Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చరిత్ర

  • December 31, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • లేబుళ్లు:

  • శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చరిత్ర
    శ్రీవల్లీ, దేవశేన, సహిత
    శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చరిత్ర

    మోపిదేవి
    'వ్యాఘ్రస్య పూర్వ దిగ్భాగే కుమార క్షేత్ర ముత్తమం '
    'సుబ్రహ్మన్యోవ సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదః '
    అని స్కాంద పురాణములోని సహ్యాద్రి ఖండమున కృష్ణానదీ మహాత్మ్యము తత్తీరస్థ క్షేత్రములు నిరూపించు వరుసలో పేర్కొనబడినది. ఈ విషయము సూచించిన వారు అగస్థ్య మహర్షి. ఆ మహర్షి అవిముక్త క్షేత్రమగు ఉత్తరకాశి యందు గాడ తపోనిష్టాగరిష్ఠుడై యున్నారు. ఆ ప్రదేశము నేటికిని 'అగస్థ్యకాశి' అనియే వ్యవహరింపబడుచున్నది. ఆ తపోధనుడు లోక క్షేమమున కైయీవలకు రావలసి వచ్చినది. ఆ హేతువు ముందొకించుక వచించుట ధర్మమగును. మున్నొకప్పుడు వింధ్యగిరి పర్వతము తామసంతో విజ్రుంభించి సూర్య మండలమును దాటి నిలచినది. అందుచే సూర్యగతి ఆగిపోయి ప్రకృతి స్తంభించినది. గ్రహ సంచారము నిల్చిపోయినది. ప్రజలు పీడితులైనారు. భూమి చలించినది. ఈ విప్లవము చూచి వేల్పులును గడగడలారిరి. ఈ ప్రమాదమును బాపుటకై బ్రహ్మాదులు తరలివచ్చి కాశికానగరు చేరి అగస్త్యుని మ్రోల నిలిచి ప్రార్ధించి విషయములు తెలుపుతారు. దైన్యం ప్రకటించారు. బ్రతిమాలు కొనినారు. అమరుల అభ్యర్ధనలను ఆలకించిన మహర్షి వారణాశిని విడుచుటకు సంధిగ్దులైనారు. యోగ దృష్టితో సర్వము తికకించితుదకు తోక శ్రేయస్సు ముఖ్యమని తలంచి నిర్ణయము తీసుకొనినారు. ఆ పవిత్ర స్థలము వీడితే కల్పాంతమైనను తిరిగి కాశీపురం చేరుట పడదని తెలుసు. అయినను అమర కార్యము తప్పదు. తన మనో దర్పణంలో విశాలాక్షి, విశ్వేశ్వరుల మూర్తులు నిల్పుకొని లోపాముద్రా ద్వితీయుడై అచట నుండి ప్రయాణము సాగించినారు. త్రోవలో నుండి వింధ్య పర్వతం ద్రోణజుని రాక నెరింగి సాష్టాంగ పడినట్లు పరుండి త్రోవనిచ్చాడు వింధ్యుడు. అది ఎరింగి నేను తిరిగి వచ్చువరకు ఇట్లే వుండమని శాసించాడు తపస్వి తానీ కల్పంలో వచ్చేది లేదు. వింధ్యుడు పైకి లేచేది లేదు.  

    తదుపరి లోపాముద్రయు తానును పయనమై దక్షిణ దిశగా ప్రయానించుచూ కనుపించిన నదీజలములలో స్నానమాచరించుచు కొన్ని నాళ్ళు అందు తపించు హృదయ బింబితులైన విశ్వేశ్వరుల నందందు నిల్పి ఆరాధింపుచూ పయనించిరి నారా తాపస దంపతులు. ఎప్పుడు ఎక్కడ ఏరీతిగా తన్నాముని స్మరించినాడో తానా తావుల లింగ రూపుడై నిలిచినాడు. ఈ పుడిది నేటికి నేనాటికి చెరగని ప్రఖ్యాతితో జగరారాధ్యులైనారు. పార్వతీ పరమేశ్వరులు అవియే దివ్య క్షేత్రములు, పుణ్య తీర్ధములు. విన్నను,  కన్నను, పున్నెంబనెడి నెన్నిక వాసి నున్నవి.
    సుబ్రహ్మణ్య శబ్ద నిరుక్తి :
    సుబ్రహ్మణ్యుడిందు నివసింపుచుండుననిన మాటకు కుమార క్షేత్రమునకు పొంతన విషయం మాండవ్యునకు సందేహం కలిగి గురువుతో అది వ్యక్త మొనర్చినాడు. అపుడు లోపాముద్రాధిపతి శిష్యులతో విశదీకరించినాడు. మాండవ్యా! నీ సందేహము సరియైనదే సుమా! ఈ ప్రదేశము సుబ్రహ్మణ్యక్షేత్రమనిపించు కొనవలె. కాని యట్లు ప్రతీతి కొనలేదు కారణం సాక్షాత్తు పరమేశ్వర నిర్దేశిత మనుకొనుడు. కుమారమూర్తి కే సుబ్రహ్మణ్యమనెడి పేరు. ఇర్వురు వేరు కాదు.    

