Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.
Showing posts with label వెండి పాత్రలు వాడుటకు సుముహూర్త నిర్ణయము. Show all posts
Showing posts with label వెండి పాత్రలు వాడుటకు సుముహూర్త నిర్ణయము. Show all posts

బంగారు,వెండి పాత్రలు వాడుటకు సుముహూర్త నిర్ణయము

  • June 24, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • లేబుళ్లు: ,

  • బంగారు,వెండి పాత్రలు వాడుటకు సుముహూర్త నిర్ణయము

    బంగారం,వెండి,ష్టీలు పాత్రలు వాడుటకు: 
    బుధ,గురు,శుక్రవారములు; అశ్వి,రోహి,మృగ,పున,పుష్య,ఉత్తరాత్రయం,హస్త,చిత్త,స్వాతి,అనూ,శ్రవ,శత,రేవతి నక్షత్రములందు,అమృతయోగ గడియలందు భుజించుట మంచిది.
    కార్లు,లారీలు,స్కూటర్లు,సైకిళ్ళు,క్రొత్త వాహనాలు ప్రారంభించుటకు: 
    సోమ,బుధ,గురు,శుక్ర వారములు ;2,3,5,7,10,11,13,15 తిధులు ; అశ్వి,రోహి,పున, పుష్య, ఉత్తరాత్రయం, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, జ్యేష్ట, శ్రవ, రేవతి నక్షత్రము, వృష, మిధున, కర్కాటక, కన్య,తుల,ధనుః,మీన లగ్నముల యందు అష్టమశుద్ధి గల పగటి భాగమునందు ప్రారంభించవలెను.రాత్రి ప్రారంభించరాదు.
    గ్యాస్ ష్టవ్,ఫ్రిజ్,మిక్సీ,గ్రైండర్,వాషింగ్ మెషీన్ వంటి ఆధునిక పరికరములు వాడుటకు: 
    మంగళ,బుధ,గురు,శుక్ర,శని వారములు; 2,3,5,7,10,11,13 తిధులందు వర్జ్యము,దుర్ముహూర్తము లేని కుజహోర యందు ప్రారంభించిన చాలాకాలము మన్నిక నిచ్చును.
    మంచము,కుర్చీలు,టేబుల్స్ వగైరా ఫర్నిచర్ వాడుటకు: 
    బుధ,గురు,శుక్ర వారములు 1,2,3,5,7,10,11,13 తిధులు; అశ్వి, రోహి, మృగ, పున, పుష్య, ఉత్తరాత్రయం, హస్త, చిత్త, అనూ, శ్రవ, శత, రేవతి నక్షత్రములు మంచివి.
    కొత్త జోళ్ళూ కొనుటకు,వాడుటకు: 
    బుధ,శని, ఆది వారములు; కృత్తిక, ఆర్ద్ర, మృగశిర, మఘ, పుబ్బ, ఆశ్లేష, చిత్త, విశాఖ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, పూర్వాభాద్ర, రేవతి నక్షత్రములు మంచివి.