Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

కుజ దోషము-పరిహారములు

  • April 22, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • లేబుళ్లు:

  • కుజ దోషము-పరిహారములు
    కుజగ్రహము గురించి: కుజ అనగా భూమి పుత్రుడు. ఆధునిక వైజ్ఞానికులు కుడా భూమికి కుజునికి పోలికలు ఉంటాయని నిరూపించారు.
    ధరణీ గర్భ సంభూతం - విద్యుత్కాంతి సమప్రభం|
    కుమారం శక్తిహస్తం - తం మంగళం ప్రణమామ్యహం ||
    అని మన పూర్వ మహర్షులు వర్ణించారు.  ఇనుము,తుప్పు పొరతో నిండిన గోళం అని అందుకే కుజ గ్రహం ఎర్రగా ఉంటుందని అంటారు వైజ్ఞానికులు.మరి ఈ శ్లోకం అదే తెలుపు తున్నదికదా... ఎరుపుకి, ఇనుములోని శక్తికి అధిపతి అయిన కుజుడు గ్రహ రాజ్యంలో సైన్యాధ్యక్షుడు అని జ్యోతిషంలో శాస్త్రజ్ఞులు చెప్పారు.వినయంగా నమస్కరించే వారికి కోరికలు తీర్చే కల్ప వృక్షం కుజుడు. మంగళవారము కుజునకు చెందినది.ఎరుపు వర్ణము కలిగి, ఎరుపు వస్త్రములు ధరించి, శంఖంలాంటి మెడ, సుందరమైన పాదాలు, పొట్టేలు వాహనము, చేతిలో శులాయుధం కల మంగళుడు నిజంగా మంగలప్రదాయుడే. కేవలం గ్రహాల మంచి అయినా, చేదు అయినా వాణి పేరు బట్టి నిర్ణయించ కూడదు.  కొన్ని అంశములు, వాటి స్తితి గతుల బట్టి నిర్ణయించాలి. కేవలం కుజుడే కాదు, ఏ గ్రహము అయినా సుభ, అశుభ ఫలితములు కలిగి ఉంటాయి. అలాగే శని ఇతర గ్రహాలూ కూడా..
    మరి వివాహ విషయములో కుజగ్రహ దోషము గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తారు అంటే... స్త్రీల జతకములో కుజుని స్థానం బట్టి వరుని పరిగణిస్తారు.  మాంగల్యం అనేసౌభాగ్యము స్త్రీలకు సంబంధించినది కావటంవల్ల కుజదోషం వివాహాల విషయంలో చూడటం సంభవిస్తున్నది. మరి ఈదోషం పురుషులకు పురుషులకు కూడా అప్పదించి కుజ దోషం కల స్త్రీకి కుజదోషం కల పురుషునికి వివాహం చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు, జాతక పొంతనాలు చూడకకుండ చేసిన సరికాదు. ఇక్కడ వివాహ కారకుడు అయిన శుక్రుడు కుజునికి శత్రువు.  శాస్త్రరిత్య వివాహ కారకుడు అయిన శుక్రుడు ప్రమాద రహిత స్తానాలలో ఉండుట ఉత్తమం.
    కుజ దోషంగా చెప్పబడే స్థానాలు:  రెండవ ఇంట, నాలుగవ ఇంట, ఏడవ ఇంట, ఎనిమిదవ ఇంతద, పన్నెండవ ఇంట  కుజుడు ఉండకూడదని.
