Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

svami

  • April 23, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • లేబుళ్లు:

  • నవగ్రహ స్తోత్రములు

  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • లేబుళ్లు:
  • నవగ్రహ స్తోత్రములు
    సూర్య స్తోత్రం

    జపా కుసుమ సంకాశం – కాశ్యపేయం మహాత్యుతిం
    తమోరిం సర్వ పాపగ్నం – ప్రణతోస్మి దివాకరం

    చంద్ర స్తోత్రం

    దధి శంఖ తుషారాభం – క్షీరో దార్నవ సంభవం
    నమామి శశినం సోమం – సంభోర్ మకుట భూషణం

    కుజ స్తోత్రం

    ధరణీ గర్భ సంభూతం – విద్యుత్ కాంతి సమప్రభం
    కుమారం శక్తీ హస్తంచ – మంగళం ప్రణమామ్యహం

    బుధ స్తోత్రం

    ప్రియంగు కలి కాసామ్యం – రూపేణా ప్రతిమం బుధం
    సౌమ్యం సౌమ్య గునోపెతం – త్వం భుధం ప్రణమామ్యహం

    గురు స్తోత్రం

    దేవానాంచ ఋషీనాంచ – గురుకాంచన సన్నిభం
    భుధ్ధి మంతం త్రిలోకేశం – తవం నమామి భ్రుహస్పతిం

    శుక్ర స్తోత్రం

    హిమ కుంద మ్రునాలాబం – దైత్యానాం పరమం గురుం
    సర్వ శాస్త్ర ప్రవ్రుత్తారం – భార్గవం ప్రణమామ్యహం

    శని స్తోత్రం

    నీలాంచన సమాబాసం – రావిపుత్రం యమాగ్రజం
    చాయా మార్తాండ సంభూతం – తవం నమామి శనైశ్చరం

    రాహు స్తోత్రం

    అర్ధ కాయం మహావీర్యం – చంద్రాదిత్య విమర్దనం
    సింహికాగార్బ సంభూతం – త్వం రాహుం ప్రణమామ్యహం

    కేతు స్తోత్రం

    ఫలాస పుష్ప సంకాశం – తారకాగ్రహ మస్తకం
    రౌద్రం రౌద్రాత్మకం గోరం – త్వం కేతుం ప్రణమామ్యహం

    నవగ్రహాలు

  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • లేబుళ్లు:


  • నవగ్రహాలు

    ఆదిత్యుడు :
    కశ్యపుని కుమారుడు సూర్యుడు. భార్య అదితి. అందుకేఆదిత్యుడు అని పిలుస్తాము. సప్త అశ్వాలతో ఉన్న రధం అతనివాహనం. ఆ సప్త అశ్వాలు ఏడు చక్రాలకు ప్రతీకలు.
    ( మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం,విశుద్ధ, ఆగ్య్హ్నా చక్రం , సహస్రారం )
    వివాహ పరిబంధన దోషం, పుత్ర దోషం, పుత్ర పరిబంధన దోషం,విద్యా పరిబంధన దోషం, ఉద్యోగ పరిబంధన దోషం, సూర్య దోషంమొదలైన దోషాలతో బాధ పడే వారు సూర్యుని పూజించటంవలన ఫలితం పొందుతారు.సింహరాశి కి అధిష్టాన దేవుడు సూర్యుడు. నవగ్రహాలలో మద్య స్థానం ఆదిత్యుడిది.అధిదేవత అగ్ని, ప్రత్యధి దేవత రుద్రుడు. ఆదిత్యుడు ఎరుపు వర్ణం లో ఉంటాడు.

    ఇష్టమైన ధాన్యం : గోధుమలు
    పుష్పం : తామర
    వస్త్రం : ఎర్రని రంగు గల వస్త్రం
    జాతి రాయి : కెంపు
    నైవేద్యం : గోధుమలు, రవ చక్కర పొంగలి