    శృతి ' నమో జ్యేష్టాయ చ కనిష్టాయ చ ' అనుచు ఏ వస్తువును బేర్కొన్నదో  యది బ్రహ్మము. నిర్గుణము, నిర్వికారము, నిరామయము, అపర బ్రహ్మము. కారణాంతరమున లోకోపరార్ధం గిరిజాగిరీశులకు నౌరసత్వం జెంది కుమార మూర్తిగ విరాజిల్లినది. పురాణ దంపతులను శివులామూర్తి ని విడలేని అనుబందముతో వామాంకమున నిల్పుకొనినారు. ఒకపరి చతుర్ముఖుడు వెలికొండగు చేరినాడు. ఆ సమయములో భవుడు కనులు మూసి ధ్యానస్థితిలో నున్నాడు. నాలుగు ముఖములు గల యా విధాతనుగని ముక్కంటి పట్టి బాలకన్యాయంగా 'కస్త్వం! " నీ వెవరివి అనినాడు నలువ ' అహం బ్రహ్మ' అని సమాధానము ఇచ్చినాడు. వెంటనే యా కొమరుసామి నవ్వుచు ఏమి? బ్రహ్మ నిర్గుణము. రూపులేదు నీవు రూపముతో తిలకింపబడుచుంటివి. బ్రహ్మ అక్షరుడు. నీ రూపము నశించును బ్రహ్మము నిశ్చలము. నీవు చలించుచుంటివి నీవా శబ్దమునకు తగినవని వాదించినాడు. వాణీపతియే మనుటకు శక్తి చాలమితూష్ణీంభూతుడైనాడు. ఆ స్థితిలో శంకరుడు బాహ్యద్రుష్ణుడై 'సుష్టు బ్రహ్మణ్య ' యనుట జర్గింది. నలువ తలు వాల్చినాడు. కుమారుడు తండ్రికి సాగిలినాడు. శూలి సుబ్రహ్మణ్య పదము నీకు జగాద్విశదమౌ గాత' అని దీవించినాడు. ఆభావుని నుడి యౌట సుబ్రహ్మణ్య శబ్దము సుస్థిరమై కుమార పదము నామాంతరమైనది.