    కాని కుజనక్షత్రాలలోగాని, రాశులలోగాని, ఉచ్చ రాశులలోగాని, కుజ దోషం ఉండదు. అల్లానే, బుధ, రవి, గురు దృష్టులు ఉంటె దోషము ఉండదు. అవి పరిశీలించి, జాతక పొంతనలు చూసి వివాహము చేయాలి. అలా చేయనిచో భార్య,భర్తల అన్యోన్యత లోపించుట, తరచుగా కలహాలు, భర్తకు నీచ సంబంధము లుండుట, దాంపత్య సుఖము లోపించుట, భర్త నిర్వహించావలైన బాధ్యతలకు దూరంగా సన్యాసి మనస్తత్వము కలిగి ఉండుట,సంతన హీనత , దుర్వర్తనం, ఇళ్ళ సంసారంలో అనేక లోపాలు ఉంటాయి కాబట్టి కుజ దోషం గురించి వివాహాలలో తరచి చూడటం జరుగుతుంది. ఏయే గ్రహాలతో ఉంటె ఏయే ఫలితాలోగుడా చెప్పబడింది
    వీటి గురించి అనేక పరిహారాలు శాస్త్రం నందు చెప్పబడినాయి కావున భయ పడవలసిన అవసరం లేదు.ఈ పరిహారక క్రియలు సమస్య యొక్క స్వరూపం బట్టి,జాతక పరిశీలనా చేసిన తరువాత చేయ వలసి ఉంటుంది. ఈ పరిహారాలు అందరికి ఒకలాగేనే ఉండవు. ఈ పరిహారాలు ఎవరికీ వారు ఆచరిస్తేనే మంచిది వ్యక్తి చేయలేని పరిస్తితిలో ఇంకా ఎవరైనా చేయవచ్చు. పరిహరక క్రియ ఏదైనా మనస్సు కేంద్రీకరించటం,నమ్మకము,విశ్వాము, భగవంతునికి సంపూర్ణ సమర్పణ  ఉండాలి.భగవంతుడే ఈ క్రియలు జరుపుతున్నడన్నా భావన రావాలి. ఎవరికీ ఏది వీలు అయితే దాని ఆచరించచ్చు కుజగ్ర దోష శాంతి విధానాలు చెప్పబడినాయి.
    • సుభ్రహ్మన్యస్వామి కుజుని అధిపతి కావున అయన షష్టి నాడు సుబ్రహ్మన్యష్టకం ఏడు సార్లు పారాయణ చేయాలి.
    • ఏడు మంగళ వారాలు ఉపవాసం ఉంది కుజ గాయత్రి  డెభై సార్లు పారాయణం, చేసి ఆఖరి వారము కందులు దానం ఇవ్వాలి.
    • కుజ శ్లోకం ప్రతి రోజు డెభై మార్లు పారాయణం చేయాలి.  కుజ జపం చేయించి కందులు ఒకటింపావు ఎర్రని వస్త్రములో మూట కట్టి దక్షిణ, తాంబూలాలతో దాన మివ్వాలి.
    • స్త్రీలు పగడపు మాల, ఎర్రని వస్త్రాలు, ఎర్రగాజులు, కుంకుమ ధరించి ఎర్రని పూలతో పూజించాలి.
    • ఎర్రని పండ్లు, ఎర్రని వస్త్రాలు దానం చేయటం అదియును సుబ్రహ్మణ్య స్వామీ ఆలయంలో ఇచ్చిన మంచి ఫలితము ఇస్తుంది.
    • ఎడమ చేతి ఉంగరం వేలికి వెండిలో పొదిగిన పగడపు ఉంగరము ధరించాలి.సుబ్రహ్మణ్య ఆలయాలు స్తుతి, అష్టకాలు నిరంతరం చేయాలి.
    • ప్రతి రోజు సుబ్రహ్మణ్య, దుర్గ, గణపతి స్తోత్రాలు చేయచ్చు.
    • పిల్లలు లేని దంపతులు ఏడు ఆదివారాలు డెభై ప్రదక్షిణాలు చొప్పున చేయాలి.
    • షష్టి, సుబ్రహ్మణ్య షష్టి, కృత్రిక నక్షత్రం వచ్చిన రోజున ఏడు మంగలవారాలు ఆవు పాలతో అభిషేఖం చేయాలి.
    • కుజ దోషం పరిహారార్థం బలరామ ప్రతిష్టిత పంచలింగాల క్షేత్ర దర్శనం (నాగావళి నదీ తీరంనండు)
    • కుజ కవచం, మంత్రం, స్తోత్రం, అష్టకం, అష్టోత్తరం,కుజ మంగలాష్టకం మొదలైనవి చేయాలి.
    • రామాయణంలో కుజ దశ అంతర్దశ లకు పారాయణ ఘట్టాలు చెప్పబడినాయి.,
    •  
    • కుజదోషము నివారించుటకు రామాయణములో చేయదగు పారాయణ క్రమములు:
    • కుజదశలో కుజుని  అంతర్దశకు....ఉత్తరకాండ   ఇరవై ఆరవ సర్గ పారాయణ, కందిపపు పొంగలి, బెల్లం నైవేద్యము.
