Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

జ్యోతిష, ముహూర్త విజ్ణానము

  • June 24, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • లేబుళ్లు: ,

  • జ్యోతిష, ముహూర్త విజ్ణానము

    మూడము: 
    గురు, శుక్రలు రవితో కలసి యుండెడి కాలమున మూఢము లేదా మౌడ్యము అందురు. వారు శుభఫలములనీయరు. కావున వివాహాది శుభకార్యాలు చేయరాదు. ఆశ్లేషాది గండ నక్షత్రములకు శాంతి, హోమ,జప, అభిషేకములు మాత్రమే చెయవలెను.
    గోధూళికా ముహూర్తము: 
    సూర్యుడున్నట్టి లగ్నము నుండి 7వది గోధుళిక మనబడును. మేతకు వెళ్ళిన గోవులు మరలవచ్చెడి - సూర్యాస్తమయ పూర్వవేళ అన్ని ప్రయాణాలకు మంచిది.
    వివిధ యాత్రలకు: 
    స్త్రీ యాత్రకు వృషభ,క్స్న్యా,మిధున, రాసులు; గోయాత్రకు తుల, వృషభ, మేష, మకర లగ్నములు;ధనార్ధులకు కుంభ, కర్కట, మీనా,మకర రాసులు;యుద్దయాత్రకు మేష, వృషభ, సింహా, ధనూర్ లగ్నములు జయప్రదములు.
    తిధి సంధి: 
    అమావాస్యకు శుద్ద పాడ్యమిక నడుమ; పంచమి, షష్ఠీల మధ్య; దశమి, ఏకాదశుల నడుమ, 4 గడియల కాలము తిధిసంధి.
    నక్షత్ర సంధి: 
    రేవతీ అశ్వినుల మధ్యను, ఆశ్లేషా మఘ మధ్యను, జ్యేష్ఠా మూల తారల మధ్యను, - 4 గడియల కాలము నక్షత్ర సంధి.
    లగ్న సంధి: 
    మీన మేషములు, కర్కట సింహములు వృశ్చికల ధనస్సులు- విఇని నడుమ 1 గడియ లగ్న సంధి .
    కనుములు: 
    మరణము, శవదహనమూ, సపిండీకరణము, జాతర ,సంక్రమణము గ్రహము- ఇవి జరిగిన మరుసటి రోజున ’కనుమ’ అందురు.కనుమ రోజున ప్రయానములు చేయరాదు.
    నిషిద్ద నవమీ త్రయము: 
    ఏదైనను ఒక ప్రయాణము చెసిన 9వ రోజున గాని, ఆ తిధికి 9వ తిధి గాని, ప్రవేశము చేయరాదు. ప్రవేశించిన నాటి 9వ నాడు గాని, 9వ తిధిని గాని,- అటునుంశి బయలుదేరరాదు. వీనినే ప్రయాణ నవమి,ప్రవేశ నవమి, ప్రత్యక్ష నవమి అందురు. ఈ మూడు నవములు తిరుగు ప్రయాణమునకు నిషిద్దములు.
    పక్షచ్చిత్ర తిధులు: 
    4,6,8,9,12,14 - తిధులు.
    పరామర్శకు: 
    ద్వీపాద, త్రిపాద తారలు, ధనిష్ఠా పంచకము పనికిరావు. సంఘటించినదాది సంవత్సరము లోపల ఏదో ఒక బేసి నెల పరామర్శకు శుభము.
    తిస్రోష్టకలు: 
    మార్గశిర, పుష్యా, మాఘ, ఫాల్గున మాసములలో, క్రిష్ణ పక్షమున వచ్చు 7,8,9, తిధులలో కూడిన దినములను తిస్రోష్టకము లందురు. ఇవి అనధ్యాయములు.
    విసర్జించవలసిన కాలము: 
    గ్రహణాది 7 రోజులు, లగ్నాంతమున 1/2 గడియలు,మాసాంతపు రోజులు, సంవత్సరమున రోజులు వర్జనీయాలు; శుభకార్యాలు చేయరాదు.
    చుక్క ఎదురు దోషము: 
    శుక్ర మూఢములలో ప్రయాణమునే చుక్కెదురు దోషందురు. నవవధువూ, గర్బిణీ ,బిడ్డతో కలసి బాలెంత- వీరు ముగ్గురును శుక్రాభిమఖముగా ప్రయాణము చెయరాదు. శీవత్సగోత్రము వారికి చుక్కెదురు (ప్రురశ్శుక్ర) దోషము లేదు.
    శన్యషః కాలము: 
    శనివారము సూర్యోదయమునకు ముందు (సుమారు 30 ని!!ల) సమయమున శనుష్యః కాలమందురు. ఈ సమయములో ప్రయాణమై వెళ్ళినను, మరి ఏ పని ప్రారంభిచినను దిగ్విజయమగును.
    అభిజిత్ ముహూర్తము: 
    సూర్యోదయ లగ్నము నుండి నాల్గవ లగ్నము, సుమారు 12 గంటలు వేళ అభిజిన్ముహూర్త మనబడును. ఇది సర్వదోష నివారణము, యత్న కార్యసిద్దిని కలిగించును.
    పంచ పర్వములు: 
    బహుళ, అష్ఠమి,చ్ చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ,సంక్రమన ప్రవేశకాలపు తిధి - ఇవి పంచపర్వములు.వీనియందు స్త్రీసంగమము కూడదు. 

    0 వ్యాఖ్యలు:

    Post a Comment