    చంద్రుడు :
    చాల అందమైన వాడిగా మనం వర్ణిస్తూ ఉంటాం. వర్ణనలకుకంటే మిన్నగా చంద్రుడు చాల అందమైన వాడు. పది తెల్లటిగుర్రాలతో ఉన్న రధాన్ని అధిరోహిస్తాడు. నిశాదిపతి ( రాత్రికి రాజు), క్షుపరక (రాత్రిని కాంతివంతం చేసే వాడు) అనిపేర్లు కూడా కలవు. ఇరవైఏడు నక్షత్రాలను సూచిస్తునట్టు,ఇరవైఏడు మంది భార్యలను కలిగి ఉన్నాడు. తండ్రి సోమతల్లి తారక.
    అనారోగ్యం తో బాధ పడుతూ ఉన్న తల్లి, చర్మ వ్యాధులు మొదలైన సమస్యలు కలవారుచంద్రుని పూజ వలన ఫలితం పొందగలరు.కర్కాటక రాశి కి అధిపతి చంద్రుడు. తూర్పు - దక్షిణ అభిముఖుడై ఉంటాడు.

    అధిదేవత : నీరు.
    ప్రత్యధిదేవత : గౌరి
    వర్ణం : తెలుపు
    ధాన్యం : బియ్యం / వడ్లు
    పుష్పం : తెల్లని తామర
    వస్త్రం : తెల్లని వస్త్రం
    జాతి రత్నం : ముత్యం
    నైవేద్యం : పెరుగన్నం

    మంగళ :
    అంగారకుడు ( ఎర్రని వర్ణం కలవాడు) అని కూడా పిలుస్తాం.ఇతను భూదేవి కుమారుడు. మేష, వృశ్చిక రాసులకిఅధిపతి. దక్షినాభిముఖుడు. రుచక మహాపురుష యోగవిద్యను భోదిస్తాడు. తమోగుణ వంతుడు.
    భార్య / పిల్లలు / అన్నదమ్ముల వల్ల సమస్యలు ఉండేవారు,స్నేహితులతో శత్రుత్వం, సంపదను కోల్పోయిన వారు మంగళ దేవుడిని పూజించటంవలన సత్ఫలితాలను పొందుతారు.
    అధిదేవత : భూదేవి
    ప్రత్యదిదేవత : క్షేత్ర పాలకుడు
    వర్ణం: ఎరుపు
    ధాన్యం : కందిపప్పు
    పుష్పం : సంపంగి మరియు తామర
    వస్త్రం : ఎరుపు రంగు వస్త్రం
    జాతి రత్నం : ఎర్రని పగడం
    నైవేద్యం : కందిపప్పు తో కూడిన అన్నం
    బుధుడు :
    తార, చంద్రుల పుత్రుడు బుధుడు. రజోగుణవంతుడు. పుత్రదోషం, మంద విద్య, చంచలమైన మనసు కలవారు బుధునిపూజలు చేసి ఉపసమనం పొందుతారు. తెలివితేటల వృద్ధి,సంగీతం, జ్యోతిష్యం, గణితం, వైద్యం వంటి వాటిలోరానిచాలంటే బుధుడి అనుగ్రహం పొందాలి.మిధున మరియు కన్యారాశి కి అధిపతి బుధుడు. తూర్పు -ఉత్తర ముఖుడై ఉంటాడు.
    అధిదేవత : విష్ణు
    ప్రత్యధిదేవత : నారాయణుడు
    వర్ణం : చిగురాకు పచ్చ
    వాహనం : సింహం
    ధాన్యం : పచ్చ పెసర పప్పు
    వస్త్రం : పచ్చని రంగు వస్త్రం
    జాతి రత్నం : పచ్చ
    నైవేద్యం : పెసరపప్పు తో కూడిన అన్నం
    గురు :
    బృహస్పతి అని కూడా అంటాము.. దేవతలకు, దానవులగురువైన శుక్రాచారుడికి గురువు ఇతను. సత్వగుణసంపన్నుడు. పసుపుపచ్చ / బంగారు వర్ణం లో ఉంటాడు.పేరు ప్రఖ్యాతులు, సంపద, తోడ బుట్టినవారి క్షేమము కొరకుగురువు ని పూజించాలి 
    ధన్నురాశి, మీనా రాశిలకు అధిపతి. ఉతరముఖుడైఉంటాడు.