    • కుజ దశలో రాహు అంతర్దశకు -- యుధకాండ   యాభై ఎనిమిదవసర్గ,   తేనే న ఎండుద్రాక్ష నైవేద్యము.
    • కుజ దశలో కేతు అంతర్దశకు--     యుధకాండ   నూట పదహారు సర్గ ,   ఖర్జూరం, కొబ్బరికాయ నైవేద్యము
    • కుజ దశలో శని అంతర్దశకు --      అరణ్యకాండ   డెభై వ సర్గ --             నేరేడు, నల్లద్రాక్ష నైవేద్యము.
    • కుజుదశలో బుధ అంతర్దశ ---        బాలకాండ పదహారవసర్గ   --           ఆకుపచ్చ ద్రాక్ష, తాంబూలం.
    • కుజు దశలో గురు అంతర్దశ --        సుందర కాండ యాభై ఒకటి సర్గ---     అరటిపండ్లు నైవేద్యము.
    • కుజ దశలో శుక్ర అంతర్దశకు ---      సుందరాకాండ యాబై మూడు సర్గ --   పాతిక బెల్లం, కారెట్.నైవేద్యం
    • .
    • కుజ దశలో రవి అంతర్దశకు ---       బాలకాండ ఇరై మూడు సర్గ --           చామ కారెట్ దుంప నైవేద్యము.
    • కుజదశలో రవి అంతర్దశకు ---        బాలకాండ పదిహేడవ సర్గ--              పాలు, పాయేసం నైవేద్యము
    • కుజ గ్రహ దోషానికి మామూలు పరిహారములు:
    • సింధూర వర్ణ ఆంజనేయ స్వామికి ఏడు మంగళ వారములు ప్రదక్షిణాలు చేయాలి
    • ఎర్రని పుష్పాలు మాల సుబ్రహ్మణ్య, ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి అలంకరించాలి.
    • బెల్లం కలిపిన యెర్రని కందిపప్పు గోవుకు తినిపించాలి.
    • మంగళవారము రోజున ఎర్రని కుక్కకు ఆహారం వేయాలి.
    • స్త్రీలు ఏడు మంగలవారాలు ఏడుగురు ముతైదువులకు ఎర్రని పూలు , ఎర్ర జాకెట్, ఎర్ర గాజులు, ఎర్ర కుంకుమ, దానం చేయాలి.
    • ఎర్ర చందనం, కందులు, ఎర్ర మేక, దానిమ్మ పండ్లు ఎర్రవస్త్రాలలో కట్టి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో వీలు అయితే, లేదా ఇన్న్తి వద్ద అయిన సరే దానం ఇవ్వాలి.
    • కోతులకు తీపి పదార్థములు తినిపించాలి.
    • రాగి పాత్రలో నీరు తాగటం, రాగి పాత్రలు వాడటం మంచిది.
    • పోట్లకాయలు తరగటం, మంచిది కాదు.
    • రక్త దానము చేయుట చాల మంచిది.
    • అమ్మవారికి (దుర్గ) ఎర్ర చీర సమర్పించటం, నవగ్రహ గుడిలో కుజ విగ్రహం వద్ద ఎర్రపులతో పూజ పగడ దానం, ఎర్రరవికలగుడ్డ దానం మంచిది.
    • కుజుని అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉంది, కండి పప్పుతో చేసిన పదార్ధాలు తినాలి.
    • రాగిపళ్ళెంలో కందులు, కందిపప్పు పోసి దక్షిణ తామ్బులంతో మంగళవారం మధ్యాహ్నం ఒక యువకుడికి దానం చేయాలి.
    • కుజగ్రం వల్ల కలిగే రోగములకు ఎర్రటి కుండలో అన్నం వండి, ఎర్రవస్త్రంలో మూట కట్టి, దాని మీద దీపం వెలిగించి రోగికి దిష్టి తీసి కుక్కలకు అన్నం పెట్టుట ద్వార నయం అవుతుంది. కాని డాక్టర్ దగ్గర మందులు మానేయ కూడదు.
    • కుజుడు అన్నదమ్ములకు కారకుడుగా చెప్తారు, మూడవ ఇంట్లో ఉంటె ఎన్నో చిక్కులు వస్తాయి. ఏనుగు దంతం వస్తువు ఇంట్లో దక్షిణం పక్క ఉంచి కుజుని ఆరాధించాలి.
