Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.
  • May 21, 2012
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)








  • వికాస కేంద్రాలు - మన ఆలయాలు

  • January 10, 2012
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)

  • వికాస కేంద్రాలు - మన ఆలయాలు

    apr  -   Sun, 8 Jan 2012, IST
    సంస్కృతి
    విశ్వశాంతికి నిలయాలుగా, ఆధ్యాత్మిక ఆనవాలుగా, భక్తికి, ప్రేమతత్త్వానికి నిలువెత్తు సాక్ష్యాలుగా వెలుగొందుతున్నవి మన దేవాలయాలు. మానవత్వానికి నిలుటద్దంగా సంస్కృతీ సాంప్రదాయాలకు ప్రతీకలుగా, సద్గుణ బోధనలను, ఆచార వ్యవహారాలను తరతరాలకు అందిస్తున్న సజీవ సాక్ష్యాలు దేవాలయాలని చెప్పవచ్చును.
    నమ: సాక్షికి రూపం దిద్దిన నిత్యసత్యాన్వేషులైన ఋషులు, కమ్మని నిస్వార్ధ జీవనంతో, నిరంతర అమందా నందాన్ని అనుభవిస్తూ, ప్రశాంతంగా సత్యగుణ ప్రధా నంగా ఉండి సత్య, ధర్మ ప్రతి రూపాలుగా, రాగ, ద్వేషా లకు అతీతంగా ఉండమంటూ శ్రమతో సాధించని విజయం లేదని, పట్టుదలతో అందని శిఖరం ఉండ దని మనకు తెలియజెప్పే ఈ సృష్టికర్తల సువర్ణ రూపం ఆలయంగా చెప్పుకోవచ్చు.
    ఆలయంలో అలరించే కళలు, పలకరించే శిల్పాలు, పరిమళించే సుగంధాలు, కలగలసి ప్రశాంత ఏకాంతంలోకి మనస్సును తీసుకెళ్లి, నిరంతర బాధల నుండి శ్రమ నుండి ఒకింత సేద తీర్చే సహజ సిద్ధమైన మనోవికాస క్షేత్రాలు ఇవి.
    గోపుర-ద్వారాలు
    పరిపరివిధాలుగా పరుగెత్తే మనసు మనిషిది, అదే మానసిక, శారీరక రుగ్మతలకు, సమస్యలకు మూలం. అందుకే ఆలయ ప్రధాన గోపురంపై శిల్పాలు పరిపరివిధాల పోయే మనసు పరుగులు వదిలి పెట్ట మంటూ, మూర్తిమత్వంతో ఆలయంలోకి అడుగుపెట్టమని సందేశమిస్తుంటాయి ఆలయ ద్వారాలు మనిషి ఉన్నతంగా ఎదగటానికి, మార్గాలుగా, పైనున్న ప్రధాన కళశాలు పాంచ భౌతికమైన శరీరం, జీవన గమనంలో అందు కోవాల్సిన ఫల కళశాలుగా మనకు గుర్తు చేస్తుంటాయి.
    బలిపీఠం:
    చెడు భావాలు, నెగటివ్‌ ఆలోచనలు, ఆశయాలు, ఆలాపనలు, ఆకాంక్షలు ఇక్కడ వదిలి పెట్టి, పరిశుద్ధమైన మనస్సుతో, నిన్ను నీవు గుర్తిస్తూ, నీ గురించి, తెలుసుకుంటూ, నీ మనసును వెతు క్కుంటూ సర్వశక్తి సంపన్నమైన సంకల్పంతో బలవంతుడిగా,కమ్మని బోధిస్తుంది ఈ బలిపీఠం. ఇది ఒకనాడు న్యాయపీఠంగా, ప్రమా ణాల వేదికగా విరాజిల్లింది.
    ధ్వజస్తంభం:
    ఇది మనోనిబ్బరానికి, విజయాలకు ప్రతీక, జీవన గమనంలో మనిషి ఏ సమస్యనైనా, ఎదు రొడ్డి నిలవమని తెలిపేది ధ్వజం. మంచి భావాలు, మొక్కవోని స్ఫూర్తి, ధైర్యం, ఉంటే విజయాల మార్గం వైపు మనం పయనించవచ్చునని ఆ మార్గానికి దారి ఎటో చూపించే ధ్వజస్తంభం మూలాగ్రం, మూల విరాట్టు వైపు తిరిగి చూపిస్తుంది.
    పరివార దేవతలు:
    అక్కడి నుండి ఆలయంలోకి అడుగుపెట్టగానే వినమ్రులైన పరివార దేవతలు కనిపిస్తారు. వీరు ఎవరైతే వినమ్రత, బుద్ధికుశలత కలిగి ఆ స్వామి కార్యానికి సిద్ధంగా, ఆ స్వామికి దాసోహంగా ఉంటారో వారు గొప్పవారవు తారని తెలియజేస్తూ, దాస భక్తికి, అనంత శక్తికి ప్రతీకలుగా మనకు దర్శనమిస్తుంటారు.
    మూలమూర్తి :