    సుబ్రహ్మణ్య మహిమ:
    మాండ్యవుడు ఈ స్థలమున చూపబడిన ప్రకృతి వైరుధ్యములను మరి యంతటి శ్రీస్వామినాథునకు ఫణి రూపముతో నుండు కారణము కలశభవుని ప్రశ్నించినాడు. అపుడా మహామహుడు దివ్యదృష్టితో అంతయు తిలకించి యంతే వాసులతో పలికినాడు. నాయనలారా! కారణము లేకుండా కార్య మెప్పుడు ఉండదు. అది భగవంతుని పరమైనచో లోక క్షేమమున కేర్పడును, అది వినుడు. సనక సనందన, సనత్కుమార, సనత్సుజాతులనెడి దేవర్షులు సర్వదా అయిదేండ్ల ప్రాయులవలె నుంటారు. పైగా దిగంబరులు నిరంతరము వారి మనస్సులు హర్నిశము. భగవదవలోకనానంద నిమగ్నమై యుంటాయి. అట్టిడు లొక్కమారు కైలాసానికి వచ్చినారు. చతుర్ముఖుని తొలుతటి సృష్టియానల్వురే. సరియే అది యప్రస్తుతము. ప్రస్తుతమాలకింపుడు. వారు వెలి కొండకువచ్చు వేళ ముక్కంటి లేడు. లోకమాత యగు పార్వతియు, కుమార స్వామి యున్నారు. ప్రశాంత స్వభావులైన జడదారులను వారి యాకారాలు కుమారునకు వింత గొల్పుటచే తదేక దృష్టితో వారి వంక చూస్తుండినాడు. అదే నేడు శచి, స్వాహా మొదలగు వేల్పు పడుచులు. లక్ష్మీ, సరస్వతులు, గిరిజా దర్శనానికి వచ్చుట తటస్థ పడినది.ఆ స్త్రీలు వింత వింతల ఆభరణములు రంగు రంగుల చీరలు ధరించినారు. ఒకొక్కని రూపు ఒకొక్క టీరుగా కన్పించినది. గౌరి బిడ్డకు అటు జడదారులు, ఇటు సుందరీమణులు, ఈ ప్రకృతిని చూచి ఫక్కున నవ్వినాడు?. 'శివకుమారుడు' ఆ నగవు విని భావాన్ని కుమారా ఏల నవ్వుదువు? వారు నేనుగా కనుపింప కున్నారో : ఆ తాపసులు మీ తండ్రి వలె లేరా: భేదమేమైనా కనపడద్దా అన్నది. ఆ మాత్రు వాక్కు విని లోలోన కించ నొందినాడు. జగన్మాతకు నమస్కరించి ఎవరి త్రోవన వారు వెళ్ళినారు. ఈ నవ్వినా వైనం పార్వతి మాటలు వారికి తెలియవు కాని మాత్రుపాదాలు బట్టి స్కందుడు తెలియక చేసిన పాపము పామమే గదా! తత్పరిహారార్ధమై తపస్సు సల్పుడు అనుమతి ప్రసాదించమని వేడుకొన్నాడు. ఆపై కాదన్నను పట్టు విడవక తపస్సుకు తరలినాడు తన రూపము పరులు కానుకుండా నుండుటకై యురగ రూపముతో నిందనాకువు నేర్పరుచుకొని తపిస్తున్నాడు. ఒకే పుట్ట యున్నచో నెవరికైనా సందేహం వచ్చునని ఈ తావంతయు కోవలతో నింపినాడు. ఆ మహామహుని ప్రభావ గరిమచే సహజవైరములు గల జంతువులు సహితము చెలిమితో సమాన భావముతో ఉన్నాయి. కుమారుని రక్షణము ప్రేమాబంధము వీడలేక అవతరించినాడా? మహేశుడనునట్లు ఈశ్వరుడు సకలేశ్వరాభిదముతో ఇందు ఉద్భవించినాడు. అందుకే అది స్వాయంభువలింగ మగునను కొన్న తప్పుకాదు: ' భవనత్ప్రతిపత్తి 'ఏక క్రియాద్రుర్ద కరీ భవేత్ అన్నట్లుంటుంది. ఇక్కడ బాహులేయునకు శాప విమోచనము నింబత్తి మాత్రము భక్త రక్షణము ముఖ్యమైనది. ఇది పార్వతిపాప పాపయగు తేరగు. ఇక దృశ్య సాదృశ్యం వినుడు. భగవంతుడు తన వైనం పరోక్షంగా ప్రజలకు తెలుపుచు నుంటాడు. నెమలి ఈక ఎట్లుండును? రంగు రంగులుగా చూడముచ్చటగా నుండును గదా ఎగయు స్వభావము కూడా నున్నది. ప్రకృతి రూపు చిత్ర విచిత్రమై యుండును. గంతులు వేయుట కూడా సహజము. స్వేచ్చా మనము ప్రకృతికి సాగనిచ్చినచో ప్రజలు ప్రళయములే చూతురు. దానిని బంధించినచో కట్టుబాటులో నుంటుంది. కాబట్టి తానూ బ్రహ్మవస్తువు కాన ప్రకృతి తన కైవసమై యుండును. అనెడి భావం మనకు వ్యక్త మొనర్చుట యాద్రుశ్య సాదృశ్యం. ఫణి కుండలముపై నిలబడుతున్నదే యది ప్రకృతికి తానాయె ఆధారమని తెలుపుటయే--- సకల జీవరాసులలో కుండలినీ శక్తి యొకటుంటుంది. అది పాముచుట్ట నొప్పియపాన స్థానము నుండి షట్చక్రముల కాధారముగా నుండును. ఆ కుండిలినియే బ్రహ్మమనుట తధారము మీద చక్ర స్వరూపిణి యైన శక్తి ప్రకృతి యున్నదనుట లోకమున కెరుక పరుచుటయే మయూరి పాముచుట్ట పై యున్న విధము. ఇంకొక్క తావున నేమలిమీద నున్న పామును జూచితియే ! యది ప్రకృతి పురుష సంయోగానుబంధ జన్యమీజగత్తు -- శక్తి పురుషులలోని యవినాభావమును నిరూపించుటయే  యందలి పరమార్ధం. ముంగులు, పాములు మూచూచుట యున్నదే అది విముక్తి నందించు ముఖ్య సోపానమైన సమానతా సౌజన్యమునకు ప్రతీక అంతటి శక్తిమంతులకు కలుగవచ్చును. కాని భగవానుని ప్రవర్తన ఎప్పుడు ధర్మా ధర్మంగా నుంటుంది. అందుకే 'యద్యదాచ రీతి శ్రేష్ఠః తత్త దేవే తరోజనః 'అనుట కలదు. తానొనర్చిన పనులు ప్రపంచమునకు సమాచారణీయములు కాగలవు -- కాన తానూ తపించుట యాచరించి మనకు చూపించి యాధర్ముడు భావ్యారాధ్యుడైనాడు.సుబ్రహ్మణ్యుడు సర్పమైయున్న తెరుగు తెల్పితివి. కుమార క్షేత్రమనుట వినిచితి. ఈ క్షేత్రమునంటి కృష్ణానది ప్రవహించు చున్నది కాబట్టి అత్రస్నానంతు కుర్యాచ్చేత్కోటి జన్మాఖ నాశనమ్ : అనెడి నానుడి వచ్చింది. ఆ మహాతేజస్సు వచ్చెడి కొనయే యాస్వామినాధుడు వసించుతావు. మన పూర్వజన్మ సుకృతమున నీ తలమునకు వచ్చితిమి. ఈ విషయమెరిగెడి భాగ్యం లభించింది. అనుచు సతీయుతుడై అగస్త్యముని సాష్టాంగ పడినాడు. శిష్యులు సైతం ప్రణామములిచ్చినారు. తదుపరి ప్రజాపాళిని తరింపచేయ తలచి సామాన్యులను గూడ అర్చించు భాగ్యం కల్పింపనెంచి పడగవలె నున్న లింగమెందు ప్రతిష్టించి యావల్మీక మాకల్పమొనర్చి వందితుడైనాడు. అందుకే 'మార్గదర్శి మహర్షి' అన్నారు పెద్దలు.   
    అగస్త్యుడంతటి తపస్విచే నిరూపింపబడినది. కావుననే ఈ ప్రదేశము కుమార క్షేత్రముగా ప్రతీతి చెందినది. ఆ కాలంలో మహర్షులెందరో ఈ మూర్తి నారాదించి యుందురనుట నిర్వివాదము. ఈ విషయమేనాటిదో యేయుగమో అప్పటి ఈ ప్రదేశ మేరూపు నున్నదో యవర్ణ్యము. కృష్ణాది మాత్రమిందు కలదనుట: పూర్వికులెరింగినది వినిచినది కూడనగును. కుమారుడనగా చిన్నవాడు ఆయన రూపమెప్పుడు పంచవర్ష ప్రాయము. అట్టి సుబ్రహ్మణ్యమూర్తి వసించుటచే కుమార క్షేత్ర మైనది.