    • ఏడు, ఎనిమిది స్థానాలలో కుజుడు ఉంటె డబ్బు ఉన్న సుఖము ఉండదు, అందుకని ఏడు మంగళ వారాలు సిరా స్నానం చేసి దక్షిణ దిశలో మూడు వాతుల దీపం వెలిగించి సాయంకాలాలు కుజ స్తోత్రము, సుబ్రహ్మణ్య పారాయణం చేయాలి, ఉపవాసం ఉండి కందిపప్పుతో తాయారు చేసిన ఆహారము తీసుకుంటే భార్య భర్తలు గూడా సంతోషంగా ఉంటారు, సమయాని డబ్బు అందుతుంది.
    • కుజుని వలన స్వర పేటికకు సంబంధించిన వ్యాధులు వ్దస్తే మంగళ వారం, క్రుత్హిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించి గంట, దీప దానము చేసిన సమస్య తొలగును.
    • వివిధ భావాలలో కుజదోషం ఉంటె తీసుకోవలసిన జాగ్రతలు:
    • భావము:  వీరు అబద్ధములు ఆడకూడదు, దంతముతో చేసిన వస్తువులు ఇంటిలో ఉంచరాదు, ఏ వస్తువైనా దానం teesukoraadu
    • భావము:  వీరు ఆర్థిక బాధలతో బాధలు పడుతుంటే (కుజుడు బలహీనుడు అయితే) ఒక ఎర్రరుమాలు జేబులో ఉంచు కోవాలి, ఆరు మంగళ వారాల పాటు చిన్నపిల్లలకు బెల్లము, గోధుమతో  చేసిన తీపి పదార్థములు తినిపించాలి.
    • భావము:  వీరు ప్రయాణాలలో జాగ్రతలు పడాలి, పొరుగు వారితో గొడవలు పెట్టుకోరాదు, వెండి ఉంగరంలో పగడం వేసి ఎడమ చేతికి ధరించాలి.
    • భావము: వీరు పంచదార, తీపి వ్యాపారము చేయాలి, కోతులకు, సాధువులకు, తల్లిగారికి భోజనములు పెట్టాలి.
    • భావము:  వీరు రాగి చెంబులో నీరు పోసి నిద్రిచే ముందు తల వైపు పెట్టుకుని, ఉదయమే అనీరు పచ్చని చెట్టులో పోయాలివేప చెట్టు దక్షిణం వైపు నాటాలి..
    • భావము:  అంగారక మంత్రము జపించాలి, ఇందుప వస్తువులు ఇంట్లో పెట్టుకో కూడదు, పడిన వస్తువులు ఇంట్లో ఉంచరాదు.
    • భావము:  మరదలు, పిన్ని, అక్క, చెల్లెలు, అత్తా వీరిని గౌరవించాలి, తీపి తినిపిస్తూ ఉండాలి, వారిచే తిట్టించుకో కూడదు.
    • భావము:  నాలుగు, ఆరు భావాల్లోని రేమేడీలు చేసుకోవాలి, విధవ స్త్రీల ఆశీర్వాదం తీసుకోవాలి.
    • భావము:  కుడిచేతి ఉంగరం వేలికి వెండి పగడపు ఉంగరము ధరించాలి, వదినగారిని గౌరవించాలి, ఎర్రగుడ్డ జేబునండు పెట్టుకోవాలి, అన్నగారు చెప్పినవి చేయాలి.
    • భావము: ఆఫీసులో కాని, వ్యాపార స్థలమునందు కాని సుబ్రహ్మణ్య స్వామీ ఫోటో తగిలించండి, పగడము ఉంచండి, పాలు పొంగి పొయ్యిలో పదనీకండి.
    • భావము:  చిన్న మట్టి పాత్రలో తెనేకాని, సిన్దురంకాని వేసి ఉంచండి
    • భావము: ఉదయము పరగడుపున తేనే తాగండి, సుబ్రహ్మణ్య స్వామీ ఫొటోకు ధూప, దీప, నైవేద్యములు సమర్పించండి.
    • -- ఇవి అన్ని రోజులు పాటించవలసిన నియమములు

    0 వ్యాఖ్యలు:

    Post a Comment