Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

వర్తక,వ్యాపార సుముహూర్తములు

  • June 24, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • లేబుళ్లు: ,

  • వర్తక,వ్యాపార సుముహూర్తములు

    బంగారం,వెండి నగల వర్తకమునకు: సోమ,బుధ,శుక్ర వారములు; విదియ,తదియ,పంచమి,సప్తమి,దశమి తిధులు; అశ్వి, రోహి, పున, పుష్య, హస్త, చిత్త, స్వాతి,ఉత్తరాత్రయం,అనూ,శ్రవ,ధని,రేవతి నక్షత్రములు మంచివి.
    వస్త్రముల వ్యాపారమునకు: సోమ,బుధ,శుక్ర వారములు; 2,3,5,7,10 తిధులు; అశ్వి, రోహి, పున, ఉత్తరాత్రయం, హస్త, చిత్త, స్వాతి, అనూ, శ్రవ, ధని, రేవతి నక్షత్రములు మంచివి.
    కిరాణ వ్యాపారమునకు: సోమ,బుధ,శుక్ర వారములు; రొహి,మృగ,ఉత్తరాత్రయం,హస్త,చిత్త,అనూ,శ్రవ,ధని,శత,రేవతి నక్షత్రములు ; 2, 3, 5, 7, 10 తిధులు మంచివి.
    ఎలక్ట్రికల్,గాజు వ్యాపారమునకు: సోమ,మంగళ, బుధ,శుక్ర వారములు; 2,3,5,7,10,15 తిధులు ; రోహి,మృగ,పుష్య,హస్త,చిత్త,అనూ,ఉ.భా, నక్షత్రములు మంచివి.
    రేడియో,టి.వి మొదలగు ఎలక్ట్రానిక్ వ్యాపారమునకు: సోమ,బుధ ,శని వారములు;2,3,5,7,10 తిధులు; మృగ, హస్త, చిత్త, స్వాతి, అనూ ,పూ.షా. ,శ్రవ, ఉ.భా. నక్షత్రములు మంచివి.
    ఇనుము,ష్టీలు వ్యాపారమునకు: సోమ,బుధ ,శని వారములు;2,3,5,7,10,11,13, తిధులు; శుక్ల పక్ష చతుర్దశి అశ్వి, రోహి, మృగ, పుష్య, అనూ, స్వాతి, ఉ.భా. నక్షత్రములు మంచివి.
    ఫ్యాన్సీ వ్యాపారమునకు: సోమ,బుధ,గురు,శుక్ర వారములు; 2,3,5,7,10 తిధులు; రోహి,మృగ,ఉత్తర,చిత్త,స్వాతి,అనూ,ఉ.షా.,ధని మంచివి.
    మందుల దుకాణమునకు: మంగళ,బుధ,ఆది వారములు; 2,3,5,7,10,11 తిధులు రోహి,మృగ,ఉత్తర,చిత్త,స్వాతి,అనూ,ఉ,షా.,ధని మంచివి.
    పేపరు,పుస్తకములు,ష్టేషనరీ: సోమ,బుధ,గురు,శుక్ర వారములు; 2,3,5,7,10 తిధులు; రోహి,మృగ,హస్త,అనూ,ఉ.షా.,శ్రవ,ఉ.భా. మంచివి.
    పండ్ల దుకాణమునకు: సోమ,బుధ,గురు,శుక్ర వారములు; 2,3,5,7,10,11,13, తిధులు; రోహి,మృగ, పున, పుష్య,ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, శ్రవ,ధని,పూ.భా.,ఉ.భా.,రేవతి నక్షత్రములు మంచివి.
    పువ్వుల వ్యాపారమునకు: సోమ,గురు,శుక్ర వారములు; రోహి,మృగ, పుష్య,హస్త, చిత్త, స్వాతి,ఉ.షా.,శ్రవ,శత ఉ.భా.,రేవతి నక్షత్రములు మంచివి
    గృహ ఫర్నీచరు దుకాణమునకు: సోమ,బుధ,గురు,శుక్ర వారములు; 2,3,5,7,10,11,13, తిధులు; రోహి,మృగ, పుష్య,ఉత్తరాత్రయం,హస్త, చిత్త, స్వాతి, అనూ,.,శ్రవ,శత,,రేవతి నక్షత్రములు,స్థిరలగ్నములు మంచివి.