    గ్రామ నిరూపణ:
    కాలచక్ర భ్రమణములో వల్మీకములన్నియు నమ్తరించి గ్రామము ఏర్పడినవి. ఈ గ్రామమునకు మున్ను 'మోహినీ పుర' మానబడేడి దను పెద్దలందురు. అదియు నిజమై ఉండవచ్చు. 'మహాయతీతి మోహినీ, మోహింపచేయునది మోహిని ' యనబడు గదా! భక్తి భావమును కలిగించి దూరపువారిని కూడా నాకర్షించి దరికి రప్పించుకొనునది. రప్పించు కొనుచున్నది.  అందువల్ల మోహినీ పురమనెడి నుడి సత్యమే యగును. ఎన్ని తావుల నెన్నూళ్ళకు పేర్లు మారలేదు ---- అట్లే నేటికి 'మోపిదేవి' గా ఖ్యాతిల్లినది.

    సుబ్రహ్మణ్య సేవా ఫలములు----
    1 . సంతతి లేనివారికి సంతతి నొసంగుట
    2 . నేత్ర దృష్టి లోపించిన చూపు నొసంగుట
    3 . చెవులలో పోటు కలిగి చీము కారినచో తద్భాద నివారించుట
    4 . స్త్రీలకు దుర్భలత్వమున వచ్చు కుసుమ వ్యాధులునాపుట  
    5 . శరీరమున  చర్మము పైపోడలు, పుట్టి యరోచకమైనచో బాగొనర్చుట6 . ప్రాక్తన కర్మ జన్యమగు పాపమున సంతతి నశించుచున్న యా పాప మడంచుట
    7 . విద్యాభివృద్ధి చేయుట
    8 . సిరి సంపదలు ఇచ్చుట
    9 . శరీర ఆరోగ్యము మేలు కూర్చుట
    10 . మనోవ్యధ సైతము రూపుమాపుట, సంసారం ఎడబాటు తొలగించుట.
    ఇట్టివి ముఖ్యములు. నివారించి భక్త కల్పకమైన మహిమా సుగంధమును నలుమూలల వ్యాపింపచేసి వాడల నున్న జనులను చెంతకు రప్పించుకొనుచున్నాడీ స్వామినాథుడు. ఆ మూర్తికి నిలయమైన ఈ పుణ్యభూమి ఎంతోకాలముగా యశము నార్జించుకొన్నది. తానూ చిలువగా కన్పట్టినను ప్రశాంతుడై భక్తులకు కలుగు సర్వోపద్రవములు పోగొట్టుచున్నాడు. ఇట్టి మహిమలెన్నియో చరిత్ర సంబంధములైనవి. నవతరమున కివి చారిత్రకములు. కేవల కల్పితములుగా కన్పించు 'ఆస్తి': లేనిది 'నాస్తి'  యనుట సంభవింపదు. ఆస్తి నాస్తులలోని నిజము నెరుగుట వారి వారి మనోగతిని బట్టి నమ్మక మేర్పడును. ఈ మైనను ఇతః పూర్వికులొందిన అనుభవములు  చాలా కలవు కొన్ని నిరూపించినచో నమ్మకమున్నవారు సత్ఫలగులగుదురు.