    అధిదేవత : బ్రహ్మ
    ప్రత్యధిదేవత : ఇంద్రుడు
    వర్ణం: పసుపు
    వాహనం : గజరాజు
    ధాన్యం : వేరుసెనగ పప్పు
    పుష్పం : మల్లె
    వస్త్రం : బంగారు రంగు వస్త్రం
    జాతి రత్నం : పుష్య రాగం
    నైవేద్యం : సెనగపప్పు తో కూడిన అన్నం
    శుక్రుడు :
    ఉషన, బృగు మహర్షి ల సంతానం. అసురులకుగురువు ఇతను. రజోగుణ సంపన్నుడు. ధవళ వర్ణంతో మద్యవయస్కుడిగా ఉంటాడు. ఒంటె / గుఱ్ఱము /మొసలి వాహనంగా కల్గి ఉంటాడు.అనుకోని పరిస్థితుల వల్లన కుటుంబాలు విడిపోవడంలేక తగాదాలు రావడం , బాగా కలిసి ఉండేవారిమద్యలో శత్రుత్వం కలగడం మొదలైన విపత్కరపరిస్థితులనుండి శుక్రాచార్యుని పూజ వలన బయటపడే అవకాశం ఉంది.
    వృషభ, తులరాశులకు అధిపతి.
    అదిదేవత : ఇంద్రుడు
    వర్ణం : తెలుపు
    వాహనం : మొసలి
    ధాన్యం : చిక్కుడు గింజలు
    పుష్పం : తెల్లని తామర
    వస్త్రం : తెల్లని వస్త్రం
    జాతి రత్నం : వజ్రం
    నైవేద్యం : చుక్కుడు గింజల తో కూడిన అన్నం

    శని :
    సూర్యభగవానుడి పుత్రుడు శని. భార్య ఛాయా దేవి (నీడ). నల్లని వర్ణం తో, నలుపు వస్త్రధారణతో, కాకివాహనంగా కలిగి ఉంటాడు.
    శని దేవుడిని అందరు తిడ్తూ ఉంటారు. నిజామే అలాoటిబాధలు పెడతాడు శని. మనల్ని ఎంతగా బాధ పెట్టికష్టాలు పెడతాడో, అంతకంటే ఎక్కువ మంచి చేసివెళ్తాడు.కుంభ, మకర రాసులకి అధిపతి. పడమటి వైపు ముఖాసీనుడై ఉంటాడు.
    అదిదేవత : యముడు
    ప్రత్యధిదేవత : ప్రజాపతి
    వర్ణం : నలుపు
    ధాన్యం : నల్ల నువ్వులు
    పుష్పం : నల్లని తామర
    వస్త్రం : నల్లని వస్త్రం
    జాతి రత్నం : నీలం
    నైవేద్యం : నల్లని నువ్వులు కలిపిన అన్నం

    రాహువు :
    సూర్య చంద్ర గ్రహాణాలకు కారకుడు గా చెప్పబడేరాహువు ను ఒక పాము రూపం లో వర్ణిస్తారు. ఒకకత్తి ని ఆయుధంగా చేసుకొని, ఎనిమిది నల్లటిగుర్రాలను అధిరోహిస్తూ ఉంటాడు.పుత్ర దోషం, మానసిక రోగాలు, కుష్టు మొదలైనవిరాహు ప్రభావములే.పడమర - దక్షినాభిముఖుడై ఉంటాడు.
    అదిదేవత : దుర్గ
    ప్రత్యధిదేవత : పాము
    వర్ణం : నలుపు
    వాహనం : 
    నలుపు సింహం
    ధాన్యం : మినుగులు
    పుష్పం : అడవి మందారం
    జాతిరత్నం : గోమేధుకం
    వస్త్రం : నల్లటి వస్త్రం
    నైవేద్యం : మినుగులతో కూడిన అన్నం

    కేతువు :
    భార్య చిత్రలేఖ. ఆస్తి నష్టం, చెడు అలవాట్లు, పుత్ర దోషంమొదలైనవి తొలగాలంటే కేతు పూజలు చేయాలి.ఉత్తరం - పడమటి ముఖాసీనుడై ఉంటాడు.

    అదిదేవత : చిత్రగుప్తుడు
    ప్రత్యధిదేవత : బ్రహ్మ
    వర్ణం : ఎరుపు
    వాహనం : గద్ద
    ధాన్యం : ఉలవలు
    పుష్పం : ఎర్రని కలువ
    వస్త్రం : రంగురంగుల వస్త్రం
    జాతి రత్నం : వైడుర్యం
    నైవేద్యం : ఉలవల అన్నం.