    ఆలయ మూలమూర్తి జ్ఞాన శిఖరం క్రిందవున్న పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా స్వరూప తేజోమూర్తి ఆయన. జ్ఞానం అనంతమైనది, ఆత్మ అతీతమైనది. అనంతమైన జ్ఞానంతో అతీతమైన ఆత్మను ఛేధించి, శోధించి అందుకోమంటూ, ఆగని భావాలకు, అలుపెరగని ఆలోచ నలకు, తీరని ఆశకు, తృప్తిని సేవానిరతని కలిగించుకొని అమృత ఫల శిఖరకళశాన్ని అందుకోమంటాడు. అంటే ఏ వ్యక్తి అయినా శోధించి సాధించాలని జీవన గమనానికి సార్థకత ఏర్పరుచుకోవాలని చెప్పే రహస్య ఇది.
    ఇలా పొందాలంటే శారీరక, మానసిక ఆరోగ్యం, ధృడసంకల్పం ఆలోచనలలో స్పష్టత, వదలని ధార్మికత, మానవత్వంతో పాటు, మనస్సు, వాక్కు, క్రియ కలగలసిన త్రికరణ శుద్ధిగా మనం చేసే పని ఉండాలి అని తెలియజేసే పూజా క్రమం. భగవనదనుగ్రహంతో పాటు మనకు స్ఫూర్తి విజయాల నిస్తుంది. అందుకే కొన్ని విధులు మనకు కల్పించారు ఋషులు అవి
    1. ఆలయంలోకి పాదరక్షకులతో ప్రవేశించకూ డదంటారు: కారణం మనిషి తన జీవనంలో కష్టాల ముళ్ల పొదలుంటాయి. వాటిపైన కూడా మనం సునాయాసంగా నడవాలన్నది ఇక్కడ అంతరార్థం.
    2. ఆలయ ప్రదక్షిణం: ఆలయ ప్రసాదం, ఆలయ తీర్థం, ఆరోగ్యాన్ని అందిస్తూ ఆలయం వైద్య శాస్త్రంగా పరిఢవిల్లింది.
    3. నమస్కారం: మన సంస్కారం మాత్రమే కాక, నమస్కారాలు, అయిన సూర్య నమస్కారాలు, సాష్టాంగ ప్రమాణాలు వంటివి యోగ విద్యకు దగ్గరగా ఉండి మనిషికి ఆరోగ్యాన్ని, మనో వికాసాన్ని కలిగించేవిగా ఉన్నాయి.
    5. ఆలయం పరిశుభ్రంగా ప్రవేశించమనడంలో మన ఆరోగ్యాన్ని సూచిస్తుంది.
    6. మనిషిని తిలకం లేదా బొట్టు ధరించమని చెపుతుంది ఆలయం ఇది మనిషిలోని జ్ఞాన నేత్ర కేంద్రమైన పిట్యూటరీ గ్రంథిని చైతన్యం చేస్తుంది.
    7. ఆలయంలో కాళ్లు చాపకూడదని, నిద్రపోకూ డదని, కంట తడిపెట్టరాదని చెపుతారు. కారణం ఎందుకంటే అవి మనిషిని కృంగదీస్తాయి. మనిషిని నిరా శకు, నిరాసక్తికి, నిర్లిప్తతకు సంకేతాలు కావున వీటిని వదిలి పెట్టమని చెపుతుంది.
    8. ఆలయంలో వివాదాలకు, పరనిందలకు పాల్పడ కూడదని అంటారు. ఇవి రజో, తమో గుణాలను కలుగ జేస్తాయి.
    9. మనిషికి ఏకాగ్రతను, ప్రశాంతతను అందించి మనస్సు లగ్నం చేసేలా ఆలయం మనకు దగ్గరగా పనిచేస్తుంది.
    10. దృశ్యంగా, శ్రవ్యంగా, కనులకు, చెవులకు, శ్వాసకు, జిహ్వకు చైతన్యం చేసే క్రియలు ఆల యంలో చేస్తాం కావున ఆలయం మనో వికాస క్షేత్రం అవటంలో సందేహం లేదు.
    మనిషికి మూలం మనసు, మనసుకు రూపం శరీరం, శరీరానికి ప్రతి రూపం ఆలయం. అందుకే రాగద్వేషాలు, హింసావాదాలు వదిలి ధ్యాన, జప, యోగ, సమాధి, శాస్త్ర పఠనాదులు, నవవిధభక్తి, మార్గా లు, 64 కళలకు నిలమైన ఆలయం, మనో ఆనాందాన్ని అందిస్తుంది. మనో విశ్లేషకునిగా మారి తన వద్దకు వచ్చిన వారికి మనశ్శాంతిని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాది స్తుంది. మనసు విప్పి చెప్పిన వింటుంది, మనలో పాజిటివ్‌ శక్తి నిస్తుంది. నేను తోడున్నాను అనే భగవంతుని చూపిస్తూ అవి తీర్చేలా చేస్తుంది. అందుకే ఆలయం మనోవికాస కేంద్రం. ఇక్కడి ఆధ్యాత్మిక తరంగాలు భక్తుడికి మానసిక ఆరోగ్య కారకాలు అని చెప్పవచ్చును.
    - పి.వి. బాలాజీ దీక్షితులు