    ఆలయం ఏర్పడిన తీరు
    ఈనాడు మన కంటికి ఆనందము కల్గించు చున్న ఆలయము నాలుగైదు వందల యేండ్ల క్రిందట లేదందురు. పుట్టలతో నిండి యున్నదట. ఇపుడు ఉన్న లింగము కూడా వాల్మీక గర్భములోనే యున్నదట. ఈ దారిని కూలాలులు నివశించెడి వారుట. ఆ కుమ్మరి వారిలో 'వీరారపు పర్వతాలు అనెడి వాడు ఉండెడి వాడు. అతడ చంచల భక్తుడు స్వామినాథుని నమ్ముకొని జీవనము నెరపుకొనుచు ఉండెనట అతని హృదయ నైర్మల్యమునకు శరజన్ముడు అనుగ్రహించి యొక్కట స్వప్నంలో కనుబడి తానిందునెలవైనది. తన లింగమున్న పుట్టను చూపించి ఆలయ మేర్పరచి యాపుట్టనుండి   లింగమును వెలిగి తీసి ప్రతిష్ట గావింపుమని ఆదేశించి యంతర్ది అయ్యెనట తదుపరి పర్వతాలు నలువురికిని తను కన్న కల వినిచి స్వప్నంలో చూచినా పుట్టాను త్రవించి లింగము వెలికి తీసి యా పుట్టపైన స్థాపించినాడట కొంతకాలము తోచినట్లు నమ్మికోలిచిన వారు నమ్మికతో స్వధర్మం విడువక జీవిక నెరపుకొన్నాడు. అతడు దైవ ప్రసాద లబ్ద మగు విద్యనూ దైవమున కంకిత మొనర్పనెంచి మట్టితో సుబ్రహ్మణ్య ప్రీతికరమగు వస్తువులొనర్చి కాల్చి అవి ఏ మాత్రము చెడకుండా స్వామివారికి ఆలయంలో ఉంచినాడు. వాడు అర్పించిన విగ్రహాలు గుఱ్ఱము, నంది, కోడి, గరుత్మంతుడు, మహాతపస్వుల విగ్రహాలు. ఆ బొమ్మలు చూచినచ్ సామాన్యులకు అలవికాని పనియని మనమే ఊహింతుము. ఒకవేళ పనియందు నేర్పు మిక్కుటముగా నున్న వారుండవచ్చు మట్టి బొమ్మలు చేసి కాలుపు పెట్టవచ్చు కాని కాల్చినవి యథాతథంగా కనిపించుట కల్ల ఏనాటి పర్వతాలు ఎన్నేండ్లు అయినదో అతడు బొమ్మలొనర్చి చెక్కు చెదరక ఇప్పటికి వున్నవి.
    ఈ మధ్య గుడి ముఖమంటపం పడగొట్టి బాగుచేసినప్పుడు మహర్షులు బొమ్మలు పగిలిపోయినవి. (కోడి) కుక్కుటము, నెమలియు తలలు పోవుటచే ప్రక్కకు తొలగించిరి. ఆలయం బాగుచేత సుమారు ముప్పైఅయిదేండ్ల క్రిందట జరిగింది.ఆ పర్వతాలు నేర్పుకు భక్తికి ప్రతీకగా ఇపుడు గుఱ్ఱము, నందియు, గణపతి, గరుత్మంతుడు నేటికిని నిల్చినవి వాటి యెడలందు సర్వప్రకృతి చిత్రణము నగుపించు కాల్పులో కూడా చిత్రణ మార్పురాలేదు. అది దైవానుగ్రహము గాక మరేమగును. ఏ విధముగా సుబ్రహ్మణ్యుడు తన కృపను ఫణమొనర్చి యాలయ మేర్పరచుకొన్నాడు. సుబ్రహ్మణ్యార్పణకు సంకల్పించి తయారొనర్చిన యా బొమ్మలు కుమ్మరి కాల్చినాడు గాన వంకర తిమకరులు రాలేదనిన తప్పుకాదు. దానకారణం 'అగ్నిభూ:' అని యామూర్తికి పేరున్నది. కుమారుని కైవసంబగు వానిని తండ్రి తప్పొనర్చడు గదా!   

    సుబ్రహ్మణ్యుని మహిమలన్నియు వర్ణనాతీతము సుబ్రహ్మణ్యుని గరిమ చే మోపిదేవి పురోగమిస్తోంది. ఈ క్షేత్రములో ఆలయమును సందర్శించి శ్రీస్వామివారికి మ్రొక్కుబడులు అర్పించి కోర్కెలు సడసి యానందించు వారెందరో కలరు. నమ్మికతో తన దరికి వచ్చిన వారిని కరుణించి కాపాడి చల్లని కరుణామృతము వర్షించి ఈ హరసుతుడు పరిజనులకు పొరుగువారిపై సైతము పెరటిలో నున్న హరిచందనమై కీర్తిల్లినాడు. మోపిదేవి చిన్నపల్లెటూరు మాత్రము అయినను శ్రీశరజన్మునిదయ చేత వాడవాడలా పదిగురినోట విస్తరించింది. ఎక్కడెక్కడి వారలో వచ్చి మ్రొక్కులు తీర్చుకొనుట పరిపాటి అయినది. శ్రీ స్వామివారి మహిమలు వినుటయేగాక స్వానుభవమును కూడా తోడై దేవరకోట ఎస్టేట్ చల్లపల్లి నుండి శ్రీమత్ రాజావారి వంశీయులు వచ్చి పౌరుల సంప్రదింపులతో నీ ఆలయమును తమ యాజమాన్యమునకు తీసుకొనినారు. వారికి ఈ మూర్తి యిలవేల్పయి బ్రహ్మొత్సవములు సైతము మహావైభవో పేతముగా రాజలాంచనములతో షుమారు రెండువందలయేండ్ల నుండి జరిపించుకొనుట సర్వజన విదితము.

    శ్రీ సుబ్రహ్మణ్య పూజ
    ఓం ఆచమ్య,  "ఓం కేశవాయ స్వాహా" "ఓం నారాయణాయ స్వాహా"  "ఓం మాధవాయ స్వాహా"  "ఓం గోవిందాయ నమః" "విష్ణవే నమః" " ఓం మధుసూదనాయ నమః "  "ఓం త్రివిక్రమాయ నమః " " ఓం వామనాయ నమః " " ఓం శ్రీధరాయ నమః "  ఓం హృషీ కేశాయ నమః  ఓం పద్మనాభాయ నమః  ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః  ఓం వాసుదేవాయ నమః  ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్దాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః  ఓం నార సింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్ధనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః

