ పురుషుల్ వచ్చి వె మ్రొక్కు లందించి డెందంబులున్ విచ్చి పోజేయుచున్నావు కాదా, యభీష్టప్రదా నీదు సార్ర్దాత్వమే మాదు భాగ్యాప్తి నీ వీక్షనంబే సదా రక్ష, యోస్వామినాధా, యపాస్తవ్యధా దేవ, దేవాదిదేవా, యనంత ప్రభావ దయార్ద్ర స్వభావా , కుమారేశ దేవా, నమస్తే నమస్తే నమః
శ్రీ శాండిల్య గోత్ర జో భమిడి పాట్య న్వర్ధ వంశోద్భవః
సుబ్రహ్మణ్య తనూభవో రచితవాన్ లక్ష్మీ నృశింహభిదః
క్రుష్ణాతీరగ మోపిదేవి పురవాస శ్రీ బుదారాధకః
సుబ్రహ్మణ్య క్రుపావిశేష కలితః పూజావిధిం దండకమ్.
|