    కాఫీ హోటల్స్,స్వీట్ షాపులకు: సోమ,బుధ,గురు,శుక్ర వారములు; 2,3,5,7,10 తిధులు; అశ్వి, రోహి,మృగ, పున, పుష్య,మఘ,ఉత్తరాత్రయం, హస్త, స్వాతి, అనూ,మూల,శ్రవ,ధని,రేవతి నక్షత్రములు,తృతీయ శుద్ధి గల శుభలగ్నములు మంచివి.
    రైస్ మిల్లు ప్రారంభమునకు: సోమ,బుధ,గురు,శుక్ర వారములు; 2,3,5,7,10,11 తిధులు ;అశ్వి, రోహి,మృగ, పున, పుష్య,ఉత్తరాత్రయం,చిత్త, స్వాతి, అనూ,శ్రవ,రేవతి నక్షత్రములు, చతుర్ధ అష్ట శుద్ధి గల స్థిర లగ్నములు మంచివి.
    చిట్ ఫండ్ వ్యాపారమునకు: బుధ,గురు వారములు; 2,5,7,10,11 తిధులు ; అశ్వి, రోహి,మృగ,ఉత్తరాత్రయం,స్వాతి, అనూ,శ్రవ,రేవతి నక్షత్రములు, సప్తమ లగ్ననమందు బలీయమైన శుభ గ్రహమున్నట్టి వృష,మిధున,కర్కట,తులా,ధనుర్,మీన లగ్నములు మంచివి.
    సినిమా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ వ్యాపారమునకు: సోమ,బుధ,గురు,శుక్ర వారములు; 2,3,5,7,10,11,13,15 తిధులు; అశ్వి, రోహి,మృగ, పున, పుష్య, ఉత్తర, స్వాతి, అనూ, ఉ.భా. ,రేవతి నక్షత్రములు,శుక్రుడు బలముగా నుండి, సప్తమ శుద్ధి గలిగిన శుభలగ్నమందు చేయుట మంచిది,శని బలముగా నుండవలెనని కొందరి మతము.
    మోటారు వాహన(ఫైనాన్స్) వ్యాపారమునకు: సోమ,బుధ,గురు,శుక్ర వారములు; 2,3,5,7,10 తిధులు; మేష,వృశ్చిక లగ్నములు మంచివి. అశ్వి, రోహి,మృగ, పున, పుష్య,మఘ,ఉత్తరాత్రయం, హస్త, స్వాతి, అనూ,మూల,శ్రవ,ధని,శత,రేవతి నక్షత్రములు.స్థిరలగ్నములు మంచివి.
    అప్పులు ఇచ్చుటకు,పుచ్చుకొనుటకు: అశ్వి,పున,పుష్య,స్వాతి,విశా,శ్రవ,ధని,శతభిష నక్షత్రములందు;అష్టమశుద్ధి గల లగ్నమందు; 5-9 స్థానములలో శుభులుండుగాను చరలగ్నములలో అప్పులివ్వవచ్చును.బుధవారము నాడు అప్పు యివ్వరాదు. మంగళవారము,హస్తతో గూడిన ఆదివారము,సంక్రమణసినములందును అప్పులు పుచ్చుకొనరాదు.
    జోళ్ళ షాపులకు: కృత్తిక,మృగశిర,ఆర్ద్ర,ఆశ్లేష,మఘ,పూర్వాత్రయ నక్షత్రములు మంచివి.
    పేకాట క్లబ్బు(జూద గృహలకు): మంగళ ,శని,ఆది వారములు; 2,7,8,10,12,13,15 తిధులు; అశ్వి, మృగ, పున, పుష్య, ఆశ్రే, హస్త, చిత్త, స్వాతి, అనూ, మూల, శ్రవ,ధని,శతభిషా ; నక్షత్రములు ; మేష,సింహ,వృశ్చిక, మకర,కుంభ లగ్నములు మంచివి.
    విస్కీ,బ్రాంది,లిక్కర్ వంటి మత్తు పానీయ వ్యాపారములకు: మంగళ,శని,ఆది వారములు;2,3,5,7,10,11,15 తిధులు; భరణి, ఆర్ద్ర, ఆశ్లేష, మఘ, పూర్వాత్రయం, జ్యేష్ట,మూల,శతభిషా నక్షత్రములు; తుల,ధనుః,మకర,కుంభ,మీన,మేష,వృషభ లగ్నములు మంచివి.
    బట్టలకు రంగు వేయుటకు: ఆది,మంగళ,గురు,శుక్ర వారములు ; 2,3,5,7,10 తిధులు అశ్వి,పున,పుష్య,హస్త,చిత్త,స్వాతి,విశాఖ, అనూ,శ్రవ , ధనిష్ఠా నక్షత్రములు మంచివి. 

    0 వ్యాఖ్యలు:

    Post a Comment