    మమోపాత్త ...... శుభే ....... శుభతిథౌ, శ్రీమాన్ ..... గోత్ర : నామదేయః శ్రీమతః ............ గోత్రస్య నామధేయస్య మమ సర్వాపమృత్యు పరిహారార్ధం సర్వదోషనివారణార్ధం మనోవాంచాఫల సిద్ద్యర్ధం ధర్మార్ధ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధసిద్ద్యర్ధం చ ఇహ జన్మని జన్మాంత రేషు కృత పీడాపరిహారార్ధం పుత్రా పౌత్రాభి వృద్ద్యర్ధం శ్రీవల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర దేవతా ముద్దిశ్య ...... ప్రీత్యర్ధం యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే త్దంగా కలశారాధనం కరిష్యే కలశం గంధ పుష్పాక్షతై రభ్యర్చ్య కలశస్యముఖే విష్ణు: కంటే రుద్రా స్సమాశ్రితః ! మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్రు గణాస్మ్రుతా: ! కుక్షౌతు సాగరా స్సర్వే సప్త ద్వీపావ సుంధరాః రుగ్వేదో యజుర్వేదో స్సామవేదో హ్యధర్మణః ! అంగైశ్చ సహితాసర్వే కలశాంబు సమాశ్రితాః గంగైచ యమునేచైవ కృష్ణే , గోదావరి , సరస్వతి , నర్మదా సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధం కురు ఆయాంతు శ్రీవల్లీ..... దేవతా కలశ పూజార్ధం దురితక్షయ  కారకాః కలశోదకేన ఓం దేవం సంప్రోక్ష్య (కలశ మందలి ఉదకమును దేవునిపై చల్లాలి ), ఓం ఆత్మానం సంప్రోక్ష్య అని (ఆ నీటిని తనపై చల్లుకోవాలి ) ఓం పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య  (పూజా ద్రవ్యములపై కూడా చల్లాలి ).

    ధ్యానమ్:
    పార్వతీ హృదయాంభోజ చిత్ర భానో మహాతనో
    బ్రహ్మణ్య! బ్రహ్మవిద్గణ్య ! సుబ్రహ్మణ్య సురప్రభో
    ప్రారబ్ద వార సంహార షాన్మాతుర శివంకర
    నమః శ్శరవణో ద్భూత ధ్యాయేత్వాం సతతం హృది
    శ్రీవల్లీ  దేవసేనా సామెత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః -- ధ్యానం సమర్పయామి

    శివాత్మజ మహాతేజః శివాంకాసన సువ్రజ
    దదామ్యావాహనం తుభ్యం భవానీ సుముఖప్రజ.
    శ్రీ వల్లీ దేవసేనా ....... ఆవాహనం సమర్పయామి

    గుహదేవ సహృద్భావా దేవ సేనా సతీధవ
    రత్నపీటం మయాదత్తం వీతిహొత్ర సముద్భవ !
    శ్రీవల్లీ .................. నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి

    వందారు జన సందోహ బృందాకర మహీరూహ
    బాలఘాస సమాయుక్తం పాద్యంశక్తి శరావహ
    శ్రీవల్లీ ............... నమః పాదయో: పాద్యం సమర్పయామిదేవాపగా సముద్భూత గీర్వాణ జనవేష్టితః
    అర్ఘ్యం కాశాగ్ర సంకీర్ణం వరముద్రా సమంచిత
    శ్రీవల్లీ............... నమః హస్తయో రర్ఘ్యం సమర్పయామి

    కృత్తికా హృదయానంద భక్తలోక సుఖప్రద
    జాతీ సుగంధ సంబంధ వారి మాచ మనందదే
    శ్రీవల్లీ................నమః మధుపర్కం సపర్పయామి

    గంగాపుత్ర  జగత్పాత్ర  హేతుమాత్ర పవిత్రభో
    స్నానం పంచామృతో దైస్చస్వామినాధ ! మహాప్రభో !
    శ్రీవల్లీ................ నమః పంచామృత స్నానం సమర్పయామి తతః శుద్దోదక స్నానం సమర్పయామి స్నానంతరం మాచమనీయం సమర్పయామి.

    శక్తిబాణ మహాసేన బర్హి యాన మహాఘన
    క్రౌంచ ధారణా వస్త్రంతే కాంచనం పూజనోదితమ్.
    శ్రీవల్లీ...... నమః వస్త్రయుగ్మం సమర్పయామి

    బ్రహ్మారాధ్య పదాంభోజ బ్రహ్మవిద్యా దురంధర
    యజ్ఞ సూత్రం శ్రుతి ప్రోక్తం బ్రాహ్మన్ బ్రహ్మవినిర్మితమ్
    శ్రీవల్లీ.......... నమః సువర్ణ దివ్య యజ్ఞోపవీతం సమర్పయామి

    వల్లీనాధ జగన్నాధ శూరా పద్మా సురోద్భిద
    చందనం శీత సౌగంధ మర్పయామి వరప్రద
    శ్రీవల్లీ...........నమః శ్రీగందాన్ ధారయామిషడానన శ్రుతిప్రాణ ప్రణతార్తి వినాశన
    నా నావల్యంత సౌరభ్యాం స్రజంభక్త్యా సమర్పయే  
    శ్రీవల్లీ ......... నమః అనేక పుష్పమాలికా సమర్పయామి

