Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

సుబ్రహ్మణ్య

  • April 28, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • తారకాసురుడనే రాక్షసుడు వరగర్వంచేత విజృంభించి లోకాలను అల్లకల్లోలం చేస్తూ ఇంద్రాది దేవతలను భయపెట్టసాగాడు. బ్రహ్మదేవుడు కూడా ఏమీ చేయలేని స్థితిలో శివుని కుమారుడు తప్ప వేరెవ్వరూ ఆ రాక్షసునితో తలపడలేరని చెప్పాడు. దేవతలంతా కుమార సంభవానికి ఎదురుచూశారు. కుమారస్వామి జననం, కుమారసంభవంగా లోక ప్రసిద్ధిని పొందింది. శివపార్వతులొకసారి ఏకాంతంలో ఉండగా ఇంద్రుడు గ్రహించి తనను మించిన ప్రభావంగల పుత్రుడు వారికి జన్మిస్తాడేమోనని భయపడి క్రీడాభంగం కావించాలని నిర్ణయించుకుని వారి క్రీడకు అంతరాయం కలిగించమని అగ్నిదేవుణ్ణి పంపిస్తాడు. అగ్నిని చూడగానే శివపార్వతుల ఏకాంతానికి భంగం కలుగుతుంది.
    పార్వతి ఈ విషయాన్ని గ్రహించి కోపగించి అగ్నిదేవునితో భూమిపై పడిన శివుని వీర్యాన్ని ధరించమని శపిస్తుంది. అగ్ని కొంతకాలం ధరించిన తర్వాత తాను ఆ శివతేజస్సును భరించలేకపోయి గంగ దగ్గరకు వెళ్లి నీవు ధరించదగినదానవు కాబట్టి నీవు దీనిని ధరించి నన్ను రక్షించమని కోరతాడు. గంగ ఒప్పుకుని ఆ గర్భాన్నైతే తాను ధరించింది కానీ కొంతకాలానికి ఆమెకు కూడా అది దుర్భరం కాసాగింది. దానిని ఆమె రెల్లుగడ్డిలో విడిచిపెట్టింది. అక్కడనుంచి సూర్యరశ్మికి పెరిగి బాలుడు ఉదయించాడు. ఆ బాలుడే కుమారస్వామి. ఇతడిని చూసి దానవులు ఆశ్చర్యపోయారు. కృత్తికా దేవతలు ఇతనికి పాలిచ్చారు.
    దేవతలు కుమారస్వామిని సేనాధిపతిగా చేసుకుని తారకాసురునిపైన యుద్ధానికి పంపించారు. మహా ఘోర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రాక్షసులు హతులైనారు. తారకాసురుడిని కుమారస్వామి సంహరించాడు. ఈ మహత్కార్యాన్ని నెరవేర్చిన దేవతలకు ఆనందాన్ని కలిగించాడు. కుమారస్వామి సైన్యాధిపత్యాన్ని వహించడానికి వెనుక ఒక కథ వుంది. ఆరు ముఖాలను ధరించి శోభిస్తున్న కుమారస్వామిని చూడడానికి పార్వతి, శివుడు ఇతర దేవతలు వచ్చి ఇతని బాల్యచేష్టలకు అబ్బురపడి ఎవరి దగ్గరకు వస్తాడో, అని ఆడిస్తూ వుండగా ఆ బాలుడు అన్ని రూపాలు ధరించి అందరి దగ్గరకు వచ్చాడు. ఈ ప్రభావానికి ఆశ్చర్యపడి వారంతా సైన్యాధిపత్యాన్ని ఇచ్చినట్లు స్కాందపురాణం వల్ల తెలుస్తున్నది. కుమారస్వామి శూరపద్మాసనుడు అనే రాక్షసుణ్ణి వధించినందుకు మెచ్చుకొని ఇంద్రుడు తన కుమార్తె అయిన దేవసేననిచ్చి వివాహం చేశాడు. శాఖుడు, విశాఖుడు, నైగమేషుడు, పృష్టజుడు అనేవారు కుమారస్వామి పుత్రులు, కుమారస్వామికి ఆరుగురు కృత్తికలు పాలివ్వడంవల్ల కార్తికేయుడనే పేరు వచ్చింది. ఆరు ముఖాలతో ఒక్కొసారి అతడు పాలను పానం చేశాడు కాబట్టి షణ్ముఖుడైనాడు. స్ఖలితమైన రేతస్సువలన పుట్టినవాడు కాబట్టి స్కందుడనే పేరు కలిగింది. మంచి బ్రహ్మజ్ఞానం కలిగినవాడైనందువల్ల సుబ్రహ్మణ్యుడైనాడు. సు అంటే పరిపూర్ణత అని అర్థం.
    సృష్టించే బ్రహ్మకంటే పరిపూర్ణతత్త్వంతో కూడుకున్న సుబ్రహ్మణ్య స్వరూపాన్ని పరబ్రహ్మతత్త్వంగా కుమారతంత్రం తెలియచేసింది. శ్రీలంక, మలేషియా దేశాలలో సుబ్రహ్మణ్య ఆరాధన జరుగుతున్నది. పళని, పెన్‌మధురచొళె, త్రిపురకుండ్రం, తిరుత్తని, సుబ్రహ్మణ్య మొదలైన క్షేత్రాలు మన దేశంలో విలసిల్లుతున్నాయి.

    0 వ్యాఖ్యలు:

    Post a Comment