Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

హిందూధర్మశాస్త్రాలు

  • July 24, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • లేబుళ్లు:

  • హిందూధర్మశాస్త్రాలు

    హిందూమతము నకు సంబంధించిన ఆధారాలు, నియమాలు, సిద్ధాంతాలు, తత్వాలను వివరించేవి హిందూ ధర్మశాస్త్రాలు. ఇవి ప్రధానంగా సంస్కృత భాష లో వ్రాయబడ్డాయి. ఈ విధమైన సంస్కృత సాహిత్యమును మతపరంగా ఆరు విభాగాలు, మతం తో సంబంధం లేకుండా నాలుగు విభాగాలుగా పరిగణిస్తారు.

    విషయ సూచిక


    ప్రధాన విభాగాలు


    శ్రుతులు

    "శ్రుతి" అనగా "వినిపించినది". అంటే ఈ విధమైన శాస్త్రాలు సామాన్యమైన వ్యక్తులచే రచింపబడలేదు. "మంత్రద్రష్ట" లైన ఋషులకు అవి "వినిపించినవి". చతుర్వేదాలు - అనగాఋగ్వేదముసామవేదముయజుర్వేదముఅధర్వణవేదము - ఇవన్నీ శ్రుతులు. మనుష్యులచే రచింపబడలేదు గనుక వీటిని "అపౌరుషేయములు" లేదా "నిత్యములు" అని కూడా అంటారు. ఇవి హిందూ ధర్మమునకు మౌలికమైన ప్రమాణములు.
    ఒక్కొక్క వేదంలో భాగాలైన సంహితఆరణ్యకముబ్రాహ్మణముఉపనిషత్తులు కూడా శ్రుతులేఅగును.

    ఉపవేదములు

    నాలుగు ఉపవేదాలు ఉన్నాయి. అవి ఆయుర్వేదముగాంధర్వ వేదము (సంగీత సంబంధ మైనది)ధనుర్వేదము (యుద్ధ సంబంధమైనది) మరియు స్థాపత్య వేదము ( శిల్ప విద్యకు సంబంధించినది).

    వేదాంగములు

    వేదాంగములు ఆరు. అవి శిక్షఛందస్సునిరుక్తమువ్యాకరణముకల్పము మరియుజ్యోతిషము.
    ఇంకా ఇతిహాసము అయిన మహాభారతము "పంచమవేదము"గా ప్రసిద్ధి చెందినది.



    స్మృతులు

    "స్మృతి" అనగా "స్మరించినది" అనగా "గుర్తు ఉంచుకొన్నది". ఇవి శ్రుతుల తరువాతి ప్రమాణ గ్రంధాలు. విధి, నిషేధాల(మానవులు, సంఘము ఏవిధంగా ప్రవర్తించాలి, ఏవిధంగా ప్రవర్తించ కూడదు అనే విషయాలు) గురించి స్మృతులు వివరిస్తాయి.

    మతంతో సంబంధంలేని విభాగాలు

    1. సుభాషితములు
    2. కావ్యములు
    3. నాటకములు
    4. అలంకారములు

    0 వ్యాఖ్యలు:

    Post a Comment