    అధాంగ పూజ
    స్కందాయ నమః పాదౌ పూజయామి
    కుమారమూర్తయే నమః గుల్ఫౌ పూజయామి
    పార్వతీసుతాయ నమః జంఘే పూజయామి
    అగ్నిగర్భాయ నమః  జానూ పూజయామి
    శిఖివాహనాయ  ఊరూ పూజయామి
    గుహాయ నమః హృదయం పూజయామి
    శరజన్మనే నమః ఉదరం పూజయామి
    సేనాధవాయ నమః బాహూన్ పూజయామి
    కార్తికేయాయ నమః కక్షౌ పూజయామి
    క్రౌంచధారణాయ కంటం పూజయామి
    షణ్ముఖాయ నమః ముఖం పూజయామి
    విశాఖాయనమః కర్ణౌ పూజయామి
    శక్తిధరాయనమః హస్తాన్ పూజయామి
    ద్విషిణ్నేత్రాయ నమః నేత్రాణి పూజయామి
    షాన్ముతురాయ నమః శిరాంసి పూజయామి
    సుబ్రహ్మణ్యాయ నమః సర్వాణ్యంగాని పూజయామి    

    ఇక్కడ అష్టోత్తరములు లేక సహస్రములు చెప్పవలెను.

    ద్విషడ్భుజ షడ్బాహొ శరజన్మన్ శివప్రద
    దూపమాఘ్రాపాయే దేవ గుగ్గులంచ పరీమళమ్
    శ్రీవల్లీ.......నమః ధూపమాఘ్రాపయామి.  వృజినద్రజ సంహార గజానన సహొదర
    గోఘ్రుతాక్తం వర్తి దీపం విశాఖాన జ్ఞానవాపకమ్
    శ్రీవల్లీ............నమః దీపం దర్శయామి

    పదార్దై ర్భహుళై ర్యుక్తం స్నాన మాపన్నరక్షక
    నివేదయే మహానంద చరనాయుధ కేతన
    శ్రీవల్లీ........నమః నైవేద్యం సమర్పయామి ఉత్తరాపోశనం సమర్పయామి.
    హస్తాన్ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి.

    సంసార వార్ధి సంతార సాధుసౌహార్ద భాసుర
    తాంబూలం ముక్త చూర్ణక్తం పూగీఫల సమన్వితమ్
    శ్రీవల్లీ........నమః తాంబూలం సమర్పయామి

    జ్ఞాన స్వరూప సందీప ప్రాజ్ఞ ప్రజ్ఞానదాయక
    నీరాజనం సకర్పూరం తారకూసుర మారక!
    శ్రీవల్లీ...... నమః కర్పూరా నంద నీరాజనం సమర్పయామి.

    వేదసార మహొదార వేదవాక్యాను గోచర
    మంత్రోక్త విధి నాతుభ్యం దక్షిణాం కుసుమాంజలిం
    శ్రీవల్లీ.......నమః మంత్రపుష్పం సమర్పయామి.

    కేకివాహ నమస్తుభ్యం నమస్తే కుక్కుట ధ్వజ
    నమోనమస్తే సేనాని పాపానివినివారాయ
    శ్రీవల్లీ.........నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

    చామరం వ్యజనం ఛత్రం నృత్త గీతం ప్రదర్శయే
    సర్వోపచార పూజాంశ్చ గృహాణ శర సంభవ
    అన్యా సుబ్రహ్మణ్యే శ్వర  దేవ స్సుప్రీతి స్సుప్రసన్నో వరదో భవతు మమ ఇష్ట  కామ్యార్ధ సిద్ధిరస్తు  ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.శ్రీ సుబ్రహ్మణ్య దండకము

    శ్రీమన్మహా దేవ పుత్రా వచోధీశ పౌత్రా, భవానీ హృదంభోజమిత్రా, పరేషాన  గోత్రా, వీతిహొత్రాంగ  నాగర్భ శుక్త్యంబు దత్యక్త సుస్వాతికార్త్యంబు మాత్రా మహాజ్ఞాన పాత్రా, పవిత్రాచ్చ గంగాజలోత్తుంగ రంగత్త  రంగానుషంగాంగ పాత్రా, పవిత్రా, విశేషాచ్చ కాశాటవీ జన్య సౌజన్య గాత్రా, సుగాత్రా, మునీంద్రాంగ నాభవ్య  వక్షోరుహస్తన్య  సంపుష్ట చిత్రా, కృపాపూర్ణ నేత్రా, సురాధీశ గోత్రారి పుత్రీ గళానంద బద్దార్హ మాంగల్య సూత్రా సుపర్వాణమిత్రా, కృతానేక పాపాతవీ జన్య దుష్పాద పొద్దాహ కృద్వీతి హోత్రా, లసత్ప్రుష్టి  పాత్రా, దురాచార వల్లీలవిత్రా, విచిత్రా శుభావాస్త వల్ల్లీ కళత్రా మహాసచ్చరిత్రా, నినున్ తెల్పగా శక్యమే? తొల్లిటన్  సర్గకాధార మై పారామి సర్వసంపూర్ణ మై  మీరి యోంకారమై వేదవాక్సారమై, మారి, దిక్పాలక వ్రాత మర్దింప, లోకాలు కాపాడు సంకల్పముం జేసి, శర్వత్రికూటంబు కూటంబు కాగా, భవానీ మనోమోదముం గూర్చి స్కందత్వమింపొంద నగ్నిన్ని నిమిత్తంబుగా నూని స్వాహాంగనా గర్భసందర్భముం  గాంచి యల్లంత మిన్నేటిలో ముద్దయై
    యెడ్డునుంబట్టి  యచ్చోటునన్ రేల్లులో పిల్లడై మించి కెవ్వంచు విన్పించి ప్రాంత ప్రయాణస్థులన్ చెంతకుంజేర్చి  కవ్వించి లే నవ్వులొల్లించి తన్నేత్ర పర్వంబు గావించి వాత్సల్యము బెంచి లీలల్ ప్రపంచించి యా పుణ్య సీమంతినీ కక్షలన్ జేరి పొత్తిళ్ళల్లో  బిడ్డడై యడ్డమై యారుమోముల్ విడంబించి తట్ స్తన్యముంగ్రోలి  యల్లారు ముద్దౌచు రాణించు నిన్నెన్న సామాన్యమెట్లౌనయా, కార్తికేయా జగన్మాతకున్ ముద్దునై దివ్య కైలాసముంజేరి టీవిన్ శివోత్సంగమన్ దగ్గేపై ముద్దులున్ బెద్దగా జూపుచున్ సుద్దులన్ గొల్పుచున్ పెర్గి ఫాలాక్షుడాచార్యుడై విద్ధియల్ నేర్ప, పాండిత్య మార్జించి శౌర్యంబు జూపించి క్రౌంచాద్రి  భేదించి శక్తీషు వుందాల్చి బృందారకుల్ వచ్చి వందారులై కొల్వ సేనాధి పత్యంబుచేబట్టి తత్తార కామర్త్య వైరిన్  తలంగొట్టి సింహాస్యక్రవ్యాదునింగూల్చి  యాశూర పద్మాసురుం జీల్చి చెండాడి వైవ స్వంతాంతః పురాతిథ్య మొందించి జేజేతులు రాబట్టి జేజేల రప్తి కంటాన మాగళ్య సూత్రంబునుంగట్టి  , వేజెట్టి వైయుంటి విట్లంచు రూపించ గా సాధ్య మెలాగయా ! బాహులేయా ! సరోజాత జాతుం 'డహం బ్రహ్మ ' నాబల్క కాదంచు వాదించి బ్రహ్మ స్వరూపంబు బోధించి మెప్పించి యానంద మొందించి యవ్వానిచె ' సుష్టు బ్రహ్మణ్యభ్యో ' యందు  బిల్పించు కొన్నట్టి బల్ మేటి వేపాటి నౌ విప్పనో పార్వతీ నందనా! కేకిరాట్స్యందనా! కల్కి మా పాపముల్ వాపగా పెక్కులౌ యిక్కలన్ కోవలన్ బోయుచున్ కాపురంబుండి డెందంబులన్ గూర్చుచున్ కౌతుకాలిచ్చుచున్ దొడ్డిలో వేల్పుగిడెన పున్యాత్మునేరే నిరూపించువారే    కుమారా, ధర న్నీనివాసంబు లెందెందునందున్న కృష్ణాసరిత్తీర మందున్న 'శ్రీ మోపిదేవి' పురంబిడ్డ యన్నింటిలో మిన్నయౌకా, విశాఖ, యిటన్నీవుచూపించు మహాత్మ్యముల్ విప్పి యెట్లుందు నో స్కందకాంతాళిలో దోషముల్ వాపగా చీ కులల్లార్పగా సంతవుల్ కూర్పగా కోరికల్ తీర్పగా నేర్పులన్ కొంటివె, బాలికా బాల సంఘాలకినీ కృపాదృష్టి దివ్యౌషద  ప్రాప్తియై కంటిలో  కాయలన్ గెంటెడిన్ వీనులన్ పోటు లన్ దూటెడిన్ మేను పై మచ్చలన్ వాపెడిన్ నెత్తిపై కుర్పులన్ గోటితో గిల్లెడిన్ నిత్యమోయన్న సుబ్బన్న, ఈ యెన్ని కంగొన్న మిన్నాగువై యిందు కన్నాకువై కీర్తి నార్జించి ఈ యూరి నన్వర్ధ  యాత్రాస్థలంబిద్ద  కైలాసరంగంబుగా  జేసి యందందు నందుడు స్త్రీ పురుషుల్ వచ్చి వె మ్రొక్కు లందించి డెందంబులున్  విచ్చి పోజేయుచున్నావు   కాదా, యభీష్టప్రదా  నీదు సార్ర్దాత్వమే  మాదు భాగ్యాప్తి  నీ వీక్షనంబే సదా రక్ష, యోస్వామినాధా, యపాస్తవ్యధా దేవ,  దేవాదిదేవా, యనంత ప్రభావ దయార్ద్ర స్వభావా , కుమారేశ దేవా, నమస్తే నమస్తే నమః


    శ్రీ శాండిల్య గోత్ర జో భమిడి పాట్య న్వర్ధ వంశోద్భవః  
    సుబ్రహ్మణ్య తనూభవో రచితవాన్ లక్ష్మీ నృశింహభిదః
    క్రుష్ణాతీరగ మోపిదేవి పురవాస శ్రీ బుదారాధకః
    సుబ్రహ్మణ్య క్రుపావిశేష కలితః పూజావిధిం దండకమ్.

    0 వ్యాఖ్యలు:

    Post a Comment